నృసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం నిత్యారాధనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున అర్చకులు ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ జరిపించారు. అనంతరం నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేసి, భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం పూర్తిగావించారు. సాయంత్రం జోడుసేవలను మాడ వీధుల్లో ఊరేగించి, రాత్రి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
స్టేట్ టాలెంట్ టెస్ట్‌కు ఎన్నారం విద్యార్థి
రామన్నపేట: మండలంలోని ఎన్నారం గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన బండమీది సిరి స్టేట్ బయోసైన్స్ టాలెంట్ టెస్ట్‌కు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు రత్నమాల తెలి పారు. గురువారం భువనగిరిలో నిర్వహించిన జిల్లాస్థాయి టెస్ట్‌లో ద్వితీయస్థానం పొందినట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న సిరితోపాటు గైడ్ టీచర్ నీలం శేఖర్‌ను డీఈఓ సత్యనారాయణ అభినందించారు.
వంద శాతం ఫలితాలకు కృషి చేయాలి
మోత్కూరు: ఇంటర్మీడియట్‌లో విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్య నోడల్ అధికారి శ్రీరమణి అన్నారు. గురువారం మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యా బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృత్తి విద్యా కేంద్రాలను సందర్శించారు. ప్రిన్సిపాల్ ప్రభా జస్టిస్ అధ్యక్షతన అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల్లో భయాన్ని, అపోహలను తొలగించేందుకు హార్ట్‌ఫుల్‌నెస్ ఎక్స్‌పీరియన్స్ లైఫ్ ప్రొటెన్షియల్ (హెచ్‌ఈఎల్‌పి) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం బ్రదర్ రవీందర్, బ్రదర్ మునీందర్ విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అదేవిధంగా రామన్నపేట మొబైల్ టీమ్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
గృహహింసకు పాల్పడితే కఠిన చర్యలు
యాదగిరిగుట్ట రూరల్: గృహ హింసకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత అన్నారు. గురువారం యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సీ్త్ర, శిశు, సంక్షేమ శాఖ, మండల్ పరిషత్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా గృహహింస, లైంగిక వేధింపుల చట్టంపై అంగన్‌వాడీ, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. సమావేశంలో సార్ప్ ఎన్‌జీ ప్రమీల, భువనగిరి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జయ, స్వామి, శ్రీహరి, నాగేంద్రమ్మ, రాజిరెడ్డి, ఎంపీఓ సలీం, సఖి అడ్మిన్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment