శరీర ఉష్ణోగ్రతలో సమతుల్యత అవసరం
ఫ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజారావు సూచన
భువనగిరి : చలితీవ్రతకు శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.. ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజారావు. లేనిపక్షంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.
● చలికాలం శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండాలి.ఇందుకోసం పండ్లు, ఆకుకూరలు, పాలు వేడిగా తీసుకోవాలి.
● చలివాతావరణంలో వైరస్‌లు సులభంగా వ్యాప్తి చెందుతాయి. తద్వారా రోగనిరోధకశక్తి తగ్గి జలుబు, దగ్గు, జ్వరంతో పాటు గొంతునొప్పి చేస్తుంది.
● చలికి వాకింగ్ మానేస్తారు. దీంతో శరీరానికి సూర్యరశ్మి తగలకపోవడంతో డి విటమిన్ లోపం ఏర్పడి జీర్ణ సంబంధిత, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయి.
● రక్తనాళాలు కుదించుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.
● శరీరంపై దురద ఏర్పడుతుంది. చేతి
వేళ్లతో స్పర్శించడం ద్వారా చర్మ ఇన్‌ఫెక్షన్ వస్తుంది.
● కంటిలో డ్రైరెన్ సమస్య ఏర్పడి నీరు లేకుండా మారుతుంది.
● మద్యం, సిగరెట్లు, బీడీలు మానేయాలి.
● శరీరం పొడిబారకుండా కోల్డ్‌క్రీంలు లేదా కొబ్బరినూనె వాడాలి. మంకీ క్యాప్‌లు, స్వెటర్లు ధరించాలి.
Comments
Please login to add a commentAdd a comment