బదిలీలకు బేరసారాలు!
జిల్లాలో 60నుంచి 70 మంది
ప్రయత్నాలు
జీఓ 317 వల్ల యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొంతమంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. వారంతా సొంత జిల్లాకు రావడానికి ఎంతైనా చెల్లించడానికి వెనుకాడడం లేదని సమాచారం. ఇందులో ప్రధానంగా 2017 డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులు సొంత జిల్లాకు రావడం కోసం ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. దీనిని ఆసరాగా తీసుకుని కొంతమంది ఉపాధ్యాయులు ఏజెంట్ల అవతారం ఎత్తి బేరసారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 3,520 మంది ఉపాధ్యాయులకు గాను ప్రస్తుతం 2,894 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా కల్పించిన వెసులుబాటుతో 60 నుంచి 70 మంది పరస్పర బదిలీకి ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా పరస్పర బదిలీకోసం ఈనెల 30వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
భువనగిరి : జీఓ 317 కారణంగా పలువురు ఉపాధ్యాయులు ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నారు. ఇలాంటి వారికి కోసం స్పౌజ్, మెడికల్, పరస్పర బదిలీలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పరస్పర బదిలీలు కోరుకుంటున్న ఇద్దరిలో ఒకరు జీఓ 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయుడై ఉండాలన్న నిబంధన ఉంది. ఇద్దరి సమ్మతితోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరస్పర బదిలీకి సిద్ధమయ్యే వారికి కోసం ఉపాధ్యాయులు అన్వేసిస్తున్నారు. ఈ క్రమంలో ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బేరసారాలునడుస్తున్నట్లు చర్చ నడుస్తోంది. గతంలో కూడా పరస్పర బదిలీకి అకాశం కల్పించినప్పుడు ఇదే విధంగా జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి.
ఎవరికి వారు ప్రయత్నాలు
కొత్త జిల్లాలు, జోన్ల ప్రాతిపదికన ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులను అలాట్ చేసేందుకు జీఓ నంబర్ 317ను ప్రభుత్వం తీసుకువచ్చింది. సీనియర్లు సొంత జిల్లాలోనే ఉండగా జూనియర్లు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. 317 జీఓ వల్ల ఎంతో నష్టపోయామని, కుటుంబాలకు దూరంగా గడపాల్సి వస్తుందని జూనియర్ ఉపాధ్యాయులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీఓ 317పై కమిటి వేసింది. కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మెడికల్, స్పౌజ్, పరస్పర బదిలీలకు అకాశం కల్పించింది. దీన్ని కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తాము కోరుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి బేరసారాలకు తెరలేపినట్లు తెలుస్తోంది.
ఫ జీఓ 317 కారణంగా ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు
ఫ పరస్పర బదిలీకి అవకాశం కల్పించిన ప్రభుత్వం
ఫ సొంత జిల్లాకు వచ్చేందుకు ప్రయత్నాలు
ఫ ప్రాంతాన్ని బట్టి రూ.5లక్షల నుంచి
రూ.10లక్షల వరకు బేరం!
Comments
Please login to add a commentAdd a comment