టెన్త్ ఫలితాల్లో మొదటి స్థానంలో నిలపాలి
భువనగిరి : పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలపాలని డీఈఓ సత్యనారాయణ పేర్కొన్నారు. భువనగిరిలోని బీచ్‌మహల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జీవశాస్త్రం ఫోరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రతిభా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. టెన్త్ విద్యార్థులను వార్షిక పరీక్షలకు సమాయాత్తం చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం ప్రతిభా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యుడు భాస్కర్, జీవశాస్త్రం ఫోరం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి విజయప్రతాప్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ విష్ణు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫ డీఈఓ సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment