భువనగిరిటౌన్: బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోందని, వీటికి భయపడేది లేదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సమస్యలపై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వానికి సమాధానాలు దొరకడం లేదని విమర్శించారు. ఈ కార్ రేసింగ్ ద్వారా రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment