కోదాడ రూరల్: సూర్యాపేట జిల్లా కోదాడ పీఏసీఎస్‌ను నాబార్డు కేంద్ర ప్రతినిధుల బృందం శుక్రవారం సందర్శించింది. సంఘం నుంచి రైతులకు అందజేస్తున్న క్రాప్, ఎల్టీ, గోల్డ్ రుణాల తీరును స్ట్రాంగ్‌ను పరిశీలించారు. సంఘంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు ప్రభుత్వం ప్రకటించిన రూ.2లక్షల రుణమాఫీ ఎంత మందికి వర్తించింది అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాబార్డు ప్రతినిధి అనురాగ్‌శర్మ మాట్లాడుతూ.. వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించి మూడు శాతం రాయితీ పొందాలని సూచించారు. బంగారంపై కమర్షియల్ బ్యాంకుల కంటే ఒక శాతం తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నామని తెలిపారు. రైతులు కమర్షియల్ బ్యాంకుల్లో కాకుండా వ్యవసాయ సహకార సంఘాల్లో డిపాజిట్లు చేస్తే మరిన్ని సేవలు అందజేస్తామన్నారు. రైతులకు కావాల్సిన అన్నిరకాల రుణాలు, ఎరువులు, విత్తనాలు సహకార సంఘాల నుంచే అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment