మినీ శిల్పారామం | - | Sakshi
Sakshi News home page

మినీ శిల్పారామం

Published Sun, Dec 22 2024 1:13 AM | Last Updated on Sun, Dec 22 2024 1:13 AM

మినీ

మినీ శిల్పారామం

రాయగిరి చెరువు చెంతన ఏర్పాటు.. జనవరిలో ప్రారంభానికి సన్నాహాలు

యాదగిరిగుట్టలో మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న వడ్లోజు వెంకటేష్‌ తదితరులు

జిల్లాకే

మణిహారం

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి వచ్చే భక్తులకు ఆహ్లాదం పంచడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేందుకు రాయగిరి చెరువు చెంతన దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో మినీ శిల్పారామం రూపుదిద్దుకుంటోంది. గత ప్రభుత్వం హయాంలో వైటీడీఏ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించగా అవి తుది దశకు చేరాయి. మరో ఐదు శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.

సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా..

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మినీ శిల్పారామం వేదిక కానుంది. చేనేత, హస్త కళాకారులు తయారు చేసిన దుస్తులు, చెక్క బొమ్మలు, ఒడిశా, ఇతర కళాకారులు రూపొందించిన బొమ్మల స్టాళ్లు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. వీటితో పాటు క్రాఫ్ట్‌, కల్చరల్‌, మ్యూజియం అందుబాటులోకి తేనున్నారు. రాయగిరి చెరువు వ్యూ, ప్రధాన రహదారి కనిపించేలా అధునాతన రెస్టారెంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

పర్యాటక శోభను సంతరించుకునే మినీ శిల్పారామం.. సంస్కృతి, సంప్రదాయలకు వేదికగా నిలవనుంది. భారీ స్వాగత తోరణాలు.. గుర్రపు విగ్రహాలు.. ఒడిశాలో రూపుదిద్దుకున్న సాండ్‌ స్టోన్‌ శిల్పాలు.. వాటర్‌ ఫాల్‌.. బోటింగ్‌.. పల్లె సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబింపజేసే బొమ్మలు.. హస్తకళల స్టాళ్లు.. ఇలా మరెన్నో పల్లె అందాలను సంతరించుకుంటోంది.. మినీ శిల్పారామం. రాయగిరి చెరువు చెంతన రూపుదిద్దుకుంటున్న మినీ శిల్పారామం కొత్త సంవత్సరంలో అందుబాటులోకి రానుంది.

ఘనంగా వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకలు

యాదగిరిగుట్ట : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలను శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్‌ అడ్వైజరీ మాజీ సభ్యుడు వడ్లోజు వెంకటేష్‌, వైస్సార్‌సీపీ నాయకుడు సుర్వి వెంకటేష్‌గౌడ్‌ తదితరులు వైకుంఠద్వారం వద్ద కేక్‌ కట్‌ చేశారు. నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకొలను సతీష్‌రాజ్‌, చిందం కృష్ణ, యాదగిరి, నగేష్‌, గణేష్‌, యాదమ్మ, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

వైజ్ఞానిక సభలను జయప్రదం చేయాలి

భువనగిరి : నల్లగొండలో ఈనెల 28నుంచి 30వ తేదీ జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎప్‌) రాష్ట్ర 6వ విద్యా, వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముక్కెర్ల యాదయ్య, మెతుకు సైదులు కోరారు. శనివారం భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో మహాసభల పోస్టర్‌ను టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. సభలకు ముఖ్య అతిథిగా శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హాజరుకానున్నారని, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జీవీ రమణారావు, శ్రీదేవి, కరుణాకర్‌, బాలయ్య, కృష్ణారెడ్డి, వెంకటేష్‌, సుదర్శన్‌రెడ్డి, మల్లేశం, హరిశంకర్‌, సరిత, మురళీకృష్ణ, రవికుమార్‌ పాల్గొన్నారు.

భారీ స్వాగత తోరణం

భక్తులు, పర్యాటకులను ఆకర్షించే విధంగా శిల్పారామానికి వచ్చే ప్రారంభంలో తాటిచెట్టు మొద్దులు, ఫైబర్‌ మెటల్‌తో భారీ స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. ఈ స్వాగత తోరణానికి ఇరువైపులా సుమారు 15 ఫీట్ల ఎత్తులో గుర్రాల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఒడిశానుంచి పది భారీ రాతి శిల్పాలను (సాండ్‌ స్టోన్‌ శిల్పాలు) తీసుకువచ్చి గార్డెన్‌లో అమర్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మినీ శిల్పారామం1
1/2

మినీ శిల్పారామం

మినీ శిల్పారామం2
2/2

మినీ శిల్పారామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement