నారసింహుడి క్షేత్రంలో నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టి.. గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీ అర్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ప్రథమ ప్రాకార మండపం, ముఖ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకు న్నారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని మూసివేశారు.
Comments
Please login to add a commentAdd a comment