ప్రజావాణి పునఃప్రారంభం
భువనగిరిటౌన్: గ్రూప్– 2 పరీక్షల నేపథ్యంలో రద్దు చేసిన ప్రజావాణి పునఃప్రారంభించనున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగే ప్రజావాణికి ఆర్జీలు తీసుకుని రావాలని కలెక్టరేట్ అధికారులు కోరారు.
కేంద్ర మాజీ మంత్రి
వెంకటస్వామికి నివాళి
భువనగిరిటౌన్: కలెక్టరేట్‌లో ఆదివారం కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి చిత్రపటానికి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్ సుందర్, వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల
అడుగుజాడల్లో నడవాలి
రాజాపేట: మహనీయుల అడుగుజాడల్లో నడవాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. రాజాపేట మండలంలోని కొత్తజాల గ్రామంలో గంధమల్ల బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆదివారం వారు ఆవిష్కరించారు. మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు సహకరించిన కరాటే బాలు, మాజీ సర్పంచ్ ఠాకూర్ ధర్మేందర్ సింగ్‌ను అభినందించారు. అంతకుముందు జాలలో సీసీ రోడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, మీర్ పేట్ మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, బోడుప్పల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొమ్మ రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గొల్లపల్లి రాంరెడ్డి, సిలివేరు బాలరాజు గౌడ్, విఠల్ నాయక్, తదితర నాయకులు పాల్గొన్నారు.
జన్మభూమి
రుణం తీర్చుకోలేనిది
రామన్నపేట: కన్నతల్లి వంటి జన్మభూమి రుణం తీర్చుకోలేనిదని ఎస్పీ జోగుల చెన్నయ్య అన్నారు. ఇటీవల ఎస్పీగా పదోన్నతి పొందిన లక్ష్మాపురం గ్రామానికి చెందిన జోగుల చెన్నయ్యను ఆదివారం గ్రామస్తులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, గురువులు, గ్రామప్రజల ఆశీస్సులతో ఎస్పీ స్థాయికి ఎదిగానన్నారు. గ్రామంలోని యువత విద్య, ఉద్యోగ, క్రీడ, రాజకీయ రంగాల్లో రాణించాలని కోరారు. గ్రామాభివృద్ధికి తమ కుటుంబం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు బత్తుల శంకరయ్య, బత్తుల కృష్ణగౌడ్, ఉప్పు ప్రకాష్, చిల్లర కై లాసం, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు ఉప్పు ఈశ్వరయ్య, రిటైర్డ్ టీచర్ కక్కిరేణి నాగభూషణం, నర్సింహ, చక్రహరి రామరాజు, బత్తుల మల్లేశం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment