రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్
యాదగిరిగుట్ట: రైతు సంక్షేమానికి నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో ఆదివారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు – 2024 నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఒకప్పుడు సాగు అంటే సంతోషంగా ఉండేదని, వైఎస్సార్ రైతులకు భరోసాగా నిలిచారన్నారు. ఈరోజు వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్తోందన్నారు. కొన్ని ప్రభుత్వాలు రైతులను విస్మరించి, కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహించడంతో రైతాంగం ఆగమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. అందుకే 2004లో దేశంలో ఎక్కడ లేని విధంగా దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించారన్నారు. రైతులకు అండగా నిలవాలని భావించి జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు నిర్మించింది వైఎస్సార్ అని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో 25లక్షల మందికి రూ.2లక్షల రుణమాఫీ చేశామన్నారు. వచ్చే సంక్రాంతికి రూ.7,500 రైతు భరోసాను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఫ్లోరైడ్‌ను శాశ్వతంగా తరిమేందుకు ఎస్‌ఎల్‌బీసీ, మూసీని శుద్ధీకరణ చేసేందుకు ప్రభుత్వం పూనుకుందన్నారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. మల్లన్న సాగర్ కొండపోచమ్మ నుంచి బస్వాపూర్, గంధమల్ల ప్రాజెక్టులకు నీళ్లు తీసుకువచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని బతికించుకోవాలంటే రైతులకు సుస్థిర విజ్ఞాన సదస్సు చాలా అవసరమని పేర్కొన్నారు.
రైతుల అభివృద్ధికి కృషి
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయంపై ఎలా ముందుకెళ్లాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ద్వారా ప్రోత్సహించడం చాలా సంతోషకరమన్నారు. దేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, గ్రామాల్లో వ్యవసాయంపై పట్టుండాలని మహాత్మా గాంధీ ఆనాడే చెప్పారని, అందుకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, జీజీపీ చైర్మన్ గున్నా రాజేందర్‌రెడ్డి, సదస్సు కన్వీనర్ పడమటి పావనిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మెరుగు మధు, జిల్లా అధ్యక్షుడు మాటూరి అశోక్, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, కొత్త బాలరాజు, ఉప్పల శ్రీనివాస్‌గుప్త, వెన్‌రెడ్డి రాజు, ఎరుకల సుధా హేమేందర్, బొబ్బిలి దామోదర్‌రెడ్డి, ఐనాల చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2004లోనే రైతులకు
ఉచిత విద్యుత్ ఇచ్చారు
సంక్రాంతికి రైతు భరోసా
ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
యాదగిరిగుట్టలో
గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు
గుండాలకు 108 అంబులెన్స్
గుండాల మండలానికి నూతనంగా మంజూరైన 108 అంబులెన్సు వాహనాన్ని ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో సేవలందించే 108 అంబులెన్స్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ చైతన్యరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎరుకల సుథ, నాయకులు చీర శ్రీశైలం, గుండ్లపల్లి భరత్‌గౌడ్, భిక్షపతిగౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment