మోటకొండూరు కాంగ్రెస్‌లో ముసలం
మోటకొండూరు : కాంగ్రెస్ పార్టీలో ఓ పక్క ప్రజా విజయోత్సవాలు జరుగుతుండగా మరోపక్క మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇటీవల జరిగిన యువజన కాంగ్రెస్ కమిటీ ఎన్నికల్లో తన బంధువర్గానికి పెద్దపీట వేశారని.. ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బీర్ల ఐలయ్య బంధువుల చేతిలో బంధీ అయిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీరబోయిన మల్లేష్ యాదవ్ విమర్శించారు. ఆదివారం మోటకొండూరు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ నూతన కమిటీలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో విమర్శలు చేశారు. పది సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండా మోస్తూ బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన నాయకులను కాదని ఎన్నికల ముందు పార్టీలో చేరిన తన సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం ఎమ్మెల్యేకు తగదన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి వెలిమినేడు సురేష్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్, నాయకులు, అనంతల నవీన్ రెడ్డి, బుగ్గ శ్రీను, బుగ్గ పర్వతాలు, మంజూర్, బుగ్గ శ్రీశైలం, వంగపల్లి మహేందర్, జంపాల నాగచందర్, వంగపల్లి శ్రీనివాస్, గాజుల వెంకటేష్, తాళ్లపల్లి వెంకటయ్య, జంగారెడ్డి, పంజాల పెంటయ్య, ఉపేందర్ రెడ్డి ఉన్నారు.
యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో
ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన బంధువులకు
పెద్దపీట వేశారని ఆరోపణ
ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు
చర్చనీయాంశంగా మారిన ఫ్లెక్సీ
మోటకొండూరు మండల కేంద్రంలో జరిగిన యువజన కాంగ్రెస్ ఆత్మీయ సన్మాన కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఫొటో లేకుండా ఫ్లెక్సీ వేయడంతో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. సమావేశం ప్రారంభం నుంచి ముగింపు వరకు సమావేశంలో మాట్లాడిన వక్తలు ఎమ్మెల్యే ఐలయ్యపై తీవ్ర స్థాయి లో విమర్శలు చేశారు. అనంతరం కాంగ్రెస్ నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. అంతకుముందు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment