చేజికి్కంచుకుంది!
డీసీసీబీ కైవసం
ఉమ్మడి జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌ను (డీసీసీబీ) ఆవిశాస అస్త్రంతో కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో డీసీసీబీ చైర్మన్‌గా ఆలేరుకు చెందిన గొంగిడి మహేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన నేపథ్యంలో డీసీసీబీ ఛైర్మన్ పీఠంపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. బీఆర్‌ఎస్ డైరెక్టర్లను సమీకరించి కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి మెజార్టీ సభ్యులతో జూన్ 28వ తేదీన అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా సహకార అధికారికి అందజేశారు. జూలై 1వ తేదీన ఎన్నిక నిర్వహించగా మెజార్టీ డైరెక్టర్లు కుంభం శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా నిలువడంతో ఆయన ఏకగ్రీవంగా చైర్మన్ అయ్యారు.
2024లోనూ కాంగ్రెస్ జోష్.. భువనగిరిలో వరుసగా రెండోసారి గెలుపు
సాక్షి యాదాద్రి : జిల్లాలో ఈ ఏడాది రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఐదు స్థానాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్.. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే జోష్ కొనసాగించింది. దశాబ్దాకాలంపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ పార్టీకి చేదు అనుభవం మిగిలింది. లోక్‌సభ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయి ఘోర పరాజయం మూటగట్టుకుంది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పట్టు పెంచుకుంది. కీలకమైన డీసీసీబీ పీఠంతో పాటు భువనగిరి, మోత్కూరు మున్సిపాలిటీలను అవిశ్వాసం ద్వారా హస్తగతం చేసుకుంది. ఆలేరులో బీఆర్‌ఎస్ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసం వీగిపోగా.. యాదగిరిగుట్ట, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ గూటికి చేరారు. రామన్నపేట ఎంపీపీపై అవిశ్వాసం ప్రకటించడంతో రాజీనామా చేసిన కారణంగా ఎంపీపీని కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుంది.
సిట్టింగ్ స్థానం పదిలం
భువనగిరి ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి కై వసం చేసుకుంది. గతంలో ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయ్యారు. దీంతో ఆ స్థానంలో ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. భారీ మెజారిటీతో గెలిపించుకుని స్థానాన్ని పదిలం చేసుకుంది.
పుంజుకున్న బీజేపీ
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఎన్నికల ఫలితాల తరువాత క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై పార్టీ నాయకత్వం దృష్టిసారించింది. అధిష్టానం పిలుపుమేరకు చేపట్టిన కార్యక్రమాల్లో బీజేపీ శాసనసభా పక్షనేత హరీశ్వర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఇక బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పాశం భాస్కర్ నియమితులయ్యారు.
కలవని కొడవళ్లు
లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పోటీ చేసి నామమాత్రపు ఓట్లు సాధించారు. సీపీఐ మాత్రం కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉంది. స్థానిక సమస్యలపై వామపక్షాలు పోరుబాట వీడలేదు. సీపీఏం జిల్లా కార్యదర్శిగా ఎండీ జహంగీర్ మూడవసారి ఎన్నికయ్యారు.
డీసీఎంఎస్‌కు కొత్త చైర్మన్
ఖాళీగా ఉన్న జిల్లా సహకార, మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ పదవిని కాంగ్రెస్ భర్తీ చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సూర్యాపేట పీఏసీఎస్ చైర్మన్ వట్టె జానయ్యను డీసీఎంఎస్ చైర్మన్ చేశారు. సమావేశాలు సక్రమంగా నిర్వహించని కారణంగా ఆయనను అనర్హునిగా 2023 అక్టోబర్ 23న సూర్యాపేట డీసీఓ ప్రకటించారు. దీంతో డీసీఎంఎస్ చైర్మన్ పదవిని జానయ్య కోల్పోయారు. ఆ తరువాత వైస్ చైర్మన్‌గా ఉన్న నారాయణరెడ్డి చైర్మన్‌గా వ్యవహరించారు. జూలై 19వ తేదీన నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన కేతేపల్లి పీఏసీఎస్ చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి డీసీఎంఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
కార్పొరేషన్ పదవుల్లో ప్రాధాన్యం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు చెందిన వారికి కీలక పదవులు కట్టబెట్టింది. మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా బండ్రు శోభారాణి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా మోత్కూరుకు చెందిన నాగరిగారి ప్రీతమ్‌ను నియమించింది.
మదర్‌డెయిరీ కాంగ్రెస్‌దే..
మదర్‌డైయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గుడిపాటి మధుసూదన్‌రెడ్డి విజయం సాధించారు.
పొలిటికల్
పటిష్ట స్థితికి హస్తం పార్టీ
అవిశ్వాసంతో డీసీసీబీ, పలు మున్సిపాలిటీలు,
ఎంపీపీ పీఠాలు హస్తగతం
మదర్ డెయిరీ ఎన్నికల్లోనూ విజయం
వరుస పరాజయాలతో బీఆర్‌ఎస్ డీలా
బలపడిన భారతీయ జనతా పార్టీ
జిల్లాకు దక్కిన నామినేటెడ్ పదవులు
మసకబారిన బీఆర్‌ఎస్ ప్రాభవం
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోస్థానంలో నిలువగా.. లోక్‌సభ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయింది. పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అధి ష్టానం పిలుపునిచ్చినా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు మొక్కుబడిగా పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment