![రెవెన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/28/27bng29-230002_mr-1738009186-0.jpg.webp?itok=1QHFEuPj)
రెవెన్యూ శాఖలో పదోన్నతులు
భువనగిరిటౌన్ : రెవెన్యూలో పలువురు సీనియర్ అసిస్టెంట్లు, ఆర్‌ఐలకు పదోన్నతులు కల్పిస్తూ ఆ శాఖ చీఫ్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు నాయిబ్ తహసీల్దార్ ఉపేందర్‌రెడ్డి నాయిబ్ తహసీల్దార్‌గా యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీపై రానున్నారు. ఇక్కడ సినియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సీహెచ్ యాదగిరి నాయిబ్ తహసీల్దార్‌గా సూర్యాపేట జిల్లాకు బదిలీ అయ్యారు. సూర్యాపేటలో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న జనగాం శైలజ యాదాద్రి జిల్లాకు రానున్నారు. నల్లగొండలో ఆర్‌ఐగా పనిచేస్తున్న సిరాజొద్దీన్, డి.లింగస్వామి నాయిబ్ తహసీల్దార్లుగా, సీనియర్ అసిస్టెంట్ పి.శివకుమార్ పదోన్నతిపై యాదాద్రి జిల్లాకు రానున్నారు.
జిల్లా కబడ్డీ జట్టుకు 30న క్రీడాకారుల ఎంపిక
ఆలేరు రూరల్ : వలిగొండ మండలం తుర్కపల్లిలో ఈనెల 30న సీనియర్ కబడ్డీ జిల్లా జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూల నగయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డుతో రావాలన్నారు. ఎంపికై న జట్టు ఫ్రిబవరి 4 నుంచి 7వ తేదీ వరకు అదిలాబాద్ జిల్లాలోని డైట్ కళాశాల మైదానంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు.
సురేందర్‌రెడ్డికి కేశవరావు జాదవ్ పురస్కారం
భువనగిరిటౌన్ : తెలంగాణ ఉద్యమకారుడు, విద్యావేత్త రావి సురేందర్‌రెడ్డి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ స్మారక పురస్కారం అందుకున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని నారాయణగూడలో గల భారతి డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రజాగాయని విమలక్క, ప్రముఖ జర్నలిస్ట్ పాశం యాదగిరి చేతులమీదుగా అవార్డు అందజేశారు. సురేందర్‌రెడ్డిని పలువురు అభినందించారు.
1నుంచి ‘అభయహస్తం’
సాక్షి యాదాద్రి : చేనేత అభయహస్తం పథకం ఫిబ్రవరి 1వ తేదీనుంచి అమలవుతుందని చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు పద్మ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. చేనేత, పవర్‌లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికులకు ఇప్పటికే జియో ట్యాగింగ్ నంబర్లు ఇచ్చామని, ఇంకా అర్హులైన నేత కార్మికులు ఉంటే నేరుగా వచ్చి ఏడీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్ములను ఎంపిక చేస్తాయని చెప్పారు. జియోట్యాగ్ కలిగి ఉన్న కార్మికులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తామన్నారు. జియోటాగ్ ఉన్న వారికే నేతన్న బీమా పథకం వర్తిస్తుందన్నారు. అలాగే నేతన్నకు భరోసా పథకం కింద ఏడాదికి రూ.18,000, అనుబంధ కార్మికుడికి రూ.6,000 కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు.
ప్రయోగాలతో ప్రత్యక్ష అనుభవం
భువనగిరి : ప్రయోగాలు, శాస్త్ర సాంకేతిక పరి కరాల ద్వారా ప్రత్యక్ష అనుభవం కలుగుతుందని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ పేర్కొన్నారు. సోమవారం భువనగిరిలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని డీఈఓ సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా సంబంధిత అంశాన్ని నేరుగా చూసినట్లు ఉంటుందన్నారు. ఉపా ధ్యాయులు ప్రయోగాత్మక బోధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ రాష్ట్ర కో ఆర్డినేటర్ శిరీష, జీఈసీఓ రాధ, కేజీబీవీల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
![రెవెన్యూ శాఖలో పదోన్నతులు1](https://www.sakshi.com/gallery_images/2025/01/28/27bng62-230007_mr-1738009186-1.jpg)
రెవెన్యూ శాఖలో పదోన్నతులు
![రెవెన్యూ శాఖలో పదోన్నతులు2](https://www.sakshi.com/gallery_images/2025/01/28/27bng09-604900_mr-1738009187-2.jpg)
రెవెన్యూ శాఖలో పదోన్నతులు
Comments
Please login to add a commentAdd a comment