![యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/30/29alr202-230014_mr-1738181245-0.jpg.webp?itok=RhFieZBp)
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజలు నేత్రపర్వంగా కొనసాగాయి. వేకుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. ఇక ప్రథమ ప్రాకార మండపం, ముఖ మండపంలో సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు.రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం జరిపించి ఆలయాన్ని మూసివేశారు.
Comments
Please login to add a commentAdd a comment