ఎన్నికలకు సమాయత్తం కావాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు సమాయత్తం కావాలి

Published Sat, Feb 1 2025 1:18 AM | Last Updated on Sat, Feb 1 2025 1:24 AM

ఎన్నికలకు సమాయత్తం కావాలి

ఎన్నికలకు సమాయత్తం కావాలి

చౌటుప్పల్‌ : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బీజేపీ మున్సిపల్‌, మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ను మరిచిపోయారని, హామీలను అమలు చేయని కాంగ్రెస్‌ పార్టీ సైతం అనతికాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేయాలని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేసి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికై న మండల అధ్యక్షుడు కై రంకొండ అశోక్‌, మున్సిపల్‌ అధ్యక్షురాలు కడారి కల్పనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్‌ దూడల భిక్షంగౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్‌, మాజీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ పోలోజు శ్రీధర్‌బాబు, నాయకులు కంచర్ల గోవర్ధన్‌రెడ్డి, చినుకని మల్లేష్‌, గుజ్జుల సురేందర్‌రెడ్డి, పాలకూర్ల జంగయ్య, ఊడుగు యాదయ్య, కాయితి రమేష్‌గౌడ్‌, శాగ చంద్రశేఖర్‌రెడ్డి, వనం ధనుంజయ్య, తడక సురేఖ, గోశిక నీరజ, ఉబ్బు భిక్షపతి, అమృతం దశరథ తదితరులు పాల్గొన్నారు.

ఫ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement