భువనగిరి : లక్ష డప్పుల గుండె చప్పుడు ప్రభుత్వం వింటే మంచిదని లేకుంటే.. భవిష్యత్తును తేల్చుకోవాలని ఎమ్మార్సీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఈ నెల 7న హైదరాబాద్‌లో జరగనున్న లక్ష డప్పులు–వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి అమలు చేయ డం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మూడు కమిషన్లు తీర్పు ఇచ్చాయన్నారు. బీసీలకు నాయకత్వం వహిస్తున్న ఆర్.కృష్ణయ్య నాలుగు కండువాలు మార్చి పదవులు పొందాడని, 36 ఏళ్లనుంచి తాను ఏ పదవీ తీసుకోకుండా ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అన్ని పార్టీలు, ప్రధాన మంత్రి, మంత్రులు అనుకూలంగా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలోని మాలలే అడ్డుకుంటున్నట్లు చెప్పారు. సమావేశానికి ముందు భువనగిరి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్సీఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దేవేందర్, చంద్రస్వామి, శ్రీనివాస్, శంకర్, గణేష్, దాన య్య, లింగస్వామి, కరుణాకర్, హరీష్, బట్టు రాంచంద్రయ్య, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మంద కృష్ణ మాదిగ
Comments
Please login to add a commentAdd a comment