రెండు నూతన పంచాయతీలకు గెజిట్
సాక్షి,యాదాద్రి : పెండింగ్‌లో ఉన్న రెండు నూతన గ్రామ పంచాయతీలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు 428కి చేరాయి. ఏడు నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తూ ఆగస్టులో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో గుర్జవానికుంట, తుర్కపల్లి మండలంలోని ఇందిరానగర్ సాంకేతిక కారణాలతో పెండింగ్ ఉండగా శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. 428 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి యంత్రాంగం సన్నద్ధవుతోంది. కలెక్టరేట్‌కు చేరిన బ్యాలెట్ పేపర్లను అదనపు కలెక్టర్ గంగాధర్ పరిశీలించారు.
ఫ 428కి చేరిన గ్రామ పంచాయతీలు
ఫ ఎన్నికలకు సిద్ధమవుతున్న యంత్రాంగం
Comments
Please login to add a commentAdd a comment