ఈఎస్‌ఐ ఉద్యోగుల నిరసన
భువనగిరి : ఈఎస్‌ఐను బంద్ చేసి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మంగళవారం భువనగిరి పట్టణంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి వద్ద ఉద్యోగులు భోజన విరామం సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక కార్పొరేషన్ ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె ఆశ్విని,సీహెచ్ మధులిక,స్టాప్‌నర్స్ చంద్రకళ, ప్రేమలత, ఫార్మసిస్ట్ అరవీణ, రమేష్‌రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment