రెండో రోజు నామినేషన్లు నిల్
నల్లగొండ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంగళవారం ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. మొదటి రోజు కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే వచ్చింది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేష్ల స్వీకరణ కొనసాగనుంది.
10 నుంచి నులిపురుగుల నివారణ దినోత్సవం
భువనగిరి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రామకృష్ణ తెలిపారు. మంగళవారం భువనగిరి మండలంలోని బొల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1 నుంచి 19 సంవత్సరాలలోపు పిల్ల లకు మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డాక్టర్ యామిని, శృతి, సిబ్బంది పాల్గొన్నారు.
హనుమంతుడికి
ఆకుపూజ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. హనుమంతుడికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగించారు.
క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే 90శాతం నియంత్రణ
భువనగిరి: క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే 90 శాతం వరకు నియంత్రించవచ్చని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శిల్పిని తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం భువనగిరి మండలంలోని బొల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జంక్ ఫుడ్స్‌తో ఎక్కువగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. జీవనశైలిని మార్చుకుంటే కొంత వరకు క్యాన్సర్‌కు దూరంగా ఉండవచ్చన్నారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఆడపిల్లలకు 9 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌పీహెచ్, ఎంపీహెచ్‌ఏఎఫ్‌ఎస్‌లు పాల్గొన్నారు.
‘చలో సెక్రటేరియట్’ను
విజయవంతం చేయాలి
మోత్కూరు: పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్‌లు బుధవారం చేపట్టనున్న చలో సెక్రటేరియట్‌తోపాటు మంత్రుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య కోరారు. మంగళవారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు.
10న అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ) : పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 10వ తేదీన సాయంత్రం 7 గంటలకు జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్‌ఎం జానిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రతీ పౌర్ణమికి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. బస్సులో ప్రయాణించే వారికి ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం, తమిళనాడు వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుందని తెలిపారు. వివరాలకు 9298008888ను సంప్రదించాలని కోరారు.
రెండో రోజు నామినేషన్లు నిల్
Comments
Please login to add a commentAdd a comment