![ఉత్తన్న (ఫైల్) - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/15/14plvd355a-170073_mr_0.jpg.webp?itok=VNVTgYP8)
ఉత్తన్న (ఫైల్)
వేంపల్లె : చక్రాయపేట మండలం కొండవాండ్లపల్లె గ్రామానికి చెందిన రైతు కేశినేని ఉత్తన్న(75) గురువారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తన్నకు 4ఎకరాల వరి పొలం ఉంది. రోజు మాదిరిగానే తమ పంట పొలాలను చూసేందుకు వెళ్లాడు. ఆ క్రమంలో గట్టు దాటుతుండగా జారి సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వైర్ల మీద పడ్డాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలానికి వెళ్లిన ఉత్తన్న మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం చుట్టూ వెతికేందుకు వెళ్లారు. అక్కడ విద్యుత్ షాక్‌కు గురైనట్లు గమనించి విద్యుత్ అధికారులకు ఫోన్ చేశారు. వెంటనే సంబంధిత అధికారులు విద్యుత్ లైన్‌ను ఆఫ్ చేసి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
గాలేరు–నగరి కాలువలో గుర్తుతెలియని మృతదేహం
ముద్దనూరు : మండలంలోని చిన్న దుద్యాల గ్రామ సమీపంలో గాలేరు–నగరి ప్రధాన కాలువలో గుర్తుతెలియని ఓ వ్యక్తి(30) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గురువారం సాయంత్రం కాలువలో ఓ మృతదేహం తేలియాడుతూ ఉండడంతో ఎస్‌ఐ చంద్రమోహన్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు.
యువకుడి ఆత్మహత్య
మదనపల్లె సిటీ : మదనపల్లె మండలం కోళ్లబైలుకు చెందిన ఓంప్రకాష్‌రెడ్డి(23) అనే యువకుడు బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె సిటీ: కుటుంబ సమస్యల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన తంబళ్లపల్లె మండలం బలకవారిపల్లెలో గురువారం జరిగింది. బలకవారిపల్లెకు చెందిన మహమ్మద్‌ఖా (23) ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment