త్రుటిలో తప్పిన ప్రమాదం.. | - | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన ప్రమాదం..

Published Fri, Sep 13 2024 1:18 AM | Last Updated on Fri, Sep 13 2024 1:18 AM

త్రుట

జమ్మలమడుగు రూరల్‌ : పట్టణంలోని సరస్వతి హైస్కూల్‌కు చెందిన విద్యార్థుల బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. వైఎస్సార్‌ జిల్లా గండికోట గ్రామానికి చెందిన 32 మంది విద్యార్థులను తీసుకుని సరస్వతి హైస్కూల్‌ బస్సు జమ్మలమడుగుకు బయలుదేరింది. మార్గమధ్యంలో వాహ నం అదుపు తప్పింది. అయితే డ్రైవర్‌ బస్సును కుడి వైపునకు మళ్లించడంతో ప్రమాదం తప్పింది. పోలీస్‌ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఏ ప్రమాదం జరగలేదని తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

బెల్ట్‌ షాప్‌ నిర్వాహకుడు అరెస్ట్‌

సింహాద్రిపురం : మండలంలోని అంకాలమ్మ గూడూరు గ్రామానికి చెందిన కానాల గంగాధర్‌ రెడ్డి తన ఇంటి వద్ద బెల్ట్‌ షాప్‌ నిర్వహిస్తుండగా గురు వారం తనిఖీ చేసి పట్టుకున్నట్లు ఎస్సై తులసీనాగప్రసాద్‌ తెలిపారు. అతని ఇంటిని సోదా చేయగా 27 క్వార్టర్ల మందు సీసాలు లభ్యమయ్యాయని, గంగాధర్‌రెడ్డిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

చెప్పకుండా.. ఆర్బీకేను కూల్చేశారు

ప్రొద్దుటూరు : అధికారులకు సమాచారం ఇవ్వకుండా చెన్నమరాజుపల్లె గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని కూల్చేశారని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావు తెలిపారు. గత నెల 26న సాక్షి దినపత్రికలో ‘రైతు భరోసా కేంద్రం కూల్చివేత’ వార్తకు ఆయన స్పందించారు. రైతు భరోసా కేంద్రానికి కేటాయించిన స్థలం గతంలో తనదని శ్రీనివాసులు చెప్పగా, పునాదులు తీసిన తర్వాత అదే గ్రామానికి చెందిన సురేష్‌ ఆ స్థలం తనదని కోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జేసీబీతో సురేష్‌ నిర్మాణాన్ని కూల్చివేశారని, దానిపై ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
త్రుటిలో తప్పిన ప్రమాదం.. 1
1/1

త్రుటిలో తప్పిన ప్రమాదం..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement