ఈ రాశివారికి వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూలం | Today Telugu Horoscope On October 14th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూలం

Published Mon, Oct 14 2024 6:54 AM | Last Updated on Mon, Oct 14 2024 8:48 PM

daily horoscope 14 october 2024 in telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.ద్వాదశి రా.12.26 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: శతభిషం రా.10.29 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: ఉ.6.38 నుండి 8.06 వరకు, తదుపరి తె.4.30 నుండి 5.58 వరకు (తెల్లవారితే మంగళ వారం), దుర్ముహూర్తం: ప.12.12 నుండి 1.00 వరకు, తదుపరి ప.2.33 నుండి 3.21 వరకు, అమృతఘడియలు: ప.3.34నుండి 5.05 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.56, సూర్యాస్తమయం: 5.37. 

మేషం.. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ఆకస్మిక ధనలాభం. ఒప్పందాలు చేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృషభం.. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

మిథునం.. మిత్రులతో కలహాలు. పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాలలో  మార్పులు. ఆధ్యాత్మిక చింతన. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో మరింతగా బాధ్యతలు.

కర్కాటకం.. సన్నిహితులతో మాటపట్టింపులు. దూరప్రయణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

సింహం.. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. వాహనయోగం. ఉద్యోగావకాశాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య.. మిత్రులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

తుల.. బంధువులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృశ్చికం.. మిత్రులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. శ్రమాధిక్యం. నిరుద్యోగులకు కొంత నిరాశ. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పైస్థాయి నుంచి సహాయం.

ధనుస్సు.. బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మకరం.. సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. నిరుద్యోగులకు నిరుత్సాçహం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కుంభం.. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. కొందరికి పదవీయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

మీనం.. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement