యాప్‌లో నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

యాప్‌లో నమోదు చేయాలి

Published Sat, Oct 5 2024 2:02 AM | Last Updated on Sat, Oct 5 2024 2:02 AM

యాప్‌లో నమోదు చేయాలి

కడప అగ్రికల్చర్‌: పంటలకు సోకిన తెగుళ్లు, పురుగులకు సంబంధించిన ఫొటోలను సీఎల్‌ఎస్‌(క్రాప్‌ లైఫ్‌ సిస్టమ్‌) పిడిఎస్‌ఎస్‌(పెస్ట్‌ డిసీజ్‌ సర్‌వివలెన్స్‌ సిస్టమ్‌)యాప్‌లలో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరావు పేర్కొన్నారు. విజయవాడ్‌ డాట్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు పరిశీలించి వాటికి తగిన పరిష్కారాలను చూపుతారని పేర్కొన్నా రు. శుక్రవారం కడప కలెక్టరేట్‌ సభాభవన్‌లో జిల్లాలోని రైతు సేవా కేంద్రాల అగ్రికల్చర్‌ అసిస్టెంట్స్‌కు సీఎల్‌ఎస్‌, పీడీఎస్‌ఎస్‌ యాప్‌ల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే రబీ సీజన్‌లో ప్రధానపంటలైన శనగ, వేరుశనగ పంటలలో ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు. రబీ సీజన్‌కు సంబంధించి విత్తనాల పంపిణీ రిజిస్ట్రేషన్‌ను కూడా వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఆయన సూచించారు. ఆత్మపీడి విజయలక్ష్మి, డాట్‌ సెంటర్‌ సైంటిస్టు అంకయ్యకుమార్‌, రైతు శిక్షణా కేంద్ర డీడీ రమణారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు శిల్పకళ, సాయి మహేశ్వరి,డీపీడీ పద్మలత, డీఆర్‌సీ ఏవో పద్మజ, శివశైలజ, నాగభూషణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement