పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆల్ ఇండియా సెంకడరీ టీచర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌టీఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి సదానందగౌడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శుక్రవారం కడపలోని వీణ విజయరామరాజు ఎస్టీయూ భవన్‌లో ఆయన ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపుగా లక్షలాది కుటుంబాలు సీపీఎస్‌తో ఇబ్బంది పడుతున్నాయన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకున్నాయని, దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. పెన్షన్ ఉద్యోగి హక్కుగా భావించి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం వారంలోగా సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చినా కూడా అది అమలు కాకపోవడం బాధాకరం అన్నారు. మాకు పాత పెన్షన్ విధానం తప్ప ఏ పెన్షన్ విధానం అంగీకారం కాదని తెలిపారు. అలాగే సీపీఎస్ ఉద్యోగి చెల్లిస్తున్న కాంట్రిబ్యూషన్, మ్యాచింగ్ గ్రాంట్స్ ఉద్యోగి ఖాతాలో ప్రతినెలా జమ అయ్యేటట్లుగా చూడాలన్నారు. రిటైర్ అయిన పెన్షనర్ కమ్యూటేషన్ విలువ తగ్గించారన్నారు. రిస్టోర్ సమయాన్ని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు సురేష్ బాబు, బాలగంగిరెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎస్.ఎం.డి ఇలియాస్ బాషా, రాష్ట్ర మునిసిపల్ కన్వీనర్ రవిశంకర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ వెంకట సుబ్బయ్య, సనావుల్లా భాస్కర్ ,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్‌టీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి
సదానందగౌడ్
Comments
Please login to add a commentAdd a comment