18న ఈపీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఈపీఎస్ 95 పెన్షన్ దార్ల సమస్యలపై పీఎఫ్ కార్యాలయం ఎదుట ఈ నెల 18న ధర్నా చేపడుతున్నట్లు పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.పెన్షన్‌దారులకు కనీస పెన్షన్ రూ. 9వేలు, డీఏ చెల్లించాలన్నారు. హయ్యర్ పెన్షన్ అందరకి ఇవ్వాలని, ఈపీఎస్ పెన్షనర్లకు ఉచితంగా ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయాలన్నారు. సీనియర్ సిటిజన్స్ అందరికీ రైలు ప్రయాణాల్లో రాయితీని తిరిగి కొనసాగించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు పరిశీలించి త్వరగా పరిష్కరించాలన్నారు. దేశవ్యాప్తంగా 35 లక్షల మంచికి కేవలం రూ. 1000 మాత్రమే చెల్లిస్తున్నారు. గత పదేళ్ల నుంచి కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని అఖిలభారత స్థాయిలో పెన్షన్ సంఘాలు ఢిల్లీలో ఆందోళన చేసినా ఈ ప్రభుత్వాల్లో ఎలాంటి చలనం లేదన్నారు. కార్యక్రమంలో హరిచంద్ర రెడ్డి, రామకష్ణారెడ్డి నారాయణరెడ్డి, సాంబశివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment