అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు | - | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు

Published Sat, Nov 16 2024 8:43 AM | Last Updated on Sat, Nov 16 2024 8:43 AM

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు

ఖాజీపేట : నాడు ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో కూటమి నేతలంతా ఊరు, వాడ, పట్టణం, నగరం తిరిగి వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై విషయం చిమ్మి గ్లోబెల్స్‌ ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధిపొందారు. నేడు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు, విష ప్రచారాలు బట్టబయలు అయ్యాయని వైఎస్సార్‌సీపీ నేత, ఏపీఎస్‌ ఆర్టీసీ మాజీ జోనల్‌ చైర్మన్‌ ఏపీఎస్‌ ఆర్టీసీ మాజీ జోనల్‌ చైర్మన్‌ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు కూటమి నేతలంతా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.శుక్రవారం ఖాజీపేట మండలం దుంపలగట్టులో రెడ్యం విలేకరులతో మాట్లాడారు. సూపర్‌ సిక్స్‌ల అమలును మరుగున పరిచేందుకు, అమలు పరచకుండా ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు ఇప్పటికీ నాటి ప్రభుత్వ అప్పులపై దుష్ప్రచారం చేయడం టీడీపీ నేతలకే చెల్లిందని ఎద్దేవా చేశారు. కూటమి వాగ్ధానాలు బారెడు–నిధులు మూరేడని, ఆ నిధులతో వాటిని ఎలా అమలుపరుస్తారని సూటిగా ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ నేత, ఏపీఎస్‌ ఆర్టీసీ

మాజీ జోనల్‌ చైర్మన్‌ రెడ్యం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement