ఉపాధ్యాయుల శిక్షణను వాయిదా వేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల శిక్షణను వాయిదా వేయాలి

Published Mon, Dec 16 2024 12:21 AM | Last Updated on Mon, Dec 16 2024 12:21 AM

ఉపాధ్యాయుల శిక్షణను వాయిదా వేయాలి

ఉపాధ్యాయుల శిక్షణను వాయిదా వేయాలి

కడప ఎడ్యుకేషన్‌ : జిల్లా వ్యాప్తంగా సమ్మెటివ్‌ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఉపాధ్యాయులకు నాయకత్వ శిక్షణా తరగతులు నిర్వహించడం సరికాదని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్‌, పాలెం మహేష్‌ బాబు అన్నారు. ఈ శిక్షణలను ప్రభుత్వం తక్షణం వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం కడప యూటీఎఫ్‌ భవన్‌లో జరిగిన టీచర్స్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సమ్మెటివ్‌ పరీక్షలు జరుగుతున్నాయని ఇలాంటి సమయంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను నిర్వహించడం సరికాదన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య చాలా తక్కువగా ఉందని అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులను శిక్షణా తరగతులలో నిమగ్నం చేస్తే పాఠశాలల్లో పిల్లలకు పరీక్షలు ఎవరు నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో వారం రోజుల పాటు ఉపాధ్యాయులకు నాయకత్వ శిక్షణ పేరుతో పాఠశాలలకు వారం రోజుల పాటు దూరం చేయడం వలన ఈ పనులు ఎవరు చేస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఈ అసంబద్ధ నిర్ణయాలను వెనక్కి తీసుకోకుంటే అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఉద్యమాన్ని చేపడతామని, శిక్షణ తరగతులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. జిల్లా సహాధ్యక్షులు రవికుమార్‌, సుజాత రాణి, జిల్లా ట్రెజరర్‌ నరసింహారావు, జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, ఏజాస్‌ అహమ్మద్‌, ఈరి బాలజోజి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఓబుల్‌ రెడ్డి, రూతు ఆరోగ్యమేరి, కృష్ణారెడ్డి, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

యూటీఎఫ్‌ డిమాండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement