గెలుపోటములను సమానంగా తీసుకోవాలి
ప్రొద్దుటూరు : గెలుపోటములను క్రీడాకారులు సమానంగా తీసుకోవాలని యోగివేమన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పద్మ పేర్కొన్నారు. వైఎస్సార్ ఇంజినీరింగ్ కాలేజీలో రెండో రోజు ఇంటర్ కాలేజీయేట్ ఫేజ్–2 క్రీడా పోటీల ముగింపు సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం క్రీడా సాధన చేస్తూ ఉత్తమ క్రీడాకారులుగా రాణించాలన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ట్రోఫీలు, మెడల్స్ బహూకరించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి.జయరామిరెడ్డి, ప్రొఫెసర్లు కేవీ రమణయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే
పురుషుల విభాగం వాలిబాల్‌లో ఆర్‌సీపీఈ (ప్రొద్దుటూరు), సీఎస్‌ఎస్‌ఆర్ అండ్ ఎస్‌ఆర్‌ఆర్‌ఎం డిగ్రీ కాలేజి (కమలాపురం), ఎన్‌సీపీఈ (బద్వేలు), టగ్ ఆఫ్ వార్ పోటీలో వైవీయూ (కడప), వైఎస్సార్‌ఈసీ (ప్రొద్దుటూరు), ఆర్‌సీపీఈ (ప్రొద్దుటూరు), కబడ్డీలో ఆర్‌సీపీఈ (ప్రొద్దుటూరు), వైఎస్సార్‌ఈసీ(ప్రొద్దుటూరు), ఎస్‌సీఎస్‌డీసీ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో వాలీబాల్ పోటీలో ఆర్‌సీపీఈ (ప్రొద్దుటూరు), వైఎస్సార్‌ఈసీ (ప్రొద్దుటూరు), వైవీయూ (కడప), టగ్‌ఆఫ్ వార్ పోటీలో ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ (కడప), వైవీయూ(కడప), వైఎస్సార్‌ఈసీ (ప్రొద్దుటూరు), కబడ్డీ పోటీలో ఆర్‌సీపీఈ (ప్రొద్దుటూరు), వైవీయూ (కడప), వైఎస్సార్‌ఈసీ (ప్రొద్దుటూరు) కాలేజీలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment