తాళం వేసిన ఇంటిలో చోరీ
కడప అర్బన్ : కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శ్రీకృష్ణ దేవరాయకాలనీలో రాజశేఖర్ అనే వ్యక్తి ఇంటిలో చోరీ జరిగింది. రాజశేఖర్, అతని భార్యతో కలిసి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని పాత టీడీపీ కార్యాలయం భవనంలో ప్లేస్కూల్ నిర్వహిస్తున్నారు. భవన నిర్మాణాలను చేపడుతుంటారు. బాధితుడి ఫిర్యాదు వీరు శని, ఆదివారాలు సెలవుకావడంతో తమ స్వగ్రామమైన చక్రాయపేటకు వెళ్లారు. తరువాత ఆదివారం మధ్యాహ్నం రావాల్సి ఉంది. కానీ ఆదివారం ఉదయం ఎదురింటివారు ఫోన్ చేసి ఇంటిలో లైట్లు వెలుగుతున్నాయని, బయట వాకిలి తెరిచి ఉందని చెప్పారు. వెంటనే బాధితుడు హుటాహుటిన బయలుదేరి వచ్చారు. ఇంటికి వచ్చి చూస్తే తలుపునకున్న తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంటిలోని బెడ్‌రూంలో ఉన్న బీరువాను పగులగొట్టి అందులోని 15 తులాల బంగారు ఆభరణాలను, రెండు కిలోల వెండి ఆభరణాలను, రూ. 4.50 లక్షల నగదును అపహరించుకుని వెళ్లిపోయారు. సంఘటన స్థలాన్ని చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్‌ఐ ఎన్. రాజరాజేశ్వర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది, క్లూస్ టీం వారు వచ్చి పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ చోరీలు జరగకుండా స్థానికంగా ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ఊళ్లకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఎల్‌హెచ్‌ఎంఎస్ కెమెరాలను తమ ఇళ్లలో అమర్చుకోవాలని సూచించారు.
15 తులాల బంగారు,
రెండు కిలోల వెండి సామగ్రితోపాటు రూ.4.50 లక్షల నగదు అపహరణ
Comments
Please login to add a commentAdd a comment