కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు నాలుగు నెలల్లో సూపర్ సిక్స్ పథకాలు అమలు జరుగుతాయని ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం కడపలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మౌలిక వసతుల్లో మన దేశం ప్రపంచంలో ఐదో స్థానంలో ఉందన్నారు. మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశం టెర్రరిజం, నక్సలిజంపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలు అందుతున్నాయన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు లక్ష్మినారాయణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, బొమ్మన విజయ్, వెంకట సుబ్బారెడ్డి, లక్ష్మణ్‌రావు, బత్తల పవన్ తదితరులు పాల్గొన్నారు.
బోధనేతర సిబ్బంది
సంక్షేమమే ధ్యేయం
నందలూరు : మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బోధనేతర సిబ్బంది సంక్షేమమే తమ ధ్యేయమని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు శివకాంత్, అధ్యక్షుడు మనోహర్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జీఓ హోంలో మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బోధనేతర సిబ్బంది సంఘం 6వ వార్షికోత్సవం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ హాజరై అప్కోస్ సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని, కాంట్రాక్టు బోధనేతర సిబ్బందిని రెగ్యులరైజేషన్ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన గౌరవాధ్యక్షుడు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
పుల్లంపేట : మండలంలోని అనంతసముద్రం పంచాయతీ బోటుమీదపల్లె గ్రామం వద్ద టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఆదివారం 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment