రసవత్తరంగా బండలాగుడు పోటీలు
వీరపునాయునిపల్లె : కాశిరెడ్డి నాయన ఆరాధన మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలు రసవత్తరంగా సాగాయి. ఈ పోటీల్లో 11 జతల ఎద్దులు పాల్గొన్నాయి. కడప జిల్లాకు చెందిన ఎద్దులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చాయి. పోటీలను తిలకించేందుకు జిల్లాలోని నలు మూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. బండ లాగుడు పోటీలను ఆలయ ధర్మకర్త కటికం లక్ష్మిరెడ్డి ప్రారంభించారు. బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన వజ్రాల తేజశ్రీ రెడ్డి ఎద్దులు మొదటి స్థానం, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ద్వార్శల వెంకటసాయి భవిత్‌రెడ్డి ఎద్దులు రెండవ స్థానం, వైఎస్సార్ జిల్లా ఓబులంపల్లెకు చెందిన సతీష్‌కుమార్‌రెడ్డి ఎద్దులు మూడో స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా అనగలూరుకు చెందిన వంశీరెడ్డి ఎద్దులు నాలుగో స్థానం, వైఎస్సార్ జిల్లా బాలయ్యగారిపల్లె విష్ణువర్దన్‌రెడ్డి ఎద్దులు ఐదో స్థానం, ప్రకాశం జిల్లా వినుకొండ చిన్నబాయి యాదవ్ ఎద్దులు ఆరవ స్థానం, కడప తిప్పిరెడ్డిపల్లె మనోహర్‌రెడ్డి ఎద్దులు ఏడవ స్థానం, కడప జిల్లా ఖాదర్‌ఖాన్ కొట్టాలకు చెందిన భావనశ్రీ ఎద్దులు ఎనిమిదో స్థానం పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment