అంబేడ్కర్‌కు, రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకం
కడప కార్పొరేషన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు ..ఆయన ఐడియాలజీకి, రాజ్యాంగానికి మొదటినుంచి బీజేపీ వ్యతిరేకమని దళిత ఫోరం జిల్లా చైర్మన్ కిశోర్ బూసిపాటి ఆరోపించారు. పార్లమెంటులో అంబేడ్కర్‌ను అవమానించేలా కేంద్రమంత్రి అమిత్‌షా మాట్లాడారని ధ్వజమెత్తారు. శుక్రవారం కడప నగరంలోని దళిత ఫోరం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు దైవంగా పూజించే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అమిత్ షా అవమానించడం దారుణమన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు ఆ పార్టీ అహంకారానికి నిదర్శనమన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆ స్థానంలో మనుస్మృతిని తెచ్చేందుకు సంఘ్ పరివార్‌తో కలిసి బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ముందు కూడా 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ చెప్పడం కూడా ఇందుకు నిదర్శనమన్నారు. జమిలీ ఎన్నికల పేరుతో ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజీపీ దళిత వర్గాల్లో చీలిక తెచ్చేందుకు కుట్ర పన్నుతోందన్నారు. దళితులను చీల్చడమే కాకుండా... ఏకంగా అంబేడ్కర్‌పై అవమానకర రీతిలో మాట్లాడడం దుర్మార్గమైన చర్య అన్నారు.
రాజ్యాంగం స్థానలో
మనుస్మృతిని తెచ్చేందుకు కుట్రలు
అందులో భాగంగానే
అమిత్ షా వ్యాఖ్యలు
దళిత ఫోరం చైర్మన్
బూసిపాటి కిషోర్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment