రాహుల్ గాంధీపై కేసు దుర్మార్గం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : పార్లమెంటు ప్రాంగణంలో అంబేడ్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో జరిగిన తోపులాటలో బాధ్యుడిని చేస్తూ రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడం దుర్మార్గమని కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జకరయ్య తప్పు పట్టారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం ఉదయం పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభం కావడానికి ముందే ఎన్డీఏ ఇండియా ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారన్నారు. ఆ సమయంలో మకర ద్వారం వద్ద అధికారపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ సభ్యులు కర్రలతో కూడిన ప్లకార్డును పట్టుకొని ఆ కర్రలతో కాంగ్రెస్ ఎంపీల మీద దాడి చేసి పార్లమెంట్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వీడియో కూడా విడుదల చేసిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తే బీజేపీ ఎంపీలు దౌర్జన్యం చేయడం సరి కాదని, తక్షణమే రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. సమావేశంలో ఏఐసీసీ సమన్వయకర్త అబ్దుల్ సత్తార్, ఎస్సీ సెల్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెం విజయభాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment