హత్యకేసులో వీడిన మిస్టరీ
కొండాపురం : మండలంలో ఇటీవల జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కొండాపురం సీఐ మహమ్మద్‌రఫీ, ఎస్‌ఐ విద్యాసాగర్ శుక్రవారం తెలిపారు. వివరాలిలా.. మండల పరిధిలోని లావనూరు గ్రామ సమీపంలో వెంకయ్యకాలువ రోడ్డులోని నల్లవంక వంతెన వద్ద ఈనెల 17న తెల్లవారుజామున యల్లనూరు గ్రామానికి చెందిన చిన్నగుల్లోబన్నగారి సురేష్(36) అనుమాపాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి భార్య సి. వీరకుమారి అదే గ్రామానికి చెందిన గజ్జప్పగారి బాబుతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఉందని సురేష్ తన భార్యను మందలించాడు. దీంతో అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. సురేష్ బతికుంటే మనకి అడ్డువస్తాడని ఎలాగైనా చంపాలని ప్రియుడు బాబుతో కలిసి కుట్రపన్నారు. బాబు స్నేహితులు వెలిదండ్ల సుభాన్ అలియాజ్ సుబ్బు, చుక్కలూరు కిరణ్‌కుమార్‌యాదవ్‌లకు విషయం చెప్పి సుబ్బుకు రూ.1లక్ష, కిరణ్‌కుమార్‌కు రూ. 50 వేల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈనె16వ తేదీన బాబు, సుబ్బు, కిరణ్ కలసి సుబహాన్ బర్త్‌డే పార్టీ రైల్వే కొండాపురం గ్రామంలో ఉందని సురేష్‌కు చెప్పి బొలెరో వాహనంలో ఎక్కించుకొని లావనూరు గ్రామం దగ్గర ఉన్న నల్లవంక బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లారు. సురేష్‌కు అతిగా మద్యం తాపించి సృహా కోల్పయిన సమయంలో నల్లని తాడుతో గొంతుకు బిగించి హత్య చేశారు. శవాన్ని నల్లవంక బ్రిడ్జి పైనే వదిలేసి ఎవరికి అనుమానం రాకుండా తాగిన మద్యం బాటిళ్లు వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు అక్కడే ఉంచినట్లు సీఐ తెలిపారు. 19వ తేదీన కె.సుగుమంచిపల్లె వీఆర్వో పెద్దన్న వద్దకు వెళ్లి మేం ముగ్గరం కలసి సురేష్‌ను నల్లవంక బ్రిడ్జిపై హత్య చేసి అక్కడే పడివేసినట్లు చెప్పారు. వీఆర్‌ఓ పోలీసులకు సమచారం ఇవ్వగా నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. హత్యకు వినియోగించిన వాహనం, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను ప్రొద్దుటూరు కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విదించినట్లు సీఐ తెలిపారు.అనంతరం వారిని కడప సెంట్రల్ జైలు తరలించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ విద్యాసాగర్, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.
హత్యకు వినియోగించిన
వస్తువులు స్వాధీనం
నిందితులు కడప సెంట్రల్ జైలుకు తరలింపు
Comments
Please login to add a commentAdd a comment