కడప కల్చరల్ : కడప రాయుడు దేవునికడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా 29వ తేది ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణంతో కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనం, 30న సూర్యప్రభవాహనం, పెద్దశేష వాహనం, 31న చిన్నశేష, సింహ వాహనం, ఫిబ్రవరి 1న కల్పవృక్ష, హనుమంత వాహనం, 2న ముత్యపుపందిరి, గరుడ వాహనం, 3న ఉదయం కల్యాణోత్సవం ఉంటుందని తెలిపారు. 4న ఉదయం రథోత్సవం, అనంతరం ధూళి ఉత్సవం, 5న సర్వభూపాల, అశ్వ వాహనం, 6న ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం ధ్వజావరోహణం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment