సమగ్రశిక్ష ఏపీసీగా నిత్యానందరాజు
కడప ఎడ్యుకేషన్: జిల్లా సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌గా కర్నూల్ జిల్లా డిప్యూటి కలెక్టర్ నిత్యానందరాజును నియమిస్తూ విద్యా శాఖ సెక్రటరీ కోన శశిధర్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో ఫారిన్ సర్వీస్ కింద కడప సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌గా వచ్చిన ప్రభాకర్‌రెడ్డి తన పద వీకాల గడువు ముగియడంతో ఆయన తిరిగి మాతృసంస్థకు వెల్లిపోయారు. కాగా నిత్యానందరాజు సోమవా రం బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.
‘ఈ–ఆఫీస్’ పక్కాగా
అమలు కావాలి
కడప సెవెన్‌రోడ్స్: ఈ నెల 26వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఇన్ఫర్మేషన్ అధికారి డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాలులో వైఎస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల జెడ్పీ అధికారులు, ఎంపీడీఓలు, టైపిస్టులు, సిబ్బందికి ఈ–ఆఫీస్ నిర్వహణపై ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే ఈ–ఆఫీస్ సిస్టమ్ ఆచ రణలో ఉండగా.. దీన్ని పూర్తి స్థాయిలో అమ లు చేయాలని ఆదేశించారు.
‘ఓపెన్ టెన్త్’ ఫీజు చెల్లింపు
గడువు పొడిగింపు
కడప ఎడ్యుకేషన్: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల పరీక్ష రుసుం చెల్లింపునకు 2025 జవనరి 10వ తేదీ వరకు గడువు పొడగించినట్లు డీఈఓ మీనాక్షి, ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ సాంబశివారెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. పరీక్షా రుసుము చెల్లించే అభ్యాసకులు ఏదైనా ఏపీ ఆన్‌లైన్ కేంద్రంలో గానీ.. ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా నేరుగా పరీక్ష రుసుం చెల్లించవచ్చని తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యాసకుల వివరాలతో కూడిన నామినల్ రోల్స్ జాబితాను ఏ1 సమన్వయకర్తలు 2025 జనవరి 11న డీఈఓ కార్యాలయంలో అందజేయాలని డీఈఓ మీనాక్షి, ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ సాంబశివారెడ్డి తెలిపారు.
నేడు పురస్కార ప్రదాన సభ
కడప కల్చరల్: ప్రముఖ కథ, నవలా రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డికి సుప్రసిద్ధ కథకులు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి సార్మక జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నట్లు కవిత విద్య సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకులు అలపర్తి పిచ్చయ్యచౌదరి, బోయపాటి దుర్గాకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కథా రచయిత ఎన్.దాదా హయాత్ అధ్యక్షత వహిస్తారని, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అడిషనల్ ఎస్పీ ప్రకాశ్‌బాబు విశిష్ఠ అతిథిగా హాజరవుతారన్నా రు. గౌరవ అతిథులుగా ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి, బొల్లు కృష్ణమూర్తి పాల్గొంటారన్నారు. సుప్రసిద్ద సాహితీ విమర్శకులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ సన్నపురెడ్డి సాహిత్యం గురించి ప్రముఖ రచయిత్రి ఆర్.శశికళ, కేతు విశ్వనాథరెడ్డి గురించి మాట్లాడనున్నారని వివరించారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప రూరల్: ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌లో వివిధ కేటగిరీలకు సంబంధించిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. ఫిజీషియన్, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్, ఫార్మాసిస్ట్, టీబీ హెల్త్ విజరట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు కడప.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు. దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో స్వయంగా అందజేయాలని పేర్కొన్నారు.
శిక్షణ
కడప అర్బన్: జిల్లాలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు ప్రాథమిక అర్హత పొందిన హోంగార్డులకు, ఉత్సాహవంతులైన అభ్యర్థులకు ప్రతి రోజూ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ట్రాఫిక్ సీఐ జావేద్ ఉచితంగా శిక్షణను ఇస్తున్నారు. ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, అప్రమత్తంగా ఉండాల్సిన విషయాలపై ఆయన పలు సూచనలు చేస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment