ఐకమత్యంతోనే సమస్యల పరిష్కారం
– రాష్ట్ర పాస్టర్ల సంఘం నేతలు
కడప కల్చరల్ : పాస్టర్లందరూ ఐకమత్యంగా ఉన్నప్పుడే క్రైస్తవుల సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని రాష్ట్ర పాస్టర్ల సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. స్థానిక కృపాకాలనీలోని న్యూ నేటివ్ మినిస్ట్రీస్ మందిరంలో శనివారం పాస్టర్ పి.మహేష్, సిస్టర్ శాంతమ్మల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పల్నాడు జిల్లాకు చెందిన రెవరెండ్ లాజర్ మాట్లాడుతూ క్రైస్తవులకు హింసలు ఎదుర్కోవడం కొత్తేమీ కాదని, దైవ కార్యక్రమాలను ఆటంక పరిచిన వారిని ఆయనే శిక్షిస్తాడన్నారు. సీఆర్‌పీఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ రెవరెండ్ శేషం ప్రసాద్, యూపీఏ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ మందిరాలు, పాస్టర్లు, క్రైస్తవులపై దాడులు చేయడం, కార్యకలాపాలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. స్థానిక బుడగజంగం పెద్దలు కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె.ఆనంద్, రాష్ట్ర సీఆర్‌పీఎఫ్ ప్రతినిధులు డి.వి ప్రసాద్, మోషే, మానవ హక్కుల సంఘం ప్రతినిధి పి.రవితేజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment