అన్నీ అరకొరగా..
జిల్లాలో మొత్తం ఐదు బోటింగ్ యూనిట్లు ఉన్నాయి. ఇందులో పార్నపల్లె యూనిట్ మూడు బోట్లతో ఓ మోస్తరుగా ఉండగా, కడప నగరంలోని దేవుని(పాత)కడప యూనిట్ కేవలం ఒకే ఒక బోటుతో ఉంది. నాలుగు సీట్లు గల ఈ బోటులో ఒక్కొక్క టికెట్టు ధర రూ. 100 రూపాయలు. దీంతో ధర ఎక్కువ అని, కేవలం నాలుగు సీట్లు ఉన్నాయని, అంతకుమించిన కుటుంబ సభ్యులు వెళ్లే అవకాశం లేదంటూ వచ్చిన వారు కూడా తిరిగి వెళ్లిపోతున్నారు. ఉన్న ఒక్క బోటు కూడా తరచూ మరమ్మతులకు గురై అందుబాటులో లేకపోవడంతో పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోయింది. ఫలితంగా ఈ యూనిట్ ఎక్కువ రోజులు మూసి ఉంచాల్సి వస్తోంది. పార్నపల్లె బోటింగ్ యూనిట్లో ఆరు సీట్లు గల స్పీడ్ బోటు ఒకటి. 24 సీట్లు గల డీలక్స్ బోటు ఒకటి, 12 సీట్లుగల పాంటూన్ బోటు ఒకటి అందుబాటులో ఉన్నాయి. స్పీడ్ బోటులో టిక్కెట్ ధర రూ. 100, ప్యాంటూన్ బోటులో రూ. 75, డీలక్స్ బోటులో రూ. 50 లుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment