నేడు మస్తాన్ స్వామి నూతన దర్గా ప్రారంభం
పెండ్లిమర్రి : భక్తుల కోర్కెలు తీర్చే మస్తాన్‌స్వామి నూతన దర్గా ఆదివారం ప్రారంభోత్సవం, అనంతరం ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు తెలిపారు. కొండూరు గ్రామంలో దాదాపు శతాబ్దాల క్రితం మస్తాన్ స్వామి వెలిశాడని పూర్వీకుల కథనం. స్వామిని కొలిచిన వారికి కోరిన కోర్కెలు తీర్చుతాడని.. సంతానం లేనివారికి సంతానం కలిగిస్తాడని.. భూత పిశాచాలు ఉన్న వారికి అన్ని దుష్ట శక్తులను తొలగిస్తాడని భక్తుల నమ్మకం. దర్గా ప్రారంభం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం గంధము, రాత్రి స్వామి వారి ఉరేగింపు, భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి ఉరుసు ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment