ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ పుష్పగిరి సందర్శన
వల్లూరు : ప్రముఖ పుణ్య క్షేత్రమైన పుష్పగిరిని ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ హరిహరనాథ శాస్త్రి శనివారం సందర్శించారు. మొదట ఆయన పుష్పగిరి కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయాన్ని సందర్శించారు. శ్రీ చెన్న కేశవ స్వామి, శ్రీ సంతాన మల్లేశ్వర స్వామి, లక్ష్మీ దేవి అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు ఆలయ చరిత్రను, విశిష్టతను వివరించారు. అనంతరం ఆయన రుద్ర పాద ఆలయాన్ని, పవిత్ర పినాకినీ నదిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామంలోని శ్రీ కామాక్షీ వైద్య నాథేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీ చక్ర సహిత కామాక్షీ మాతను, శ్రీ వైద్యనాథ స్వామి, త్రికుటేశ్వర, భీమ లింగేశ్వర, భీమేశ్వర స్వాములను దర్శించుకుని పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment