కారు ఢీకొని..
పోరుమామిళ్ల : పోరుమామిళ్ల శివారులో కమ్మవారిపల్లె వద్ద బుధవారం ఉదయం 6 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతా సురేష్(27) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పుల్లివీడు పంచాయతీ పేరమ్మగారిపల్లెకు చెందిన సురేష్ తెల్లవారు జామునే మాంసం కోసం పోరుమామిళ్ల వస్తుండగా పట్టణ సమీపంలో పోరుమామిళ్ల నుంచి బద్వేలు వైపు వెళుతున్న కారు ఢీ కొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ముందు వెళుతున్న వ్యాన్‌ను సురేష్ క్రాస్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొన్నట్లు తెలుస్తోంది. సురేష్‌కు ఏడు నెలల క్రితమే సుప్రియ(20)తో వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలిసింది. పెళ్లైన ఏడు నెలలకే భర్త మృతి చెందటాన్ని ఆ యువతి జీర్ణించుకోలేక పోతోంది. సురేష్ పోరుమామిళ్లలోని ఓ గార్మెంట్స్ షాపులో గుమస్తాగా పని చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. పేరమ్మగారిపల్లెలో విషాదం అలుముకుంది.
కరెంట్ షాక్‌తో బాలుడికి తీవ్రగాయాలు
మదనపల్లె : గాలిపటాలు ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు బాలుడు కరెంట్‌షాక్‌కు గురై తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని దిగువకురవంకకు చెందిన చెన్నకేశవ కుమారుడు చరణ్(13) స్థానికంగా ఏడో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా మిద్దైపెకి వెళ్లి గాలిపటం ఎగురవేస్తూ వెనక్కు వచ్చి ప్రమాదవశాత్తు కరెంట్ తీగలకు తాకగా, షాక్‌కు గురయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment