ట్రాక్టర్ల దొంగతనం కేసులో నిందితుడి అరెస్టు
సింహాద్రిపురం : ట్రాక్టర్ల దొంగతనం కేసులో నిందితుడు ఎరగ్రుడి బాబాను అరెస్టు చేసినట్లు పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. గురువారం మండల కేంద్రమైన సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ట్రాక్టర్ల దొంగతనం కేసులో నిందితుడు ఎరగ్రుడి బాబాను హిమకుంట్ల క్రాస్ రోడ్డు వద్ద ఎస్‌ఐ తులసి నాగప్రసాద్ అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఒక ట్రాక్టర్, మూడు ట్రాక్టర్ ట్రాలీలు, ఒక వాటర్ ట్యాంకును స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు రూ.11.50 లక్షల మేర ఉంటుందన్నారు. సమావేశంలో ఎస్‌ఐలు తులసి నాగప్రసాద్, మధుసూదన్‌రావు పాల్గొన్నారు.
అంతర్ రాష్ట్ర బస్సు బోల్తా
కురబలకోట : మదనపల్లె సమీపంలోని అంగళ్లు–జంగావారిపల్లె మార్గంలో గురువారం వేకువజామున అంతర్ రాష్ట్ర మార్కాపురం–బెంగళూరు ప్రైవేటు బస్సు జంగావారిపల్లె సమీపంలో బోల్తాపడింది. రోడ్డు డివైడర్‌ను ఢీకొని బస్సు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మార్కాపురం, గిద్దలూరు, కడపతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 11 మంది గాయపడ్డారు. బస్సు అద్దాలను పగుల గొట్టి హుటాహుటిన వీరిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. సంక్రాంతి పండగకు ఇంటికి వచ్చి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనలో క్లీనర్ సి. వెంకటనారాయణ, వినోద్, నవీన్‌కుమార్, సాహితి, వినీత్, ఉమామహేశ్వర్ రెడ్డి, విక్రమ్, యశ్వంత్, వంశీ, కేశవరావు, నరసింహులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment