సీఎం వస్తున్నారని.. ముందస్తు నోటీసులు
కడప అర్బన్ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరులో ఈనెల 18వ తేదీన పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఎవరైనా ప్రజా సమస్యలపై నిరసన తెలుపుతారని, ఆయనకు సమ్యలు విన్నవించేందుకు ప్రయత్నిస్తారనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి గంగాసురేష్‌ను ఆయన ఇంటివద్ద కలిసిన పోలీసులు నోటీసు ఇచ్చారు. రెండు రోజుల ముందునుంచే పోలీసులు నోటీసులు జారీ చేసి నిరసనలను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈనెల 17న తెల్లవారుజామునుంచే మరికొంతమంది నేతలను వారి ఇళ్లవద్దకు వెళ్లి నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment