మాస్టర్ ట్రైనర్ల కృషి ప్రశంసనీయం
డీఎఫ్ఓ ఎం.శివకుమార్
కడప సెవెన్‌రోడ్స్: సుస్థిర వ్యవసాయం, ఆగ్రో ఫారెస్ట్రీ, మొక్కల సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంలో టీఓఎఫ్ మాస్టర్ ట్రైనర్ల కృషి ప్రశంసనీయమని జిల్లా అటవీ అధికారి ఎన్.శివకుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఓ–బ్లాక్‌లోని సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్ల సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతనెల 8న వ్యవసాయ, ఉద్యాన, డీఆర్డీఏ, ఎఫ్‌పీఓ శాఖల నుంచి ఎంపిక చేసిన మాస్టర్ ట్రైనర్లు ఐదు రోజులపాటు ఆగ్రో ఫారెస్ట్రీ మొక్కల సాగుపై శిక్షణ పొందారన్నారు. వీరు జిల్లాలోని 58 గ్రామాల్లో 6141 మంది రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారికి అవగాహన కల్పించారని తెలిపారు. ప్రభుత్వం నిర్దశించిన లక్ష్యాలను సాధించడంలో మాస్టర్ ట్రైనర్ల కృషి మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా టీఓఎఫ్ మాస్టర్ ట్రైనర్లకు ఆయన సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి డాక్టర్ అయితా నాగేశ్వరరావు, జిల్లా ఉద్యాన అధికారి సుభాషిణి, బద్వేలు సబ్ డీఎఫ్ఓ బి.స్వామి వివేకానంద తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment