● ఆధునిక సెలూన్ల రాకతో..
ఆధునికత అంటూ ఇటీవల జిల్లాలో కొత్తకొత్త పేర్లతో సెలూన్లు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా కడప నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన పెట్టుబడిదారులు ఏసీలతో కూడిన భారీ సెలూన్లు ఏర్పాటు చేశారు. గ్రీన్ ట్రెండ్స్, మోజ్, (బీ)యూ, డబల్ సెవెన్, స్టూడియో సెవెన్, ఎంఫైర్ తదితర సెలూన్ల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. కొత్త కొత్త హంగులతో ఇవి యువతను ఆకర్శిస్తున్నాయి. బుల్లెట్ కటింగ్, మిడ్ ఫేడ్, లోఫేడ్ వంటి పేర్లతో కటింగ్, షేవింగ్, హెడ్ వాష్ చేసి రూ. 500 చొప్పున రాబడుతున్నారు. తల వెంట్రుకలకు రంగు వేయాలంటే రూ. 300 అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. రకరకాల క్రీముల పేరిట డబ్బులు బాగానే గుంజుతున్నారు. వీరి వద్దకు వెళ్లాలంటే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. వీధి బంకుల నిర్వాహకులు కూడా రకరకాల రీతుల్లో కటింగ్, షేవింగ్స్ చేయగలరు. హంగు ఆర్భాటాలు ఉండవు గనుక యువత వెళ్లడం లేదు. దీంతో రాబడి నామమాత్రంగా ఉంటోందని బంకు నిర్వాహకులు వాపోతున్నారు. బంకు ఏర్పాటు చేసుకున్నందుకు మున్సిపాలిటీకి పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment