Kakinada
-
భక్తులతో పోటెత్తిన రత్నగిరి
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం బుధవారం వేలాది భక్తులతో కిటకిటలాడింది. కార్తిక బహుళ సప్తమి కావడంతో భారీగా వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలన్నీ నిండిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా 3,700 వ్రతాలు జరిగాయని, నిత్య కల్యాణంలో రూ.1,116 టిక్కెట్లతో 20 మంది భక్తులు పాల్గొన్నారు. అన్ని విభాగాల ద్వారా రూ.40 లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. పది వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోజనం పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ క్యూలైన్లు, వ్రతమండపాలు పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. కాగా శుక్రవారం నుంచి వచ్చే సోమవారం వరకు నాలుగు రోజులూ సుమారు 30 వేల వ్రతాలు, రోజుకు 50 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సత్యదీక్షల విరమణ శనివారం సత్యదేవుని జన్మనక్షత్రం మఖ సందర్భంగా సత్యదీక్ష విరమణ జరుగనుంది. ఆ రోజు సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులతో పాటు వీరి రాకతో రద్దీ ఏర్పడనుంది. ఆదివారం, కార్తికం నాలుగో సోమవారం, దశమి తిథి రావడంతో ఆ రోజు తీవ్ర రద్దీ ఉండే అవకాశం ఉంది. లక్ష మంది స్వామి దర్శనానికి వస్తారని, మంగళవారం ఏకాదశి నాడు సుమారు 50 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. సత్యదేవుని దర్శించిన 40 వేల మంది వ్రతాలు 3,700, ఆదాయం రూ.40 లక్షలు -
లక్ష్మీ గాయత్రి నర్సింగ్ స్కూల్‌పై అట్రాసిటీ కేసు
కాకినాడ రూరల్: స్థానిక ఇంద్రపాలెంలోని లక్ష్మీ గాయత్రి నర్సింగ్ స్కూల్‌పై వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. సుమారు 300 మంది విద్యార్థులు ఉన్న ఈ సంస్థలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గీయులే ఉన్నారు. ఈ స్కూల్లో అధిక ఫీజుల వసూళ్లు, మౌలిక వసతుల లేమి, భోజనంలో నాణ్యత లేదని ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. ఆయన ఆదేశాలతో డీఎంహెచ్ఓ నాయక్, ఐసీడీఎస్ పీడీ ప్రవీణ, ఆర్డీఓ మల్లిబాబు తదితరులు అక్కడి విద్యార్థులను విచారించి వివరాలు సేకరించారు. ఆ నివేదికను వారు కలెక్టర్ షణ్మోహన్‌కు అందజేశారు. దీంతో ఆయన తీవ్రంగా స్పందించి అన్ని నర్సింగ్ పాఠశాలలను తనిఖీ చేయాలని ఆదేశించారు. కాగా లక్ష్మీ గాయత్రీ నర్సింగ్ స్కూల్ యాజమాన్యంపై అట్రాసిటీ కేసు నమోదుకు ఆదేశించినట్టు ఆర్డీఓ మల్లిబాబు తెలిపారు. కాలపరిమితి జీఓ రద్దు చేయాలి కాకినాడ సిటీ: మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న యానిమేటర్లను తొలగించాలని ఇచ్చిన కాల పరిమితి సర్క్యులర్‌ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగులు బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యానిమేటర్లపై రాజకీయ వేధింపులు పెరిగిపోయాయని విమర్శించారు. అక్రమ తొలగింపులు చెల్లవని, తొలగించిన తిరిగి నియమించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం జిల్లా డీఆర్డీఏ అధికారులు అమలు చేయకుండా బెదిరింపులకు దిగుతున్నారని ఆందోళనకారులు వివరించారు. వీవోఏల చేత విలేజ్ మాల్ సరుకులు విక్రయించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సంఘం గౌరవాధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంగాభవాని, ఈశ్వరీబాయి, మేరీ, చంద్రవతి, నర్ల ఈశ్వరి, సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు కలెక్టర్ షణ్మోహన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ముడిపులు ఇచ్చిన వారికే నష్ట పరిహారం కిర్లంపూడి: గతంలో వచ్చిన తుపానులకు పంటలు నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో పంట నష్టపరిహారం అందలేదని, ముడుపులిచ్చిన వారికే అధికారులు పరిహారం ఇచ్చారని భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు ఆరోపించారు. స్థానిక విజ్ఞాన భారతి హైస్కూల్లో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు రాసంశెట్టి రాజా అధ్యక్షతన బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యల్లపు సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు నీలగిరి చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేలాది రూపాయాలు పెట్టుబడి పెట్టి పంటలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు రైతును నిండా ముంచాయన్నారు. పంట నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుంటే అధికారులు మాత్రం అసలైన రైతులను విడిచిపెట్టి ముడుపులు చెల్లించిన వారికి మాత్రమే పంట నష్టపరిహారం ఇచ్చారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించి అర్హులైన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. కోతలు కోయకుండానే విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ జె.చిరంజీవికి వినతిపత్రాన్ని అందజేశారు. -
అన్నింటా అభివృద్ధి చెందినా.. నైతికంగా దిగజారుతున్నాం..
చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై భావోద్వేగంగా మాట్లాడుతున్న కలెక్టర్ షణ్మోహన్ ఓ సందర్భంలో కంట తడిపెట్టడం సభికులను కలచివేసింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా నైతికతలో రోజు రోజుకూ దిగజారిపోతున్నామని, నాగరికతకు నిదర్శనంగా చెప్పుకునే భారతదేశంలో బాలికల ఆక్రందనలు ఆగడం లేదన్నారు. చాక్లెట్ కొనిస్తానని ఒకడు, హోలీ ఆడుకునేందుకు రంగులు కొనిస్తా నని, మామిడి పండిస్తానని ఇంకొకడు, అభం శుభం తెలియని తొమ్మిది నెలల చిన్నారిని మరొకడు ఇలా పసిమొగ్గల బతుకులను చిదిమేస్తున్నారన్నారు. నిర్భయ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా బాలికల సంరక్షణ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతోందని కంటతడి పెట్టడంతో సభా ప్రాంగణంలో నిశ్శబ్దం ఆవహించింది. జిల్లాలోని పిఠాపురం పట్టణానికి చెందిన బాలికపై మాధవపురం డంపింగ్ యార్డు దగ్గర జరిగిన అఘాయిత్యం, తూరంగి గ్రామంలో ఓ చిన్నారిపై జరిగిన అఘాయిత్యాలను ఉద్దేశించి ఆయన కలత చెంది.. అంతలోనే తేరుకుని నేనున్నానంటూ చిన్నారులకు భరోసా ఇచ్చారు. -
జియ్యన్న మఠంపై ప్రభుత్వానికి నివేదిక
గండేపల్లి: మండలంలోని తాళ్లూరు జియ్యన్న మఠంగా పిలిచే వెంకటేశ్వరస్వామి ఆలయంలో పలు సమస్యలపై నిర్వహించిన బహిరంగ విచారణ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందచేస్తామని జిల్లా దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ డీవీఎల్ రమేష్‌బాబు తెలిపారు. రాష్ట్ర ఆర్కియాలజీ కమిషనర్ డాక్టర్ జి.వాణీమోహన్ ఆదేశాలతో అధికారుల కమిటీ తాళ్లురులోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద బుధవారం బహిరంగ విచారణ చేపట్టింది. అనంతరం రమేష్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ తాళ్లురు మఠానికి సంబంధించి, గతంలో ఆర్కియాలజీ విభాగానికి చెందిన అధికారి ఇచ్చిన ఆర్డర్‌పై నెలకొన్న వివాదంపై విచారణ జరిపామని, అర్చకులు, గ్రామ పెద్దలు, భక్తుల నుంచి సమాచారం సేకరించామని తెలిపారు. ఒక అర్చకుడి నుంచి కొన్ని దస్త్రాలు తమకు అందాల్సి ఉందని, వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన వివరించారు. కమిటీలో పాల్గొన్న ఆర్కియాలజీ విభాగం డీడీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ తమ శాఖకు చెందిన అధికారి 2010లో ఒక వంశానికి చెందిన కుటుంబానికి మఠం నిర్వహణ అధికారాన్ని కట్టబెడుతూ ఆర్డర్ ఇచ్చారని దీనిపై మరో వంశం వారు అభ్యంతరం చెప్పారని, సదరు ఆర్డర్ ఇచ్చే అర్హత తమ విభాగానికి లేదని తెలిపారు. ఈ విచారణలో దీనిని మఠంగా నిర్వహిస్తున్నారా, వెంకటేశ్వర దేవస్థానంగా దేవదాయశాఖ పరిధిలో వుందా, ఆస్తుల అన్యాక్రాంతం తదితర అంశాలపై విచారణ సాగిందన్నారు. సీఐ వైఆర్కే శ్రీనివాస్ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయగా, పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేవదాయశాఖ డీసీ రమేష్‌బాబు పురావస్తుశాఖ ఆర్డర్‌పై విచారణ -
సుబ్బంపేటలో బాలిక మృతి
కొత్తపల్లి: వైద్యం వికటించి తమ కుమార్తె మృతి చెందినట్లు ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన మైలపల్లి మల్లేశ్వరి తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మైలపల్లి అక్షయ (16) తొమ్మిదో తరగతి చదువుతుంది. సోమవారం రాత్రి జ్వరంతో పాటు వాంతులు కావడంతో మంగళవారం ఉదయం ఉప్పాడలోని ఆర్ఎంపీ మామిడి సూరిబాబు వద్దకు తల్లి మల్లేశ్వరి తీసుకువెళ్లింది. అక్కడ ఆసుపత్రిలో అక్షయకు మూడు ఇంజక్షన్లు, సిలెన్లు, ఆక్సిజన్ పెట్టారు. తర్వాత మాత్రలు ఇచ్చి ఇంటికి తీసుకువెళ్లాని ఆర్ఎంపీ సూరిబాబు చెప్పారని బంధువులు అంటున్నారు. పాపకు బాగోలేదని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లండనే మాట చెప్పకుండా తీసుకువెళ్లమనడంతో ఇంటికి తీసుకొచ్చిన క్షణాల్లో అక్షయ స్పృహ కోల్పోవడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా ప్రాణాలు విడిచినట్లు మల్లేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయమై ఆర్ఎంపీ సూరిబాబును వివరణ కోరగా అక్షయ తన వద్దకు వచ్చేసరికే ఆరోగ్యం బాగోలేదని, ఆమెకు ఎటువంటి వైద్యం చేయలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లమని చెప్పానని అన్నారు. అయితే దీనిపై ఏవిధమైన సమాచారం లేదని ఎస్సై వెంకటేష్ తెలిపారు. -
జియ్యన్న మఠంపై ప్రభుత్వానికి నివేదిక
గండేపల్లి: మండలంలోని తాళ్లూరు జియ్యన్న మఠంగా పిలిచే వెంకటేశ్వరస్వామి ఆలయంలో పలు సమస్యలపై నిర్వహించిన బహిరంగ విచారణ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందచేస్తామని జిల్లా దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ డీవీఎల్ రమేష్‌బాబు తెలిపారు. రాష్ట్ర ఆర్కియాలజీ కమిషనర్ డాక్టర్ జి.వాణీమోహన్ ఆదేశాలతో అధికారుల కమిటీ తాళ్లురులోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద బుధవారం బహిరంగ విచారణ చేపట్టింది. అనంతరం రమేష్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ తాళ్లురు మఠానికి సంబంధించి, గతంలో ఆర్కియాలజీ విభాగానికి చెందిన అధికారి ఇచ్చిన ఆర్డర్‌పై నెలకొన్న వివాదంపై విచారణ జరిపామని, అర్చకులు, గ్రామ పెద్దలు, భక్తుల నుంచి సమాచారం సేకరించామని తెలిపారు. ఒక అర్చకుడి నుంచి కొన్ని దస్త్రాలు తమకు అందాల్సి ఉందని, వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన వివరించారు. కమిటీలో పాల్గొన్న ఆర్కియాలజీ విభాగం డీడీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ తమ శాఖకు చెందిన అధికారి 2010లో ఒక వంశానికి చెందిన కుటుంబానికి మఠం నిర్వహణ అధికారాన్ని కట్టబెడుతూ ఆర్డర్ ఇచ్చారని దీనిపై మరో వంశం వారు అభ్యంతరం చెప్పారని, సదరు ఆర్డర్ ఇచ్చే అర్హత తమ విభాగానికి లేదని తెలిపారు. ఈ విచారణలో దీనిని మఠంగా నిర్వహిస్తున్నారా, వెంకటేశ్వర దేవస్థానంగా దేవదాయశాఖ పరిధిలో వుందా, ఆస్తుల అన్యాక్రాంతం తదితర అంశాలపై విచారణ సాగిందన్నారు. సీఐ వైఆర్కే శ్రీనివాస్ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయగా, పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేవదాయశాఖ డీసీ రమేష్‌బాబు పురావస్తుశాఖ ఆర్డర్‌పై విచారణ -
నూతన పద్ధతులపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలి
ఆల్కాట్‌తోట (రాజహేంద్రవరం రూరల్): వాణిజ్య పంటల సాగులో జన్యుపరమైన నూతన పద్ధతులు, కొత్త రసాయనాలు, విలువ జోడింపుపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (సీటీఆర్ఐ) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ సూచించారు. బుధవారం స్థానిక సీటీఆర్ఐలోని సమావేశ మందిరంలో మూడో రోజు పరిశోధన కమిటీ సమావేశాలు ఆయన అధ్యక్షతన జరిగాయి. దీనికి డాక్టర్ ఎం.శేషుమాధవ్, బెంగళూరు ఐఐహెచ్ఆర్ ఫార్మర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సీకే నారాయణ, సీటీఆర్ఐ ఫార్మర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సీవీ నరసింహారావు, హైదరాబాద్ ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ బీబీ సుబ్బారెడ్డి, సీటీఆర్ఐ ఫార్మర్ డివిజన్ హెడ్ సి.చంద్రశేఖరరావు నిపుణులుగా వ్యవహరించారు. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు ఎల్కే ప్రసాద్, అనిందిత పాల్, కె.సుమన్ కళ్యాణి, ఎం.అనురాధ, నమితాదాస్ సాహా తమ పరిశోధనా ఫలితాలను వివరించారు. వాణిజ్య పంటల సాగులో కొత్త రసాయనాలు, విలువ జోడింపు పరిశోధనలపై చర్చించారు. ఆముధం నూనె నుంచి 2–ఆక్టనాల్ వెలికితీత, వర్జీనియా పొగాకులో పిలకలను అరికట్టడానికి కొత్త రసాయనాలు, అశ్వగంధలో బయో యాక్టివ్ కాంపౌండ్లు, పురుగు మందుల అవశేషాలను గుర్తించే విశేష పద్ధతులు వంటి పరిశోధనలపై పురోగతిని తెలిపారు. పసుపు, మిరపను ఉపయోగించి విలువ ఆధారిత ఉత్పత్తులు, వాటి ప్రయోజనాలు వివరించారు. అనంతరం సాంకేతిక సమావేశాలకు నిపుణులుగా హైదరాబాద్ ఐఐఆర్ ఫార్మర్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ ఎం.సుజాత, సీటీఆర్ఐ ఫార్మర్ డైరెక్టర్ టీజీకే మూర్తి వ్యవహరించారు. సమావేశంలో శాస్త్రవేత్తలు కె.సరళ, సి.నంద, కె.గంగాధర్, పి.మణివేల్, జేజే రాజప్ప తమ పరిశోధనా ఫలితాలను తెలిపారు. వాణిజ్య పంటల్లో జన్యు మెరుగుదల, నూతన పద్ధతులు, వంగడాల్లో అధిక దిగుబడి, అధిక నాణ్యతను పెంపొందించడం, వ్యాధి నిరోధక వంగడాలపై జరుగుతున్న పరిశోధనల ఫలితాలను నిపుణులు చర్చించి సలహాలు, సూచనలను అందించారు. -
తప్పిపోయిన మహిళ బంధువుల చెంతకు
అన్నవరం: బంధు మిత్రులతో కలసి తీర్థయాత్రలు చేస్తూ అన్నవరం రైల్వే స్టేషన్లో దిగి తప్పిపోయి రెండ్రోజులుగా ఇబ్బంది పడుతున్న ఖర్నూల్ జిల్లా రాయచూర్‌కు చెందిన గుర్రం లక్ష్మీదేవిని బంధువులకు అప్పగించినట్లు అన్నవరం రైల్వై స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథరావు తెలిపారు. బుధవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రాయచూర్‌కు చెందిన గుర్రం లక్ష్మీదేవి తన బంధువులు, కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తూ సోమవారం అన్నవరం రైల్వే స్టేషన్లో దిగిపోయింది. ఆమె తన బంధు మిత్రులను కలుసుకునేందుకు రెండ్రోజులుగా ప్రయత్నిస్తుంది. అయితే ఆమె బంధువులు సామర్లకోట, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో ఆమె కోసం గాలిస్తున్నారు. కాగా, బుధవారం అన్నవరం రైల్వే స్టేషన్లో బంగారు ఆభరణాలు ధరించి లగేజీ బ్యాగ్‌తో తిరుగుతున్న ఆమెను రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథరావు విచారించగా తన వివరాలు తెలిపింది. దీంతో తుని రైల్వే ఎస్ఐ జి.శ్రీనివాస్‌కు విషయం తెలియజేయగా ఆయన సూచనలు మేరకు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. బుధవారం బంధువులు అన్నవరం రైల్వే స్టేషన్‌కు రాగా గుర్రం లక్ష్మీదేవిని వారికి అప్పగించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
జీఆర్టీ జ్యూయలర్స్ షోరూం ప్రారంభం
రాజమహేంద్రవరం సిటీ: జీఆర్టీ జ్యూయలర్స్ 61వ షోరూమ్‌ను బుధవారం రాజమహేంద్రవరం డీలక్స్ సెంటర్లో ప్రారంభించారు. జీఆర్టీ 60 ఏళ్లుగా నాణ్యత, విశ్వాసం, బలమైన ఉనికితో వ్యాపారాన్ని సాగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ ప్రాంతాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన బంగారం, డైమండ్, ప్లాటినం, వెండి, జాతి రత్నాల ఆభరణాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు. బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ.50 తగ్గింపు, బంగారు ఆభరణాల వేస్టేజీపై 20 శాతం తగ్గింపు, డైమండ్ విలువపై క్యారెట్‌కు రూ.10 వేల తగ్గింపుతో అందిస్తున్నామన్నారు. కస్టమర్లు వెండి వస్తువులు పట్టీల మేకింగ్ చార్జీలపై 25 శాతం తగ్గింపు, అన్‌కట్ డైమండ్ విలువపై 10 శాతం తగ్గింపు అందిస్తున్నామని జీఆర్టీ జ్యూయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. కార్యక్రమంలో జ్యూయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. గాయపరిచిన వ్యక్తిపై కేసు కొత్తపల్లి: యువకుడిని గాయపరిచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు బుధవారం స్థానిక పోలీసులు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే.. అమీనాబాద్ గ్రామానికి చెందిన యువకుడు గంట శ్రీను ఆదివారం రాత్రి టిఫిన్ తెచ్చేందుకు సెంటర్లోకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి శ్రీనును ఆపి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వైఎస్సార్ సీపీ టీషర్స్ వేసుకుంటున్నావని, గతంలోనే హెచ్చరించినా బుద్ధి రాలేదా అంటూ అన్నాడు. దీంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. శ్రీను ను రాజు తలపై గాయపరచగా, పిఠాపురం ప్రభు త్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై బాధితుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. గుమస్తా చేతివాటం నిడదవోలు: గోల్డ్ టెస్టింగ్ షాపులో ఏడాదిన్నరగా నమ్మకంగా పని చేస్తున్న ఓ గుమస్తా చేతివాటం ప్రదర్శించాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. నిడదవోలులో సీఐ పీవీజీ తిలక్ బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర రాజ్యవేడి గ్రామానికి చెందిన బంగారు వ్యాపారులు ప్రశాంత్, నేతాజీలు 20 ఏళ్ల కిందట ఆంధ్రాకు వచ్చారు. ఇందులో వ్యాపారి ప్రశాంత్ రాజమహేంద్రవరంలో డీకే గోల్డ్ టెస్టింగ్ షాపు, మరో వ్యాపారి నేతాజీ తాడేపల్లిగూడెంలో జేపీ గోల్డ్ టెస్టింగ్ షాపులు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంలో డీకే గోల్డ్ టెస్టింగ్ బంగారు షాపులో అమర్ గుమస్తా ఏడాదిన్నరగా పని చేస్తున్నాడు. అయితే తాడేపల్లిగూడెం షాప్‌లో పనిచేస్తున్న సాగర్ అనే వ్యక్తి పనిచేయడం మానేయడంతో 15 రోజుల కిందట గుమస్తా అమర్‌ను తాడేపల్లిగూడెం షాపునకు పనికి పంపించారు. తాడేపల్లిగూడెం షాపు యజమాని నేతాజీ ఈ నెల 13న రాత్రి రాజమహేంద్రవరం షాపునకు తీసుకు వెళ్లాలని సుమారు 289.340 గ్రాముల గోల్డ్ కచ్చా ముక్కలు, రూ. 6.30 లక్షల నగదును అమర్‌కు ఇచ్చాడు. వాటిని తీసుకుని ఈనెల 14న అతను మోటార్ సైకిల్‌పై బయలు దేరాడు. అమర్ ముందుగా వేసుకున్న పధకం ప్రకారం నిడదవోలు పట్టణంలోని ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం వద్ద రోడ్డు పక్కన తుప్పల్లో బంగారం, నగదును దాచాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. -
బాల్యం ఎంతో మధురం
బాలలపై అసభ్యంగా ప్రవర్తిస్తే పోక్సో నమోదు : కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ సిటీ/బోట్‌క్లబ్: బాలల పట్ల అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల పోక్సో చట్టం కింద కఠినమైన చర్యలు చేపడతామని కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్ స్టేడియంలో ఐసీడీఎస్, విద్య, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా, అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, డీఎస్పీ రఘువీర్ విష్ణు గౌరవ అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. బాల్యాన్ని మధురమైన దశగా నిలిపేందుకు బాలలకు ప్రత్యేక హక్కులు కల్పించి, వారి రక్షణకు పోక్సో వంటి చట్టాలు అమలుచేస్తున్నట్టు తెలిపారు. బాలలపై అకృత్యాలను అరికట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. చైల్డ్ సేఫ్ జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దే లక్ష్యంగా జిల్లాలో 6 నెలల పాటు ఉద్యమ కార్యాచరణ చేపట్టి, చైల్డ్ అబ్యూజ్ నివారణకు గుడ్–బ్యాడ్ టచ్, పిల్లల హక్కులు, రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 1098, 112 హెల్ఫ్లైన్లకు ఫోన్ చేయవచ్చునని, 73311 26044 నెంబరుకు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేసి తక్షణ సాయం పొందవచ్చని ఆయన బాలలకు సూచించి ఆయా నంబర్ల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆయన ప్రశంసా పురస్కారాలను అందజేశారు. పీఎం కేర్స్, సీఎం కేర్స్ పథకాల కింద సంరక్షణ పొందుతున్న పిల్లలకు బహుమతులను అందజేశారు. బాలల రక్షణకు ఏర్పాటు చేసిన అత్యవసర రక్షణ వ్యవస్థల ఫోన్ నెంబర్లతో ముద్రించిన గోడపత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషనర్ సభ్యులు టి.ఆదిలక్ష్మి, కార్మిక శాఖ ఏసీ ఎం.బుల్లిరాణి, డీఆర్డీఏ ఏపీడీ ఎంఎం జిలాని, చైల్ ప్రోటెక్షన్ అధికారి సిహెచ్ వెంకట్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ, జానపద సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
సరికొత్త పంథాలో మోసం
రూ.25 వేలు దోచేసిన సైబర్ నేరగాళ్లు కరప: సైబర్ నేరగాళ్లు మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా కరపకు చెందిన ఒక చిరుద్యోగి రూ.25 వేలు పోగొట్టుకున్నాడు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కరప గ్రామానికి చెందిన పెనుపోతులు రాజ్‌కుమార్ గురజనాపల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం అతను కంపెనీలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి నీ ఆధార్‌కార్డుపై సిమ్‌కార్డు తీసుకుని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేస్తున్నారని బెదిరించాడు. తర్వాత మరో వ్యక్తి రాజ్‌కుమార్ ఫోన్‌కు వాట్సాప్ వీడియో కాల్ చేసి ముంబయి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు పరిచయం చేసుకున్నాడు. ఫోన్ చేసిన వ్యక్తి పోలీసు యూనిఫాం ధరించి ఉన్నాడు. అతని వెనుక సెటప్ అంతా పోలీస్ స్టేషన్లా కనబడటంతో రాజ్‌కుమార్‌కు కంగారు పట్టుకుంది. తన పేరు, ఆధార్‌కార్డు నంబరు కరెక్ట్‌గా చెప్పడంతో సదరు మోసగాడు అడిగే ప్రశ్నలకు సరెండర్ అయిపోయాడు. నిన్ను డిజిటల్ అరెస్ట్ చేశాం, ఎవరూ లేని గదిలోకి వెళ్లమన్నాడు. రాజ్‌కుమార్ వద్ద మరో మొబైల్ ఫోన్ ఉందని గ్రహించి, దానిని స్విచ్ఛాప్ చేయమని ఆదేశించాడు. ఎనీ డస్క్ యాప్ ద్వారా రాజ్‌కుమార్ సెల్‌ఫోన్ సైబర్ కేటుగాడు స్వయంగా ఆపరేట్ చేస్తూ, ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశాడు. మనీ ల్యాండరింగ్ చేశావని, రూ.2.59 కోట్ల మేర లావాదేవీలు జరిపావని బెదిరించాడు. దీనిపై కేసు నమోదు చేసి, డిజిటల్ అరెస్ట్ చేశామని తెలిపి, ఎఫ్ఐఆర్ కాపీతో పాటు మరికొన్ని పత్రాలు వాట్సాప్ చేశాడు. కోర్టు ఫీజు చెల్లించాలంటూ వెంటనే రూ.25 వేలు పంపించాలని ఆదేశించారు. మోసగాడి మాటలకు భయపడిన రాజ్‌కుమార్ అతను చెప్పిన విధంగానే సదరు సొమ్మును యూపీఐ పేమెంట్ చేశాడు. కొంత సమయం తర్వాత మరో రూ.25 వేలు పంపాలని కేటుగాడు డిమాండ్ చేశాడు. తన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదని, కరప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోతానని బాధితుడు తెలిపాడు. అంతవరకు లైన్లోనే ఉంటానని, స్టేషన్ కెళ్లి పోలీసులకు ఫోన్ ఇమ్మని చెప్పాడు. మోటార్ సైకిల్‌పై ఫోన్ మాట్లాడుతూ నడకుదురు వద్దకు వచ్చేసరికి సైబర్ మోసగాడు ఫోన్ కట్‌చేసి, రాజ్‌కుమార్‌కు పంపించిన పత్రాలు డిలీట్ చేశాడు. మోసపోయానని గ్రహించిన రాజ్‌కుమార్ కరప స్టేషన్‌కు వచ్చి ఎస్ఐ టి.సునీతకు జరిగిన ఉదంతమంతా వివరించాడు. 1930కి కాల్చేసి సైబర్ కేసు నమోదు చేయించుకోవాలని బాధితుడికి పోలీసులు తెలిపారు. -
సంక్షేమం డొల్ల!
● పెద్దాపురం రూరల్, అర్బన్ పరిధిలో ఉన్న ఎనిమిది వసతిగృహాల్లో సుమారు 950 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీటిలో పెద్దాపురం ఎస్సీ బాలుర వసతి గృహాలు రెండూ పూర్తిగా శిథిలావస్థలో కనిపించాయి. కనీసం ఈ వసతిగృహానికి రక్షణ గోడలు కూడా లేవు సరికదా కనీస వసతులు కొరవడ్డాయి. సామర్లకోట బీసీ బాలికల వసతిగృహం చుట్టూ దుర్గంధం వ్యాపించి ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సమీపంలోని రాజీవ్ గృహకల్ప ఇళ్ల సముదాయాల నుంచి నిత్యం మురుగునీరు నిలిచిపోయి అక్కడున్న గోతుల్లో పందులు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. హాస్టల్ సమీపంలో సెప్టీక్లీన్ ట్యాంకర్లను నిలిపి ఉంచడంతో దోమల బెదడతో సతమతమవుతున్నారు. చీకటి పడిందంటే చాలు దోమలతో వేగలేకపోతున్నారు. కనీసం దోమల చక్రాలు కూడా ఇవ్వడం లేదు. ఇక్కడి నుంచి సెప్టీక్లీన్ ట్యాంకర్లను తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులలో స్పందన లేదు. హాస్టల్ భవనం కూడా శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. శ్లాబ్‌లు పెచ్చులూడి పడిపోతున్నాయి. తలుపులు చెదపట్టేశాయి. ఆవరణలో చెత్త పెరిగిపోయినా ఇన్చార్జి వార్డెన్ కావడంతో పెద్దగా దృష్టిపెట్టడం లేదు. గతంలో 30 మంది ఉండే విద్యార్థినులు ఇక్కడి పరిస్థితులతో 15 మందికి తగ్గిపోయారు. ప్రహరీ లేని వసతి గృహంశిథిలావస్థకు చేరిన పెద్దాపురం ఎస్సీ బాలుర వసతి గృహంసాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్షేమ హాస్టళ్లలో భద్రత వట్టిమాటగానే మిగిలిపోతోంది. కరెంటు పోతే కటిక చీకటి.. ఇన్వెర్టర్లు లేని దుస్థితి.. ప్రహారీ గోడలు లేక భద్రత లేని డొల్లతనం.. అంత మంది విద్యార్థినులున్న వసతి గృహాల్లో రక్షణ కరువు.. పారిశుధ్యం క్షీణించడం.. పందుల స్వైర విహారం.. దోమలతో విద్యార్థినుల సహవాసం. కనీసం దోమల చక్రాలకు దిక్కులేని పరిస్థితి.. రెసిడెన్షియల్, వసతిగృహాల్లో చదివే విద్యార్థులు భద్రంగా, సురక్షితంగా ఉండాలంటే మార్గదర్శకాలు అవసరమని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే జోక్యం చేసుకుని సూచించిందటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలనలో అనేక లోపాలు బయటపడ్డాయి. జిల్లాకు ఒక వైపున ఉన్న తుని నియోజకవర్గ కేంద్రంలోని హంసవరం మోడల్ స్కూల్, కోటనందూరు మండలం తిమ్మరాజుపేట, తొండంగి మండలం రావికంపాడు వసతిగృహాల్లో అధ్వాన పరిస్థితులు కనిపించాయి. హంసవరం మోడల్ స్కూల్లో 9 నుంచి ఇంటర్ వరకు 100 మంది పైనే చదువుతున్నారు. ఇంత మంది ఉన్న ఈ వసతి గృహానికి ప్రహరీ గోడ లేదు. దీంతో చీకటి పడిందంటే చాలు విద్యార్థులు భయంతో ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తున్న వాతావరణం. రాత్రిపూట విద్యార్థులకు కనీస రక్షణ కరువైంది. ప్రైవేటు సంస్థల నుంచి కనీస భద్రత కూడా ఏర్పాటు చేయక పోవడంతో విద్యార్థినులు బెంగపెట్టుకుంటున్నారు. ● కోటనందూరు మండలం తిమ్మరాజుపేటలోని బీసీ బాలికల వసతి గృహంలో 42 మంది విద్యార్థినులున్నారు. ఈ హాస్టల్ భవనం శిథిలమై శ్లాబ్ పెచ్చులు ఊడి విద్యార్థినిలపై పడుతూ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ హాస్టల్లో మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉండడం విద్యార్థినులకు శాపంగా మారింది. కనీసం తాగునీరు సక్రమంగా ఉండటం లేదు. హాస్టల్లో నెలకొన్న పరిస్థితులతో గత్యంతరం లేక సిబ్బంది స్థానిక విద్యార్థినులను హాస్టల్లో చేర్చుకుని భోజనానంతరం ఇళ్లకు పంపేస్తున్నారు. ● తొండంగి మండలం రావికంపాడు బీసీ హాస్టల్ భవనం దాదాపు శిథిలావస్థలో ఉంది. మరుగుదొడ్ల నిర్వహణ చాలా దారుణంగా ఉండి అడుగుపెట్టే వాతావరణం లేదు. ● ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గురుకుల పాఠశాల ప్రాంగణం అధ్వానంగా తయారైంది. పాఠశాల ప్రాంగణం మొత్తం తుప్పలమయమై విద్యార్థినులు భయకంపితులవుతున్నారు. ఇటీవలే ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థినిలు అస్వస్థతకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శంఖవరం కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేస్తున్న వంటశాల చాలా అపరిశుభ్రంగా కనిపించింది. విద్యార్థులు తరచు అనారోగ్యాలు పాలవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● పిఠాపురం బైపాస్ రోడ్లో ఉన్న బాలికల సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు భద్రత కరువైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో బాలికల వసతిగృహంలోనే మరుగుదొడ్లకు తలుపులు లేక విద్యార్థినులు నరకం కళ్లచూస్తున్నారు. గదులు తలుపులు, కిటికీలకు దోమల మెష్‌లు లేక చీకటి పడితే నానా అవస్థలు పడుతున్నారు. బట్టలు మార్చుకునే సౌకర్యం కూడా లేదు. రాత్రిపూట విద్యుత్ పోయిందంటే హాస్టల్లో అంధకారం తాండవిస్తోంది. వాచ్మెన్, కనీసం ప్రైవేటు భద్రత కూడా లేదు. ● జగ్గంపేట మండలం రామవరం ఎస్సీ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరుకుని విద్యార్థినులు భయకంపితులను చేస్తోంది. వసతి గృహంలో 72 మంది భయంభయంగా కాలం గడుపుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంటే ప్రాణాలు అరచేత పట్టుకుని ఉంటున్నారు. ఇన్వెర్టర్ సదుపాయం లేక చార్జింగ్ లైట్లతో కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి. వసతి గృహంలోని ఫ్యాన్లు సైతం సరిగా పనిచేయకపోవడంతో దోమలు, ఉక్కపోతతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. ● కాకినాడ జగన్నాథపురంలోని వసతిగృహం శిథిలావస్థకు చేరడంతో ప్రైవేటు భవనంలో వసతి కల్పించారు. చర్చి స్క్వేర్ సమీపంలో ఓఎన్జీసీ సీఎస్ఆర్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన భవనంలో 170 మంది ఎస్సీ విద్యార్థులు ఉంటున్నారు. వెంకట్‌నగర్‌లో ఉన్న రెండు ఎస్సీ హాస్టళ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఇక్కడి విద్యార్థులను గాంధీనగర్‌లో ప్రైవేటు వసతి భవనంలోకి మార్చారు. ఆ భవనంలోనూ భద్రత కరువే. హాస్టల్ పర్యవేక్షణకు వార్డెన్ తప్ప ప్రైవేటు సెక్యూరిటీ కూడా లేదు. కనీసం సీసీ కెమేరాలు లేవు సరికదా ఉన్న ఇన్వెర్టర్లు సక్రమంగా పనిచేయడంలేదు. వసతి గృహాల్లో పరిస్థితులు చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ పాలకులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వసతిగృహాల్లో భద్రత కరవు ప్రహారీలు లేక భయంభయం పారిశుధ్యం క్షీణించి దోమలతో సహవాసం హైకోర్టు చెప్పింది అక్షర సత్యం సవతి ప్రేమ చూపుతున్న పాలకులు -
ఉరుకులు... పరుగులు
● రైల్వే స్టేషన్లో భీతావహం ● రైలు పట్టాలు తప్పిందని హడావుడి ● మాక్‌డ్రిల్‌తో అవగాహన కల్పించిన అధికారులు ● ఎలా రక్షించాలో చూపించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాజమహేంద్రవరం సిటీ: ఏం జరిగిందో తెలియదు.. అంతా హడావుడి.. ఒక్కసారిగా అధికారుల ఉరుకులు, పరుగులు.. ఈ పరిణామాలతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో భీతావహ పరిస్థితి.. స్టేషన్‌లోని కోల్ యార్డ్ వద్ద రైలు పట్టాలు తప్పిందని తెలియడం, ఒక్కసారిగా ఆ రైలులోని ప్రయాణికులు భయంతో కేకేలు వేయడం.. సంఘటనా స్థలానికి రైల్వే ఎన్డీఆర్ఎఫ్ బృందం, వైద్య అధికారులు, రెవెన్యూ, పోలీస్, తదితర శాఖల సిబ్బంది కంగారుగా వెళ్లడం.. రైలు బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు అత్యాధునిక కట్టర్లు ఉపయోగించి బోగీ కిటికీలను కట్ చేయడం.. అందులోంచి ప్రయాణికులను బయటకు లాగి, రోప్ ద్వారా సురక్షితంగా తీసుకురావడం చూసి స్టేషన్ వద్ద ప్రయాణికులు వామ్మో అనుకున్నారు. చివరికి ఇదంతా రైల్వే ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్వహించిన మాక్ డ్రిల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైలు ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత తక్కువ సమయంలో త్వరితగతిన రెస్క్యూ కార్యకలాపాలను ఏ విధంగా చేపట్టాలనే అంశాలపై రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్పీఏఆర్ఎంవీ సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ ఆద్యంతం కళ్లకట్టినట్టు అయ్యింది. విజయవాడ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ఆపరేషన్స్) శ్రీనివాసరావు కొండ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రైల్వే స్టేషన్ కోల్ యార్డ్‌లో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్, వివిధ శాఖల అధికారులతో కలసి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు కొండ మాట్లాడుతూ ప్రయాణాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. దీనిపై మెకానికల్, సేఫ్టీ, మెడికల్, ఎస్‌అండ్‌టీ విభాగాల్లోని సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన అంశాలను తెలియజేస్తున్నామన్నారు. ప్రమాద సమయంలో రెస్క్యూ కార్యకలాపాలను చేపట్టడానికి త్వరితగతిన స్పందించే విధంగా విజయవాడలోని ఎన్డీఆర్ఎఫ్, ఎస్పీఏఆర్ఎంవీ సిబ్బంది మాక్‌డ్రిల్‌ను సమర్థంగా నిర్వహించారన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాములు మాట్లాడుతూ రైలు ప్రమాదాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు అత్యవసరంగా చేపట్టాల్సిన చర్యలను మాక్‌డ్రిల్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించడం అభినందనీయమన్నారు. ప్రయాణికులకు రక్షించి సమీప ఆసుపత్రులకు ఎలా తరలిస్తారో చూపారన్నారు. మొత్తం 100 మంది రైల్వే సిబ్బంది రెస్క్యూ, పునరుద్ధరణ కార్యకలాపాల్లో పాల్గొని సమర్థంగా చర్యలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో రైల్వే అధికారి బి.ప్రశాంతకుమార్, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. -
లక్ష్మీ గాయత్రి నర్సింగ్ స్కూల్‌పై అట్రాసిటీ కేసు
కాకినాడ రూరల్: స్థానిక ఇంద్రపాలెంలోని లక్ష్మీ గాయత్రి నర్సింగ్ స్కూల్‌పై వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. సుమారు 300 మంది విద్యార్థులు ఉన్న ఈ సంస్థలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గీయులే ఉన్నారు. ఈ స్కూల్లో అధిక ఫీజుల వసూళ్లు, మౌలిక వసతుల లేమి, భోజనంలో నాణ్యత లేదని ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. ఆయన ఆదేశాలతో డీఎంహెచ్ఓ నాయక్, ఐసీడీఎస్ పీడీ ప్రవీణ, ఆర్డీఓ మల్లిబాబు తదితరులు అక్కడి విద్యార్థులను విచారించి వివరాలు సేకరించారు. ఆ నివేదికను వారు కలెక్టర్ షణ్మోహన్‌కు అందజేశారు. దీంతో ఆయన తీవ్రంగా స్పందించి అన్ని నర్సింగ్ పాఠశాలలను తనిఖీ చేయాలని ఆదేశించారు. కాగా లక్ష్మీ గాయత్రీ నర్సింగ్ స్కూల్ యాజమాన్యంపై అట్రాసిటీ కేసు నమోదుకు ఆదేశించినట్టు ఆర్డీఓ మల్లిబాబు తెలిపారు. కాలపరిమితి జీఓ రద్దు చేయాలి కాకినాడ సిటీ: మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న యానిమేటర్లను తొలగించాలని ఇచ్చిన కాల పరిమితి సర్క్యులర్‌ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగులు బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యానిమేటర్లపై రాజకీయ వేధింపులు పెరిగిపోయాయని విమర్శించారు. అక్రమ తొలగింపులు చెల్లవని, తొలగించిన తిరిగి నియమించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం జిల్లా డీఆర్డీఏ అధికారులు అమలు చేయకుండా బెదిరింపులకు దిగుతున్నారని ఆందోళనకారులు వివరించారు. వీవోఏల చేత విలేజ్ మాల్ సరుకులు విక్రయించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సంఘం గౌరవాధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంగాభవాని, ఈశ్వరీబాయి, మేరీ, చంద్రవతి, నర్ల ఈశ్వరి, సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు కలెక్టర్ షణ్మోహన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ముడిపులు ఇచ్చిన వారికే నష్ట పరిహారం కిర్లంపూడి: గతంలో వచ్చిన తుపానులకు పంటలు నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో పంట నష్టపరిహారం అందలేదని, ముడుపులిచ్చిన వారికే అధికారులు పరిహారం ఇచ్చారని భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు ఆరోపించారు. స్థానిక విజ్ఞాన భారతి హైస్కూల్లో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు రాసంశెట్టి రాజా అధ్యక్షతన బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యల్లపు సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు నీలగిరి చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేలాది రూపాయాలు పెట్టుబడి పెట్టి పంటలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు రైతును నిండా ముంచాయన్నారు. పంట నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుంటే అధికారులు మాత్రం అసలైన రైతులను విడిచిపెట్టి ముడుపులు చెల్లించిన వారికి మాత్రమే పంట నష్టపరిహారం ఇచ్చారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించి అర్హులైన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. కోతలు కోయకుండానే విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ జె.చిరంజీవికి వినతిపత్రాన్ని అందజేశారు. -
వేట నిషేధ సాయం ఏమైంది!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రోజూ సాగరంలో సమరం.. వేటే వారి జీవనాధారం.. వలకు చిక్కిన చేపలే ఆ మత్స్యకారుల జీవన గమనానికి ఆధారం.. అలాంటి సముద్ర వేటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ఏప్రిల్ 14 నుంచి రెండు నెలల పాటు నిషేధిస్తుంటాయి. ఆ నిషేధ సమయం 61 రోజులూ సాపాటు లేక మత్స్యకార కుటుంబాలు నానా అవస్థలు పడుతుంటాయి. ఈ ఏడాది నిషేధ సమయం ముగిసి ఆరో నెల వచ్చేసింది. ఆ సమయంలో చేసిన అప్పులు తీర్చలేక అవే ఇప్పుడు గుదిబండగా మారాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ రోజు తమకు ఈ ఇబ్బందులు ఉండేవి కాదని, సముద్ర వేటపై ఆధారపడిన మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 35 వేల కుటుంబాలకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసాకు కూటమి సర్కార్ మోకాలడ్డు పెట్టింది. అదే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ఏటా వేట నిషేధ సమయం ముగియకుండానే పరిహారాన్ని అందజేసి మత్స్యకారులకు భరోసా కల్పించారు. గత ఐదేళ్లూ ఏటా మే లేదా జూన్ నెల దాటకుండానే వైఎస్సార్ మత్స్యకార భరోసా అందజేస్తూ వచ్చారు. మెకనైజ్డ్, మోటారు బోట్లపై సముద్రంలో చేపల వేటపై ఆధారపడిన ప్రతి కుటుంబానికి 61 రోజుల వేట నిషేధ సమయంలో వేట నిషేధ భృతిగా రూ.10 వేల చొప్పున వైఎస్సార్ మత్స్యకార భరోసా అందజేసింది. అటువంటిది కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక సమస్యలు మొదలయ్యాయని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలైనా ఏ ఒక్క మత్స్యకారుడి ఖాతాల్లో వేట నిషేధ భృతి జమ కాలేదని వాపోతున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వేట నిషేధ పరిహారం కుటుంబానికి కేవలం రూ.4 వేల చొప్పున అందజేసింది. ఇలా 2019 వరకూ 22,250 మందికి రూ 8.90 కోట్లు మాత్రమే పరిహారం ఇచ్చారు. చోద్యం చూస్తున్న ప్రభుత్వం కాకినాడ జిల్లాలో సుమారు 94 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తొండంగి, తుని రూరల్, ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ రూరల్, తాళ్లరేవు మండలాల పరిధిలో 1,95,184 మంది మత్స్యకారులు నివసిస్తున్నారు. ఇందులో సముద్రంలో చేపల వేటపై ఆధారపడి 36,101 మంది ఉపాధి పొందుతున్నారు. క్రమం తప్పకుండా గడచిన ఐదేళ్లు ఏటా మత్స్యకార భరోసాగా రూ.24 కోట్ల నుంచి రూ.30 కోట్ల నిషేధ భృతిగా 25 వేల నుంచి 30 వేల మంది మత్స్యకార కుటుంబాలకు నేరుగా సీఎం జగన్ బటన్ నొక్కి వారి వ్యక్తిగత ఖాతాలకు జమచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేట నిషేధ భృతికి అర్హులను మత్స్యశాఖ గుర్తించి నెలలు గడుస్తోంది. గత మే నెలలోనే కాకినాడ జిల్లాలో 24,147 మత్స్యకార కుటుంబాలను భృతికి అర్హమైనవిగా ఎంపిక చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం, పి.గన్నవరం, రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం నియోజకవర్గాల్లో ఈ ఏడాది వేట నిషేధ భృతి కోసం 11,305 మందిని గుర్తించారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున అందించాలి. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సుమారు 48 వేల కుటుంబాలకు వేట నిషేధ భృతి ఇవ్వాలి. ఇంకా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కాకినాడ జిల్లాలో.. తీర ప్రాంత మండలాలు : 5 మత్స్యకార గ్రామాలు: : 58 మైరెన్ ఫిషర్మెన్ : 2లక్షల మంది సముద్ర వేట ద్వారా జీవనోపాధి : 36,101 మంది మెకనైజ్డ్ బోట్లు : 467 మోటారు బోట్లు : 3779 సంప్రదాయ బోట్లు : 399 ఎప్పుడిస్తారో తెలియక మత్స్యకారుల ఎదురుతెన్నులు నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం -
వచ్చేనెల 8 నుంచి దివ్యాంగుల క్రికెట్ టోర్నీ
సీటీఆర్ఐ: దివ్యాంగుల క్రికెట్ టోర్నీ వచ్చేనెల 8వ తేదీ నుంచి విశాఖలో నిర్వహిస్తున్నట్టు అఖిల భారత దివ్యాంగుల హక్కుల జాతీయ కార్యదర్శి ముత్యాల పోసికుమార్ అన్నారు. రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి పల్నాటి బలరామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్ వద్ద ఈ టోర్నీ సన్నాహక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోసికుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు విశాఖలోని గాజువాక జింక్ గ్రౌండ్లో పది జిల్లాల దివ్యాంగుల క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 98858 64940, 92473 86666 ఫోన్ నెంబర్లను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 22వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు లాలాచెరువు మైదానంలో ఎంపికలు ఉంటాయన్నారు. బలరామకృష్ణ మాట్లాడుతూ ఈ సదవకాశాన్ని దివ్యాంగులంతా ఉపయోగించు కోవాలని, బుధ, గురు వారాలలో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. విశాఖలోని గాజువాక జింక్ గ్రౌండ్లో నిర్వహణ అఖిల భారత దివ్యాంగుల హక్కుల జాతీయ కార్యదర్శి పోసికుమార్ విజయవంతం చేయాలని జిల్లా కెప్టెన్ బలరామకృష్ణ పిలుపు -
ప్రపంచ స్థాయి పరిశోధనలు అవసరం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వాణిజ్య పంటల పరిశోధనా కేంద్రంగా సీటీఆర్ఐ రూపాంతరం చెందుతున్న తరుణంలో పరిశోధన కమిటీ సమావేశాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయని, వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రపంచ స్థాయిలో పరిశోధనలు చేపట్టాలని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. మంగళవారం రెండో రోజు మూడు, నాలుగో సాంకేతిక సమావేశానికి ఆయనతో పాటు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వ డీన్ డాక్టర్ జె.కృష్ణప్రసాద్, సీటీఆర్ఐ పూర్వ డివిజన్ హెడ్ డాక్టర్ యు. శ్రీధర్, ఇన్నోవేషన్ హబ్, ఇక్రిసాట్ విభాగాధిపతి డాక్టర్ ఆర్. శ్రీకాంత్ నిపుణులుగా వ్యవహరించారు. పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ఫలితాలను వివరించారు. -
సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన
కాకినాడ క్రైం: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రపై మంగళవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఎస్పీ కార్యాలయంలో, జేఎన్టీయూకే ఆడిటోరియంలో అక్కడి విద్యార్థులకు ఎస్పీ అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్టు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, కేవైసీ మోసాలపై సదస్సులో చర్చించారు. అనంతరం సైబర్ నేరాల నియంత్రణపై ప్రచారంలో భాగంగా అవగాహన పోస్టర్లు విడుదల చేశారు. -
108 కిలోల విభూదితో శివయ్యకు అభిషేకం
గండేపల్లి: మండలంలోని ఉప్పలపాడులో ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం 108 కిలోల విభూదితో స్వామి వారిని అభిషేకించారు. ఆలయ పురోహితులు చంద్రమౌళి సుబ్బారావు శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. శతాధిక వృద్ధుడి మృతి జగ్గంపేట: స్వాతంత్య్రోద్యమం నుంచి కూడా రాజకీయాలలో తిరుగుతూ ప్రముఖ నేతల వెంట నడిచిన శతాధిక వృద్ధుడు బూరా చిన అప్పారావు సోమవారం రాత్రి మృతి చెందారు. జగ్గంపేట అంబేద్కర్ నగర్‌కు చెందిన అప్పారావు 1907లో జన్మించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసుత్తం అప్పారావుకు 116 సంవత్సరాలు అని కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో కూతురు బి.సరోజిని వద్ద ఇంటి వద్ద ఉంటున్నారని వారు తెలిపారు. ఆయన మృతికి స్థానిక నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు. 25 వరకూ దూర విద్య అడ్మిషన్లునల్లజర్ల: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈనెల 25 వరకూ టెన్త్, ఇంటర్లకు తత్కాల్ అడ్మిషన్లు చేసుకోవచ్చని దూబచర్ల స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్ అంబటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయాన్ని ఆసక్తిగల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్ పరీక్షల ఫీజుకు రేపే తుది గడువు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు ఈ నెల 21వ తేదీలోగా ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు ఆర్ఐవో ఎన్‌ఎస్‌ఎల్‌వీ నరసింహం మంగళవారం తెలిపారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో జనరల్, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు ఆ గడువులోగా చెల్లించాలన్నారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో 22 నుంచి డిసెంబర్ ఐదో తేదీలోగా చెల్లించవచ్చన్నారు. -
రత్నగిరి ఘాట్‌రోడ్డులో అగ్నిప్రమాదం
అన్నవరం: సత్యదేవుని దర్శనానికి మంగళవారం తాడేపల్లిగూడెం నుంచి కారులో వచ్చిన భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న కారులో అగ్నిప్రమాదం సంభవించి కారు బోనెట్ నుంచి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన భక్తులు వెంటనే బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఏలూరు జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు మంగళవారం సత్యదేవుని దర్శనానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఘాట్‌రోడ్ రెండో మలుపులో కారు ఇంజిన్ నుంచి పొగ రావడాన్ని గమనించి పక్కకి ఆపి అందరూ దిగిపోయారు. కారు లోపలకు మంటలు వ్యాపించడంతో స్టీరింగ్ వద్ద ముందు భాగం కాలిపోయింది. వెంటనే తమ వద్ద నున్న వాటర్ బాటిళ్లలోని నీళ్లతో మంటలు అదుపుచేశారు. తరువాత వేరే కారులో తమ స్వస్థలానికి చేరుకున్నారు. ఎవరికీ ఏ అపాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో వ్యాపించిన మంటలు వెంటనే దిగి తప్పించుకున్న భక్తులు -
తెల్ల బంగారానికి నల్లరోజులు
అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం పత్తి పంటకు నష్టం కలిగించే తెగుళ్లు ఉన్నట్టుగా భావిస్తున్నాం. అయితే నష్టం దేనివల్ల జరుగుతోంది, ఎలా జరుగుతోందనే విషయాలు నిర్ధారించడానికి శాస్త్రవేత్తలను పిలిచాం. వారు వచ్చి పంటలు పరిశీలించి నిర్ధారిస్తారు. ఈలోపు రైతులు తొందరపడి పంటను నరికేసుకోవద్దు. కొందరు రైతులు తొందరపడుతున్నారు. నష్టం జరిగినప్పుడు వివరాలు తెలుసుకోకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇప్పటి నుంచీ జాగ్రత్తలు పాటించడం వల్ల కొంతవరకూ నష్టం నివారించుకోవచ్చు. అందుకే ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించడానికి ఏరువాక శాస్త్రవేత్తల ద్వారా సదస్సుల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ప్రస్తుతం నష్టం వాటిల్లుతున్న పంటకు వ్యవసాయ శాఖ సూచనల ప్రకారం సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. – స్వాతి, అసిస్టెంట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ, పిఠాపురం పిఠాపురం: ఇటీవల వచ్చిన వరదల నుంచి తేరుకుంటున్న పత్తి రైతును తెగుళ్లు, నాసిరకం విత్తనాలు నట్టేట ముంచాయి. పండిన పంట పనికి రాకుండా పోతూండటంతో చేసేదేమీ లేక ఆరుగాలం పండించిన పంటను రైతులు తమ చేతులతో తామే నరికేస్తున్నారు. కాయ కాసినా పత్తి వచ్చే సమయానికి అది పగలకపోవడంతో దిగుబడి లేక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాంగ్ఫుల్ కాటన్, మీడియం స్టేఫుల్ కాటన్, పొట్టి స్టేఫుల్ కాటన్ అనే మూడు పత్తి రకాలను ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలో సుమారు 400 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా 200 ఎకరాల్లో పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతు చిక్కని తెగుళ్లు, నాసిరకం విత్తనాల వల్లే ఇలా జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. అధికారుల ద్వారా వచ్చిన విత్తనాల్లో నాసిరకం ఉండవచ్చని రైతులు అంటున్నారు. అయితే, వారి ఆరోపణలను అధికారులు కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి జిల్లాలో పత్తి పంటకు ప్రమాదం పొంచి ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలి డబ్బు కూడా రాని దుస్థితి జిల్లాలోని గొల్లప్రోలు, జగ్గంపేట, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరంతో పాటు తూర్పు గోదావరి జిల్లా రంగంపేట తదితర మండలాల్లో సుమారు 11,850 ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోంది. పత్తి పంటకు సాధారణంగా కాయ తొలుచు పురుగు సోకడం, దాని నివారణకు మందులు పిచికారీ చేయడం జరిగేది. కొన్నేళ్ల క్రితం వరకూ గులాబీ రంగు కాయ తొలుచు పురుగు (పింక్‌బాల్ వార్మ్) పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగించేది. వివిధ రకాల మందులు పిచికారీ చేయడం ద్వారా దీనిని పూర్తిగా నివారించగలిగారు. అప్పటి నుంచీ దాని ప్రభావం తగ్గి రైతులకు దిగుబడి ఆశాజనకంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జిల్లాలో గొల్లప్రోలు మండలంలో పత్తి పంట కాయ కాసినా అది పగిలి పత్తి రావాల్సి ఉండగా అలా జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి కోసే కూలీకి రోజుకు రూ.500 ఇవ్వాల్సి ఉండగా ఒక్కో కూలీ రోజుకు 10 నుంచి 20 కేజీల వరకూ పత్తి కోస్తూంటారు. కానీ ప్రస్తుతం కాయ పగిలి పత్తి రాకపోగా కోసేటప్పుడు కాయ నుంచి పత్తితో పాటు కాయ కూడా వస్తూండటం, పత్తి తక్కువగా రావడంతో ఒక్కో కూలీ రోజుకు రెండు కేజీలు కూడా కోయలేకపోతున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో రూ.500 కూలీకి ఖర్చు చేస్తే రూ.110 విలువైన పత్తి మాత్రమే వస్తోందని, దీంతో కోయడం ఆపేసి పత్తి పంటను నరికేస్తున్నామని రైతులు చెబుతున్నారు. భారీ నష్టమే ఎకరానికి రూ.40 వేలు పెట్టుబడి పెట్టగా రూ.30 వేలు కౌలు ఇస్తున్నామని, ఇతర ఖర్చులు కలిపి ఎకరానికి రూ.80 వేల వరకూ పెట్టుబడి అవుతోందని, ప్రస్తుతం రూ.8 వేలు కూడా రాని పరిస్థితి ఎదురైందని రైతులు వాపోతున్నారు. ఒక్క గొల్లప్రోలు మండలంలోనే సుమారు 200 ఎకరాల వరకూ పత్తి పంట నష్టాల పాలవ్వడంతో రూ.1.60 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. పంట నరికించేస్తున్నాను నేను ఒక ఎకరంలో పత్తి సాగు చేశాను. విత్తనాలు వేసే నాటి నుంచి చాలా జాగ్రత్తలు పాటించాను. కానీ పంట చేతికి వచ్చే సమయానికి అంతా మాయగా మారిపోయింది. పత్తి చేనులో కాయలు కనిపిస్తున్నాయి. కాని అవి పగలడం లేదు. పత్తి రావడం లేదు. ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదు. విత్తనాల్లో తేడాలనుకుంటున్నాం. దీనికి తోడు పంటపై తెగుళ్లు ప్రభావం చూపించి ఉండవచ్చు. ఎకరానికి రూ.80 వేల పెట్టుబడి పోయింది. చేసేదేమీ లేక ఉన్న పంటను కూలీలను పెట్టి నరికించాల్సి వచ్చింది. విత్తనాలపై అధికారులు విచారణ చేయాలి. తెగుళ్లను నిర్ధారించాలి. ఏం చేసినా ఈ పంట మాకు లేనట్టే. ప్రభుత్వం ఆదుకోవాలి. – వెలుగుల సత్యనారాయణ, పత్తి రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలి నేను రెండు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. పత్తి కాయలు పేలకపోవడంతో పంటను నరికేస్తున్నా. ఈ పంట పోయినట్టే. రెండో పంట కోసం భూమిని సిద్ధం చేసుకోడానికి ఉన్న పత్తి పంటను నరికేస్తున్నాం. పెట్టుబడి రాకపోగా పంటను నరికించేందుకు తిరిగి పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. చేసేదేమీ లేక పండించిన పంటను మా చేతులతో మేమే నరుక్కుంటున్నాం. ఇకపై పత్తి సాగు చేయాలంటే భయం వేస్తోంది. మాకు జరిగిన నష్టంపై అధికారులు విచారణ జరపాలి. కారణం ఏమిటో తెలుసుకోవాలి. మాకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలి. – మేడిబోయిన శివ, పత్తి రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం రైతుకు వి‘పత్తి’ పత్తి పంటను తెగనరుకుతున్న వైనం దిగుబడి దెబ్బతీస్తున్న తెగుళ్లు కాయ పగలక పత్తి రాని పరిస్థితి రైతును నట్టేట ముంచిన నాసిరకం విత్తనాలుజిల్లాలో పరిస్థితి ఇలా.. సాగు 11,850 ఎకరాల్లో రైతులు 8,890 మంది ఏటా దిగుబడి 2,13,300 క్వింటాళ్లు -
పిండినల్లి వల్లే పంటకు నష్టం
ప్రిన్సిపల్ సైంటిస్ట్ సుధారాణి పిఠాపురం: పిండినల్లి ఆశించడం వల్లే పత్తి పంటకు నష్టం వాటిల్లుతోందని, రైతులు జాగ్రత్తలు పాటించి నష్టాలు నివారించుకోవచ్చని ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎస్.సుధారాణి సూచించారు. మంగళవారం గొల్లప్రోలు మండలం దుర్గాడ రైతు సేవ కేంద్రంలో పెద్దాపురం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శర్మ, పిఠాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు పి.స్వాతి తదితరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పలు సూచనలు ఇచ్చారు. దుర్గాడలో వేసిన పత్తి పంటకు పిండి నల్లి ఆశించిందని, దీని నివారణకు ఎసిఫేట్ రెండు గ్రాములు ఒక లీటరు నీటిలో గాని, ట్రోఫీకోనజోల్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని సర్ఫ్ గాని టీ పాలు గాని స్ప్రేయర్ కి 50 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పంట నుంచి తీసిన పత్తిని దుకాణదారులు రూ.50 నుంచి రూ.55కు మాత్రమే కొంటున్నందున నష్టపోతున్నారని, వ్యవసాయ మార్కెట్ కమిటీ పిఠాపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో రూ.71 నుంచి రూ.75 వరకు విక్రయించవచ్చునని, దీనిపై రైతులు అవగాహన పెంచుకోవాలని వారు వివరించారు. పెద్దాపురం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శర్మ మాట్లాడుతూ మినుములు, నువ్వు పంటపై చేయవలసిన సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, రైతులు, ఎంఏఓ కేవీవీ సత్యనారాయణ, రైతు సేవా కేంద్రం సిబ్బంది కె.పద్మిని, ఎస్.దుర్గా దేవి తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న అక్రమ అరెస్టులు
తుని/తుని రూరల్: ప్రభుత్వ విధి విధానాలకు, టీడీపీ, జనసేన, బీజేపీలకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీకి లబ్ధి చేకూర్చేందుకు నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి ప్రేరేపించేలా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన 17 మందిని అరెస్టు చేసినట్టు రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు తెలిపారు. తుని రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం పట్టణ సీఐ గీతారామకృష్ణ, రూరల్ ఎస్సై బి.కృష్ణామాచారితో కలసి రూరల్ సీఐ విలేకరులతో మాట్లాడారు. అరైస్టెన వారిలో తుని పట్టణ, తుని, కోటనందూరు, తొండంగి మండలాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్టు సీఐ తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు సమాచారాన్ని బదిలీ చేసినా శిక్షార్హులన్నారు. రెండుసార్లు కేసులు నమోదైన తర్వాత ఇటువంటి తప్పిదానికి మూడోసారి (ఆర్గనైజ్డ్ క్రైం) పాల్పడితే నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో ఐదు నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందన్నారు. కక్ష సాధింపులు లేవని, ఏ పార్టీవారు ఆధారాలు ఇచ్చినా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు. అరైస్టెన వారు వైఎస్సార్ సీపీ యువజన విభాగం తుని నియోజకవర్గ అధ్యక్షుడు, తుని కౌన్సిల్లో కో–ఆప్షన్ సభ్యుడు ఏలూరి బాలు, 14వ వార్డు కౌన్సిలర్, పట్టణ యూత్ కన్వీనర్ షేక్ ఖ్వాజా మోహిద్దీన్, తొండంగి మండలం వైస్ ఎంపీపీ నాగం గంగాధరరావు, వైఎస్సార్ సీపీ కోటనందూరు మండల కన్వీనర్ చింతకాయల సన్యాసి రాజా విశ్వనాథ్ (చినబాబు), వెలుగొండి జార్జి కిరణ్ (జార్జిరెడ్డి), ఇసరపు సాయి, మొగసాల నాగ రామశ్రీను, దిబ్బ శ్రీను, పెంటకోట వెంకట రామలింగ సురేష్, కోరుమల్లి లలిత, అడపా సురేష్, గణేసుల వీర వెంకటరమణ (వీరబాబు), బంగారు బ్రహ్మనాయుడు, యలమంచిలి మణికంఠ, కాకినాడ గణేష్ (నాని), చింతంనీడి గణేష్, కుర్మయ్యగారి హనుమంత్ రెడ్డి (అన్నమయ్య జిల్లా) అరెస్టయ్యారు. 15 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చామని, ఏలూరి బాలు, షేక్ ఖ్వాజాలను కోర్టులో హాజరుపర్చామన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల అరెస్టు 17 మందిలో వైస్ ఎంపీపీ, ఇద్దరు కౌన్సిలర్లు -
సీబీఐ పేరుతో ఫేక్ కాల్స్
ఆందోళన చెందుతున్న స్థానికులు అమలాపురం టౌన్: పిల్లలు దూర ప్రాంతాల్లో ఉంటున్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం.. అని హిందీలో మాట్లాడుతూ, అవతలి వారు మానసికంగా లొంగిపోయారని నిర్థారించుకున్న తరువాత డబ్బులు డిమాండ్ చేస్తూ సీబీఐ పేరుతో వస్తున్న ఫోన్‌కాల్స్ స్థానికంగా పలువురిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటువంటి కాల్స్ రిసీవ్ చేసుకున్న వారు బెంబేలెత్తిపోయి దూర ప్రాంతాల్లో ఉన్న తమ పిల్లలకు సమాచారం ఇస్తున్నారు. ఇంకొందరు తమకు పరిచయమున్న పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారు. ఫేక్ కాల్స్ మాట్లాడుతున్న సమయంలో ఎవరో మగ లేదా ఆడగొంతుతో ఆర్తనాదాలు వినిపిస్తుండడంతో ఇటువైపు మాట్లాడుతున్న వారు హడలిపోతున్నారు. స్థానికుడైన ఓ వ్యక్తికి మంగళవారం దాదాపు పది కాల్స్ రాగా ఫోన్లో అవతలి వ్యక్తి ఓ పేరు చెప్పి మీకేమవుతుందని అడగడం.. మా అన్న కూతురని ఇటునుంచి బదులు ఇవ్వడం.. వెంటనే అరెస్టు అంటూ పదేపదే చెప్పడంతో స్థానికుడు బెదిరిపోయారు. ఇలాగే పలువురికి ఫేక్ కాల్స్ వస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై పట్టణ సీఐ పి.వీరబాబుకు వివరించగా అవి ఫేక్ కాల్స్ అని, అటువంటి నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించారు. సీబీఐ అధికారులు అరెస్టుకు వస్తే స్థానిక పోలీసుల సహకారంతో వస్తారని, ఇటువంటి బెదిరింపులకు పాల్పడరని ఆయన వివరించారు. -
75 కిలోల బస్తాకు
రూ.2 వేల మద్దతు ధర ఇవ్వాలి సొంతంగా అర ఎకరం సాగు చేశాను. మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఖరీఫ్ ప్రారంభంలో సకాలంలో వర్షాలు పడక సాగు ఆలస్యమైంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలు, తర్వాత ప్రతికూల పరిస్థితుల వల్ల పెట్టుబడులు ఎక్కువ అయ్యాయి. ఖరీఫ్‌లో కూలి రేట్లు, వరి కోత యంత్రం రేట్లు పెంచేయడంతో పెట్టుబడులు తడిసిమోపెడయ్యాయి. వరి కోతలు ముందు వరకు ఎకరాకు రూ.30 వేలు ఖర్చుపెట్టగా, కోత, కట్టేత, నూర్పిడికి మరో రూ.10 వేలు అయ్యాయి. 75 కిలోల బస్తా ప్రస్తుతం రూ.1,650కు కొంటున్నారు. ఎకరాకు 35 బస్తాలకు మించి దిగుబడులు రావడం లేదు. పెరిగిన ఎరువులు, పురుగుమందులు, కూలిరేట్లను బట్టి 75 కిలోల బస్తాకు రూ.2 వేల మద్దతు ధర ఉంటే గట్టెక్కేవాళ్లం. ఇప్పుడైతే అప్పులే మిగులుతున్నాయి. – మారెళ్ల వెంకటరమణ, కౌలురైతు, యండమూరు, కరప మండలం