Money Mantra
-
ఒక్కరోజులోనే రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరి!
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 368 పాయింట్లు తగ్గి 25,810 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1272 పాయింట్లు దిగజారి 84,299 వద్ద ముగిసింది. ఈరోజు స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరైనట్లు మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.మదుపర్లు లాభాలు స్వీకరించడం, అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే జీవితకాల గరిష్ఠాలను చేరిన మార్కెట్లలో ఇన్వెస్టర్లు ఉదయ నుంచే లాభాలు స్వీకరించినట్లు తెలిసింది. రానున్న యూఎస్ ఎన్నికలు, ఎఫ్ఐఐలు చైనావైపు మొగ్గు చూపుతుండడం వంటి అంశాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేసినట్లు నిపుణులు చెప్పారు.ఇదీ చదవండి: ఎట్టకేలకు రెండేళ్ల వివాదానికి పరిష్కారం!సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి సుజుకీ, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్లు.. ఊపు మీదున్న ఐటీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:15 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 78.99 పాయింట్లు లేదా 0.092% లాభపడి 85,915.11 వద్ద ట్రేడవుతోంది. అలాగే నిఫ్టీ 9.40 పాయింట్లు లేదా 0.036% పెరిగి 26,225.45కు చేరింది.నిఫ్టీ లిస్టింగ్‌లో ఎల్టీఐ మైండ్‌ట్రీ, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా షేర్లు టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్, భారతీ ఎయిర్టెల్, ఓన్ఎన్జీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటివి ప్రతికూలంగా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గరిష్ఠాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 09:15 సమయానికి నిఫ్టీ 8 పాయింట్లు పెరిగి 26,012కు చేరింది. సెన్సెక్స్ 42 పాయింట్లు లాభపడి 85,202 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.90 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.79 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.19 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.04 శాతం లాభపడింది.ఇదీ చదవండి: వేగంగా వృద్ధి చెందుతున్న రంగంఫెడ్ కీలక వడ్డీరేట్లను కట్ చేస్తున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లు గరిష్ఠాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నవారిలో దాదాపు 93 శాతం మంది నష్టాల్లోనే ఉంటున్నట్లు పలు సంస్థల సర్వేలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఈ ట్రేడింగ్ చేస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలని, కొత్తగా ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నవారు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎంచుకోకపోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకున్న మార్కెట్లు.. కొత్త గరిష్టాలకు సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం పుంజుకున్నాయి. బెంచ్‌మార్క్ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 ప్రారంభ నష్టాలను తిప్పికొట్టాయి. ట్రేడింగ్ సెషన్‌ను రికార్డ్ హై ముగింపు స్థాయిలలో ముగించే ముందు కొత్త గరిష్టాలను తాకాయి.సెన్సెక్స్ 255.83 పాయింట్లు లేదా 0.30 శాతం పుంజుకుని 85,169.87 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇండెక్స్ రికార్డు గరిష్ట స్థాయి 85,247.42కి చేరుకుంది. అలాగే నిఫ్టీ కూడా 63.75 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 26,004.15 వద్ద సెషన్‌ను ముగించే ముందు 26,032.80 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది.నిఫ్టీ లిస్టింగ్‌లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, గ్రాసిమ్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఎల్‌టీఐమైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా మోటర్స్, టైటాన్ టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిన్నటి ముగింపు వద్దే ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ 8 పాయింట్లు పెరిగి 25,947కు చేరింది. సెన్సెక్స్ 26 పాయింట్లు లాభపడి 84,927 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.49 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.74 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.25 శాతం, నాస్డాక్ 0.56 శాతం లాభపడ్డాయి.ఇదీ చదవండి: రూ.8,357 కోట్లతో అసెంబ్లింగ్ యూనిట్!ఫెడ్ కీలక వడ్డీరేట్లను కట్ చేస్తున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లు గరిష్ఠాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నవారిలో దాదాపు 93 శాతం మంది నష్టాల్లోనే ఉంటున్నట్లు పలు సంస్థల సర్వేలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఈ ట్రేడింగ్ చేస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలని, కొత్తగా ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నవారు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎంచుకోకపోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 09:20 సమయానికి నిఫ్టీ 13 పాయింట్లు తగ్గి 25,924కు చేరింది. సెన్సెక్స్ 83 పాయింట్లు నష్టపోయి 84,831 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.72 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.75 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్పల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.28 శాతం, నాస్డాక్ 0.14 శాతం లాభపడ్డాయి.సోమవారంతో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. సెన్సెక్స్ 85,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాళ్లకు చేరువయ్యాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత బాట పట్టడం సెంటిమెంట్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అమెరికా ఆగస్టు నెల తయారీ, కన్జూమర్ కాన్ఫిడెన్స్ డేటా మంగళవారం విడుదల కానుంది. బ్యాంకు ఆఫ్ జపాన్ ద్రవ్య కమిటీ సమావేశ వివరాలు(మినిట్స్), అమెరికా క్యూ2 జీడీపీ వృద్ధి డేటా గురువారం వెల్లడి కానుంది. సెప్టెంబర్ 13తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 20తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వల డేటాను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేస్తుంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగలవు.ఇదీ చదవండి: ఏటా రూ.మూడు లక్షల కోట్లు అవసరం(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10:11 సమయానికి నిఫ్టీ 117 పాయింట్లు పెరిగి 25,907కు చేరింది. సెన్సెక్స్ 273 పాయింట్లు లాభపడి 84,817 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.72 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.74 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్పల్ప నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.19 శాతం, నాస్డాక్ 0.36 శాతం నష్టపోయాయి.ఇదీ చదవండి: కస్టమర్లకు సకల సౌకర్యాలు!ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు, దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా ఈ సెప్టెంబర్‌లో ఇప్పటి వరకు (1– 21 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు రూ.33,700 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈ గురువారం (22న) నిఫ్టీ సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.రెండు ఐపీఓలు, మూడు లిస్టింగులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన మన్బా ఫైనాన్స్ రూ.151 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. సెప్టెంబర్ 23న ప్రారంభమై 25న ముగుస్తుంది. కేఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ ఇష్యూ 25–27 తేదీల మధ్య ఉంటుంది. తద్వారా రూ.342 కోట్లు సమీకరించనుంది. ఎస్ఎంఈ విభాగంలో కంపెనీలతో కలిసి మొత్తం 11 సంస్థలు మార్కెట్ నుంచి రూ.900 కోట్లను సమీకరించనున్నాయి. అలాగే ఇటీవల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న వెస్ట్రన్ క్యారియర్స్ ఇండియా, ఆర్కేడ్ డెవలపర్స్, నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ షేర్లు ఒకేరోజున మంగళవారం (24న) స్టాక్ లిస్ట్ కానున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 25,471కు చేరింది. సెన్సెక్స్ 179 పాయింట్లు లాభపడి 83,378 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.69 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.72 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.7 శాతం, నాస్డాక్ 2.51 శాతం లాభపడ్డాయి.ఫెడ్ వడ్డీ తగ్గింపుతో భారత్‌కు మరిన్ని విదేశీ పెట్టుబడులు తరలిరానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మార్గంలోనూ విదేశీ నిధులు పెరగనున్నట్లు చెబుతున్నారు. ఇది దేశీ కరెన్సీ రూపాయికి బలాన్నిస్తుందని తెలియజేస్తున్నారు. ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లను తగ్గించేందుకు వీలు చిక్కుతుందని అభిప్రాయపడుతున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 6.5 శాతంవద్దే కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కఠిన పరపతి విధానాలను అవలంబిస్తోంది. వచ్చే నెల(అక్టోబర్) 7–9 మధ్య ఆర్బీఐ పాలసీ సమీక్షను చేపట్టనుంది.ఇదీ చదవండి: టెలికాం కంపెనీల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్ రేట్ కట్.. కొత్త గరిష్ఠాలను తాకిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం జీవితకాల గరిష్ఠాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 25,543కు చేరింది. సెన్సెక్స్ 577 పాయింట్లు లాభపడి 83,523 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.37 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.73 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.29 శాతం, నాస్డాక్ 0.31 శాతం నష్టపోయాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నాలుగేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. అత్యధిక శాతం విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా వడ్డీ రేటులో ఏకంగా 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఇప్పటివరకూ 5.25–5.5 శాతంగా అమలవుతున్నాయి. ఆగస్టులో వ్యవసాయేతర ఉద్యోగాలు అంచనాలకంటే తక్కువగా 1,42,000కు పరిమితంకాగా.. రిటైల్ ధరలు 0.3 శాతం బలపడి 3.2 శాతాన్ని తాకాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు అందినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణం విషయంలో అనిశ్చితి నెలకొన్నందున ఆర్బీఐ ఈ ఏడాది వడ్డీ రేట్ల కోతను చేపట్టకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ చూపు ఫెడ్ వైపు.. నిఫ్టీ@25,377
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 41 పాయింట్లు తగ్గి 25,377 వద్దకు చేరింది. సెన్సెక్స్ 131 పాయింట్లు దిగజారి 82,948 వద్ద ముగిసింది. ఈరోజు రాత్రి ఫెడ్ సమావేశంలోని ముఖ్యాంశాలు విడుదలవ్వనున్నాయి. దాంతో గరిష్ఠాల వద్ద మదుపర్లు కొంత లాభాలు స్వీకరించినట్లు తెలుస్తుంది.సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.ఇదీ చదవండి: ఎనిమిది నెలల్లో 3.5 కోట్ల దరఖాస్తులుటీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, మారుతీసుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్ నిర్ణయాలపై దృష్టి.. స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 19 పాయింట్లు తగ్గి 25,398కు చేరింది. సెన్సెక్స్ 92 పాయింట్లు నష్టపోయి 82,995 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.93 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.63 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.03 శాతం, నాస్డాక్ 0.2 శాతం లాభపడ్డాయి.ఇదీ చదవండి: విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దుకీలకంగా మారనున్న ఫెడ్ నిర్ణయాలువడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలపైనే భారత్‌తో సహా అంతర్జాతీయ మార్కెట్ల చూపు కేంద్రీకృతమై ఉంది. వడ్డీరేట్లను 25 లేదా 50 బేసిస్ పాయింట్లు మేర ఫెడ్ తగ్గించవచ్చనేది ఆర్థికవేత్తల అంచనా. అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు సెప్టెంబర్ 17న మొదలయ్యాయి. భారత కాలమాన ప్రకారం బుధవారం(18న) రాత్రి ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య విధాన నిర్ణయాలు వెల్లడించనున్నారు. రెండురోజుల ఫెడ్ పాలసీ సమావేశంలో ద్రవ్య కమిటీ తీసుకొనే నిర్ణయాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక విధాన నిర్ణయం బుధవారం ప్రకటించనున్న నేపథ్యంలో మదుపరులు డేటా విడుదల ఎదురుచూస్తున్నారు. సెషన్ ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెనెసెక్స్ 20 పాయింట్లు లేదా 0.02 శాతం క్షీణించి 82,968 వద్ద, నిఫ్టీ 50 0.01 శాతం క్షీణించి 25,382 వద్ద ఉన్నాయి.సోమవారం నాటి సెషన్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ.1,634.98 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.754.09 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.మంగళవారం చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.18 శాతం పెరిగి 72.89 డాలర్లకు చేరుకోగా, యుఎస్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.43 శాతం పెరిగి 70.40 డాలర్లకు చేరుకుంది. స్పాట్ గోల్డ్ ధర 0.06 శాతం తగ్గి ఔన్స్‌కు 2,580.51 డాలర్లకు చేరుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నాటి సెషన్‌ను సానుకూలంగా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 97.84 పాయింట్లు లేదా 0.12 శాతం పెరిగి 82,988.78 వద్ద ముగియగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 27.25 పాయింట్లు లేదా 0.11 శాతం పెరిగి 25,383.75 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో ఈ ఇండెక్స్ ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 25,445.70 స్థాయిలను తాకింది.ఎన్టీపీసీ, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్ & టూబ్రో నేతృత్వంలోని లాభాలతో నిఫ్టీ50లోని 26 స్టాక్స్ లాభాలతో ముగిశాయి. అదే సమయంలో బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, బ్రిటానియా ఇండస్ట్రీస్ నష్టాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి.బీఎస్ఈ స్పేస్ నుంచి సెన్సెక్స్‌లోని 15 భాగస్వామ్య స్టాక్‌లు దిగువన ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ పోర్ట్స్, టైటాన్ కంపెనీ 3.36 శాతం వరకు పతనమయ్యాయి. ఇదిలా ఉండగా ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, లార్సెన్ & టూబ్రో, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ 2.44 శాతం వరకు లాభపడిన టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@25,388
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 25,388కు చేరింది. సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి 83,002 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.11 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.06 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.66 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.54 శాతం, నాస్డాక్ 0.65 శాతం లాభపడ్డాయి.క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ పాలసీ కమిటీ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడికి ముందు సూచీలు పరిమిత శ్రేణిలో ట్రేడవ్వొచ్చని అంటున్నారు. వివిధ రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 25,000 వద్ద తక్షణ మద్దతు ఉంది. కొనుగోళ్లు నెలకొంటే ఎగువున 25,500 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధిస్తే 26,000 వద్ద మరో నిరోధం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటు(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గరిష్ఠాల వద్ద అమ్మకాల వెల్లువ.. నిఫ్టీ@25,356
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 25,356 వద్దకు చేరింది. సెన్సెక్స్ 71 పాయింట్లు దిగజారి 82,890 వద్ద ముగిసింది. నిన్నటి మార్కెట్ సెషన్లో సూచీలు జీవితకాల గరిష్ఠాలను తాకాయి. మదుపర్లు ఈరోజు గరిష్ఠాల వద్ద అమ్మకాలవైపు మొగ్గు చూపారు.సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నెస్లే, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.ఇదీ చదవండి: అన్నీ అవాస్తవాలేఅదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఐటీసీ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, పవర్‌గ్రిడ్, ఎల్ అండ్ టీ, హెచ్‌యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
25,000 మార్కు వద్ద నిఫ్టీ.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 25,022కు చేరింది. సెన్సెక్స్ 322 పాయింట్లు లాభపడి 81,857 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.72 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 70.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.65 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.07 శాతం, నాస్డాక్ 2.2 శాతం లాభపడ్డాయి.ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆగస్టులోనూ తమ జోరు చూపించాయి. నికరంగా రూ.38,239 కోట్లను ఆకర్షించాయి. ఈ ఏడాది జులైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చిన రూ.37,113 కోట్లతో పోల్చి చూస్తే 3.3 శాతం మేర ఆగస్ట్‌లో వృద్ధి నమోదైంది. థీమ్యాటిక్ ఫండ్స్ (రంగాలు/ప్రత్యేక థీమ్‌లలో ఇన్వెస్ట్ చేసేవి) పథకాల్లోకి అత్యధికంగా రూ.18,117 కోట్లు వచ్చాయి. ఈ తరహా పథకాలు జులైలో రూ.18,336 కోట్లు, జూన్‌లో రూ.22,352 కోట్ల చొప్పున ఆకర్షించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల ముగింపు.. బ్యాంక్, ఆటో రంగాలు పతనం
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం స్పల్ప నష్టాలతో ప్రారంభమైన బెంచ్‌మార్క్ సూచీలు సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. అంతర్జాతీయంగా బలహీనమైన సెంటిమెంట్‌తో అన్ని రంగాలలో అమ్మకాలు జరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 398.13 పాయింట్లు లేదా 0.49 శాతం క్షీణించి 81,523.16 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 122.65 పాయింట్లు లేదా 0.49 శాతం పడిపోయి 24,918.45 వద్ద ముగిసింది.నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 34 నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, ఓన్జీసీ, విప్రో, ఎల్&టీ, అదానీ ఎంటర్ప్రైజెస్ 5.73 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. అదే సమయంలో, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇండెక్స్‌లోని ఇతర స్టాక్‌లలో 4.03 శాతం వరకు లాభాలను ఆర్జించాయి.ఇదీ చదవండి: నేడు బంగారం కొనబోతే..అదేవిధంగా బీఎస్ఈలో సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ స్టాక్‌లలో 20 రెడ్‌లో ముగిశాయి. టాటా మోటార్స్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ 5.77 శాతం వరకు పతనమయ్యాయి. అదే సమయంలో ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హిందుస్తాన్ యూనిలీవర్ 2.18 శాతం వరకు లాభాలతో ముగిసిన 10 స్టాక్‌లలో ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ 28 పాయింట్లు తగ్గి 25,002కు చేరింది. సెన్సెక్స్ 101 పాయింట్లు నష్టపోయి 81,834 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.64 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 69.6 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.67 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.45 శాతం, నాస్డాక్ 0.84 శాతం లాభపడ్డాయి.దేశీయ ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణ, జులై పారిశ్రామికోత్పత్తి డేటా గురువారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రొడ్యూసర్ ప్రెస్ ఇండెక్స్(పీపీఐ) సెప్టెంబర్ 14న వెల్లడి కానున్నాయి. అమెరికాలో ఉపాధి కల్పన తగ్గినట్లు డేటా వెలువడంతో ఫెడ్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మే వడ్డీరేట్లను తగ్గించే అంచనాలు పెరిగాయి. ఇదే సమయంలో ఆర్థిక మాంద్య భయాలు తెరపైకి వచ్చాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్ తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 తర్వాత మెరుగుపడి లాభాల్లో సెషన్‌ను ముగించాయి. ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 375.61 పాయింట్లు లేదా 0.46 శాతం పెరిగి 81,559.54 వద్ద, నిఫ్టీ 50 84.25 పాయింట్లు లేదా 0.34 శాతం లాభపడి 24,936 వద్ద స్థిరపడ్డాయి.నిఫ్టీ లిస్టింగ్‌లో హిందూస్థాన్ యూనిలివర్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, బ్రిటానియా టాప్ గెయినర్స్‌గా లాభాలు అందుకున్నాయి. మరోవైపు ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, హిందాల్కో, ఎన్టీపీసీ, బీపీసీఎల్ టాప్ లూజర్స్‌గా నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 48 పాయింట్లు తగ్గి 24,807కు చేరింది. సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 81,012 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.17 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.72 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.7 శాతం, నాస్డాక్ 2.55 శాతం నష్టపోయాయి.అమెరికా ఆగస్టు ద్రవ్యల్బోణ గణాంకాలు సెప్టెంబర్ 11న, దేశీయ ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణ, జులై పారిశ్రామికోత్పత్తి డేటా గురువారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రొడ్యూసర్ ప్రెస్ ఇండెక్స్(పీపీఐ) సెప్టెంబర్ 14న వెల్లడి కానున్నాయి. అమెరికాలో ఉపాధి కల్పన తగ్గినట్లు డేటా వెలువడంతో ఫెడ్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీరేట్లను తగ్గించే అంచనాలు పెరిగాయి. ఇదే సమయంలో ఆర్థిక మాంద్య భయాలు తెరపైకి వచ్చాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్ తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్లు భారీ పతనం
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుల స్థాయి, వేగాన్ని ప్రభావితం చేసే కీలకమైన యూఎస్ జాబ్స్ రిపోర్ట్ విడుదల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు, సెన్సెక్స్, నిఫ్టీలు రెడ్‌లోకి పడిపోయాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 1,017.23 పాయింట్లు లేదా 1.24% శాతం నష్టపోయి 81,183.93 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 292.95 పాయింట్లు లేదా 1.17% పడిపోయి 24,852.15 వద్ద స్థిరపడింది.ఆర్థిక రంగ షేర్లు ఎక్కువగా నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ లిస్టింగ్‌లో ఎస్బీఐ, బీపీపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, దివిస్ ల్యాబ్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ టాప్ గెయినర్స్‌గా లాభాలను ఆర్జించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 25,148కు చేరింది. సెన్సెక్స్ 18 పాయింట్లు తగ్గి 82,146 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.05 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.68 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.73 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.3 శాతం, నాస్డాక్ 0.25 శాతం నష్టపోయాయి.అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్ 17-18 జరగనుంది. ఈరోజు రాత్రి యూఎస్ జాబ్స్ డేటా విడుదల కానుంది. ఒకవేళ అంచనాలకంటే ఎక్కువ ఉద్యోగాలు నమోదైతే రానున్న ఫెడ్ సమావేశంలో వడ్డీరేట్ల మార్పులో నిర్ణయాలుంటాయని భావిస్తున్నారు. అట్లాంటా ఫెడ్ అధ్యక్షుడు బోస్టిక్ తాజాగా వడ్డీరేట్లకు సంబంధించి ప్రస్తావించారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి వస్తేనే కీలక వడ్డీరేట్లను తగ్గిస్తామనే ధోరణి సరికాదన్నారు. గడిచిన సెషన్లో ఎఫ్ఐఐలు రూ.688.69 కోట్లు విలువైన షేర్లు అమ్మగా, డీఐఐలు రూ.2970.74 కోట్ల విలువగల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాలతో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 25,243కు చేరింది. సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 82,495 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.27 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.39 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.75 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం, నాస్డాక్ 0.3 శాతం నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు పెద్దగా పెరిగే అవకాశాలు కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్ 17-18 జరగనుంది. అట్లాంటా ఫెడ్ అధ్యక్షుడు బోస్టిక్ తాజాగా వడ్డీరేట్లకు సంబంధించి ప్రస్తావించారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి వస్తేనే కీలక వడ్డీరేట్లను తగ్గిస్తామనే ధోరణి సరికాదన్నారు. గడిచిన సెషన్లో ఎఫ్ఐఐలు రూ.975.46 కోట్లు, డీఐఐలు రూ.97.35 కోట్ల విలువగల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ 177 పాయింట్లు తగ్గి 25,102కు చేరింది. సెన్సెక్స్ 537 పాయింట్లు నష్టపోయి 82,011 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.8 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.82 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 2.12 శాతం, నాస్డాక్ 3.26 శాతం నష్టపోయాయి.అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్ 17-18 జరగనుంది. ఈ నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్లను ప్రభావితం చేసే యూఎస్ తయారీ రంగ, నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఈరోజు మార్కెట్ ప్రారంభం నుంచి ఐటీ స్టాక్స్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టాల్లో ఉన్నా కొంత నిలకడగానే ట్రేడవుతున్నాయి. ఫార్మా స్టాక్స్ కొంత లాభాల్లోకి చేరుకున్నాయి. స్టీల్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 6 పాయింట్లు తగ్గి 25,272కు చేరింది. సెన్సెక్స్ 18 పాయింట్లు నష్టపోయి 82,556 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.67 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.92 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.01 శాతం, నాస్డాక్ 1.1 శాతం లాభపడ్డాయి.అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్ 17-18 జరగునుంది. ఈ నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్లను ప్రభావితం చేసే యూఎస్ తయారీ రంగ, నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 25,500 స్థాయిని పరీక్షించవచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 25,000 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,900 వద్ద మరో మద్దతు ఉందని నిపుణులు సూచిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)