Money Mantra
-
గరిష్ఠాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@25,278
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం జీవితకాల గరిష్ఠాల్లో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 25,278 వద్దకు చేరింది. సెన్సెక్స్ 194 పాయింట్లు ఎగబాకి 82,559 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, టెక్ మహీంద్రా, టైటాన్, హెచ్‌యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎం, భారతి ఎయిర్టెల్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా, కొటక్ మహీంద్రా బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 25,304కు చేరింది. సెన్సెక్స్ 206 పాయింట్లు లాభపడి 82,567 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.35 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.91 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.01 శాతం, నాస్డాక్ 1.1 శాతం లాభపడ్డాయి.అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్ 17-18 జరగునుంది. ఈ నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్లను ప్రభావితం చేసే యూఎస్ తయారీ రంగ, నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 25,500 స్థాయిని పరీక్షించవచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 25,000 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,900 వద్ద మరో మద్దతు ఉందని నిపుణులు సూచిస్తున్నారు.దేశీయ ఆటో కంపెనీల ఆగస్టు వాహన విక్రయ గణాంకాలు వెల్లడయ్యాయి. దాంతో ఆటో రంగ షేర్లలో కదలికలు ఉండవచ్చు. సోమవారం భారత్‌తో పాటు చైనా, యూరోజోన్‌ల ఆగస్టు తయారీ రంగ పీఎంఐ డేటాను విడుదల కానుంది. అమెరికా ఆగస్టు తయారీ రంగ, వాహన విక్రయ డేటా మంగళవారం రానుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గరిష్ఠాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@25,235
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం జీవితకాల గరిష్ఠాల్లో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 25,235 వద్దకు చేరింది. సెన్సెక్స్ 231 పాయింట్లు ఎగబాకి 82,365 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, బజాన్ ఫైన్‌సర్వ్, టీసీఎస్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, టెక్ మహీంద్రా, నెస్లే, మారుతీసుజుకీ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొనసాగుతున్న బుల్ జోరు.. గరిష్ఠాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:59 సమయానికి నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 25,209కు చేరింది. సెన్సెక్స్ 162 పాయింట్లు లాభపడి 82,286 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికానికి చెందిన జీడీపీ డేటా ఈరోజు విడుదల కానుంది. ఈ డేటా పాజిటివ్‌గా వస్తుందనే అంచనాతో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.35 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 80 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.87 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.01 శాతం, నాస్డాక్ 1.1 శాతం నష్టపోయాయి.సెప్టెంబర్‌లో జరగబోయే ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈరోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. జులై నెలకు సంబంధించి మౌలిక సదుపాయాల రంగ వివరాలు సైతం వెల్లడికానున్నాయి. ఈ అంశాలకుతోడు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరు మారకంతో పోలిస్తే రూపాయి కదలికలు మార్కెట్లను ప్రభావితం చేయగలవని అంచనా.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జీవితకాల గరిష్ఠాల్లో మార్కెట్లు.. నిఫ్టీ@25,158
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం జీవితకాల గరిష్ఠాల్లో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 106 పాయింట్లు పెరిగి 25,158 వద్దకు చేరింది. సెన్సెక్స్ 349 పాయింట్లు ఎగబాకి 82,134 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, హెచ్‌యూఎల్, నెస్లే, యాక్సిస్ బ్యాంకు కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.ఎం అండ్ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, కొటక్ మహీంద్రా బ్యాంకు, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.మార్కెట్ ముగిసే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం సమావేశం నిర్వహించారు. అందులో ప్రధానంగా ఈక్విటీ షేర్‌హోల్డర్‌కు 1:1 బోనస్ ఇష్యూను పరిశీలించడానికి 2024 సెప్టెంబర్ 5న తన డైరెక్టర్ల బోర్డుతో సమావేశం కానుందని వెల్లడించారు. 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్ ప్రకటించారు. జియో వినియోగదారులు 100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజిని పొందుతారని తెలిపారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గరిష్ఠాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:53 సమయానికి నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 25,106కు చేరింది. సెన్సెక్స్ 199 పాయింట్లు లాభపడి 81,985 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికానికి చెందిన జీడీపీ డేటా రేపు విడుదల కానుంది. ఈ డేటా పాజిటివ్‌గా వస్తుందనే అంచనాతో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్ 101 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78.6 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.84 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.6 శాతం, నాస్డాక్ 1.1 శాతం నష్టపోయాయి.సెప్టెంబర్‌లో జరగబోయే ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. రేపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. జులై నెలకు సంబంధించి మౌలిక సదుపాయాల రంగ వివరాలు సైతం వెల్లడికానున్నాయి. ఈ అంశాలకుతోడు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరు మారకంతో పోలిస్తే రూపాయి కదలికలు మార్కెట్లను ప్రభావితం చేయగలవని అంచనా.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీ మెరుపులు.. ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాటి సెషన్‌ను ఫ్లాట్ నోట్‌తో ముగించాయి. ఇంట్రాడే ట్రేడ్‌లో రికార్డు స్థాయిలో 25,129.60 వద్ద స్కేల్ చేసిన తర్వాత, నిఫ్టీ 34.60 పాయింట్లు లేదా 0.14 శాతం పెరిగి 25,052.35 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ మునుపటి ముగింపుతో పోలిస్తే కేవలం 73.80 పాయింట్లు లేదా 0.09 శాతం పెరిగి 81,785.56 వద్ద ముగిసింది.నిఫ్టీకి చెందిన 50 లిస్టెడ్ స్టాక్‌లలో 29 నష్టాల్లో ముగిశాయి. మారుతీ సుజుకీ ఇండియా, అదానీ ఎంటర్ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్ 1.34 శాతం వరకు పతనమై నష్టాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి.బీఎస్ఈలో సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 20 నష్టాల్లో ముగియగా, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ ఇండియా, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు 1.24 శాతం వరకు క్షీణించాయి.ఇక రంగాలవారీగా చూస్తే ఐటీ షేర్లు ఇతర రంగాల కంటే మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ 1.64 శాతం పెరిగాయి. ఇతర రంగాల సూచీలలో ఫార్మా, హెల్త్‌కేర్ 1.20 శాతం వరకు కొన్ని లాభాలను పొందగలిగాయి. మిగిలినవి నష్టాల్లో ముగిశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గరిష్ఠాల వద్ద లాభాలు స్వీకరణ
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ 36 పాయింట్లు తగ్గి 24,981కు చేరింది. సెన్సెక్స్ 83 పాయింట్లు నష్టపోయి 81,629 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 80 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.82 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం, నాస్డాక్ 0.17 శాతం లాభపడ్డాయి.సెప్టెంబర్‌లో జరగబోయే ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. వారాంతాన(30న) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. జులై నెలకు సంబంధించి మౌలిక సదుపాయాల రంగ వివరాలు సైతం వెల్లడికానున్నాయి. ఈ అంశాలకుతోడు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరు మారకంతో పోలిస్తే రూపాయి కదలికలు మార్కెట్లను ప్రభావితం చేయగలవని అంచనా.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు తగ్గి 24,989కు చేరింది. సెన్సెక్స్ 61 పాయింట్లు నష్టపోయి 81,635 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.8 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 81 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.81 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.32 శాతం, నాస్డాక్ 0.85 శాతం నష్టపోయాయి.సెప్టెంబర్‌లో జరగబోయే ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. వారాంతాన(30న) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. జులై నెలకు సంబంధించి మౌలిక సదుపాయాల రంగ వివరాలు సైతం వెల్లడికానున్నాయి. ఈ అంశాలకుతోడు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరు మారకంతో పోలిస్తే రూపాయి కదలికలు మార్కెట్లను ప్రభావితం చేయగలవని అంచనా.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు వారంలో తొలి ట్రేడింగ్ సెషన్‌ను లాభాలతో ముగించాయి. సోమవారం సెన్సెక్స్ 612 పాయింట్లు లేదా 0.75 శాతం పెరిగి 81,698.11 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 187.46 పాయింట్లు లేదా 0.76 శాతం పుంజుకుని 25,010.60 వద్ద ముగిసింది.నిఫ్టీ 50లోని 50 లిస్టెడ్ స్టాక్‌లలో 33 స్టాక్‌లు లాభాలను అందుకున్నాయి. హెచ్‌సీఎల్ టెక్, హిందాల్కో, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్సర్వ్ అత్యధికంగా 4.24 శాతం వరకు లాభాలను పొందాయి. అదేవిధంగా, సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో, 21 స్టాక్‌లు లాభాలను చూశాయి. హెచ్‌సీఎల్ టెక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్ 4 శాతం వరకు లాభాలను అందుకున్నాయి.ఇక పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు సెబీ షోకాజ్ నోటీసు వార్తల నేపథ్యంలో పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు సోమవారం బీఎస్ఈలో 4.25 శాతం క్షీణించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మునుపటి గరిష్ఠానికి దగ్గర్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,976కు చేరింది. సెన్సెక్స్ 531 పాయింట్లు లాభపడి 81,605 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల 1వ తేదీన నిఫ్టీ జీవితకాల గరిష్ఠం 25,075 పాయింట్లను చేరింది. ఇటీవల కొంత నష్టాల్లోకి వెళ్లిన మార్కెట్లు క్రమంగా పెరుగుతూ తిరిగి మునుపటి గరిష్ఠ మార్కు దరిదాపుల్లోకి చేరుతున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.58 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.77 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.15 శాతం, నాస్డాక్ 1.47 శాతం లాభపడ్డాయి.సెప్టెంబర్‌లో జరగబోయే ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. వారాంతాన(30న) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. జులై నెలకు సంబంధించి మౌలిక సదుపాయాల రంగ వివరాలు సైతం వెల్లడికానున్నాయి. ఈ అంశాలకుతోడు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరు మారకంతో పోలిస్తే రూపాయి కదలికలు మార్కెట్లను ప్రభావితం చేయగలవని అంచనా.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ 24 పాయింట్లు తగ్గి 24,782కు చేరింది. సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 80,925 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.45 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.21 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.84 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.9 శాతం, నాస్డాక్ 1.7 శాతం నష్టపోయాలి.స్టాక్‌మార్కెట్ రేటింగ్ ఏజెన్సీ గోల్డమన్సాక్స్ ఇటీవల అమెరికా మార్కెట్ ఆర్థికమాంద్యంలోకి వెళుతుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. అదే సంస్థ తాజాగా మాంద్యం రాకపోవచ్చని చెప్పడంతోపాటు యూఎస్ మార్కెట్ గరిష్ఠాలను చేరే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబర్‌లో రాబోయే ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గ్రీన్‌లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 24,829కు చేరింది. సెన్సెక్స్ 212 పాయింట్లు లాభపడి 81,109 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.81 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.4 శాతం, నాస్డాక్ 0.6 శాతం లాభాపడ్డాయి.స్టాక్‌మార్కెట్ రేటింగ్ ఏజెన్సీ గోల్డమన్సాక్స్ ఇటీవల అమెరికా మార్కెట్ ఆర్థికమాంద్యంలోకి వెళుతుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. అదే సంస్థ తాజాగా మాంద్యం రాకపోవచ్చని చెప్పడంతోపాటు యూఎస్ మార్కెట్ గరిష్ఠాలను చేరే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబర్‌లో రాబోయే ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 24,667కు చేరింది. సెన్సెక్స్ 164 పాయింట్లు నష్టపోయి 80,651 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.39 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.16 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.81 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం, నాస్డాక్ 0.33 శాతం నష్టపోయాయి.స్టాక్‌మార్కెట్ రేటింగ్ ఏజెన్సీ గోల్డమన్సాక్స్ ఇటీవల అమెరికా మార్కెట్ ఆర్థికమాంద్యంలోకి వెళుతుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. అదే సంస్థ తాజాగా మాంద్యం రాకపోవచ్చని చెప్పడంతోపాటు యూఎస్ మార్కెట్ గరిష్ఠాలను చేరే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం జపాన్ జులై ద్రవ్యోల్బణ డేటా పాటు భారత ఆర్బీఐ ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. మార్కెట్ ఈ డేటాను పరిశీలించనుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకుంటున్న స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 24,656కు చేరింది. సెన్సెక్స్ 265 పాయింట్లు పుంజుకుని 80,688 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.87 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.82 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.87 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.97 శాతం, నాస్డాక్ 1.39 శాతం లాభపడ్డాయి.అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జులైలో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు (ఫెడ్ మినిట్స్) 21న (బుధవారం) విడుదల కానున్నాయి. ఆర్థిక వ్యవస్థ సహా మందగిస్తున్న ధరల నేపథ్యంలో 2024 ద్వితీయార్ధంలో రేట్ల తగ్గింపునకు సంకేతాలిచ్చిన ఫెడ్ రిజర్వ్ సమావేశ అంతర్గత నిర్ణయాలు, అవుట్‌లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. జపాన్‌కు సంబంధించి జులై వాణిజ్య లోటు గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. మరుసటి రోజు గురువారం దేశీయ హెచ్ఎస్బీసీ తయారీ, సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు వెల్లడి అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం జపాన్ జులై ద్రవ్యోల్బణ డేటా పాటు భారత ఆర్బీఐ ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లోకి చేరిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 24,593కు చేరింది. సెన్సెక్స్ 109 పాయింట్లు పుంజుకుని 80,549 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.67 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.88 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో భారీ లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 3.9 శాతం, నాస్డాక్ 5.2 శాతం లాభపడ్డాయి.అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జులైలో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు (ఫెడ్ మినిట్స్) 21న (బుధవారం) విడుదల కానున్నాయి. ఆర్థిక వ్యవస్థ సహా మందగిస్తున్న ధరల నేపథ్యంలో 2024 ద్వితీయార్ధంలో రేట్ల తగ్గింపునకు సంకేతాలిచ్చిన ఫెడ్ రిజర్వ్ సమావేశ అంతర్గత నిర్ణయాలు, అవుట్‌లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది.జపాన్ జూన్ మెషనరీ ఆర్డర్లు సోమవారం, యూరోజోన్ జులైన ద్రవ్యోల్బణ డేటా మంగళవారం, జపాన్ జులై వాణిజ్య లోటు గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. మరుసటి రోజు గురువారం దేశీయ హెచ్ఎస్బీసీ తయారీ, సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు వెల్లడి అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం జపాన్ జులై ద్రవ్యోల్బణ డేటా పాటు భారత ఆర్బీఐ ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 194 పాయింట్లు పెరిగి 24,336కు చేరింది. సెన్సెక్స్ 631 పాయింట్లు పుంజుకుని 79,733 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 81 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.91 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.6 శాతం, నాస్డాక్ 2.34 శాతం లాభపడ్డాయి.ఇటీవల విడుదలైన రిటైల్ సేల్స్ డేటా, నిరుద్యోగిత రేటు మార్కెట్‌కు సానుకూలంగానే నమోదయ్యాయి. దాంతో సెప్టెంబర్‌లో రానున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో కనీసం 25 పాయింట్ల వరకు వడ్డీరేట్లును కట్ చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అనుకున్న విధంగానే వడ్డీరేట్లను తగ్గిస్తే ఆర్బీఐతోపాటు ఇతర దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లలో కోత విధిస్తాయని అంచనా. ఇది మార్కెట్‌కు సానుకూలాంశంగా మారనుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీ షేర్ల మెరుపులు.. ఫ్లాట్‌గా మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు.. ఐటీ, టెక్నాలజీ షేర్లపై మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడంతో బుధవారం ఇంట్రా-డే డీల్స్‌లో లాభాల్లో స్థిరపడ్డాయి.సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 149.85 పాయింట్లు లేదా 0.19% లాభపడి 79,105.88 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 4.20 పాయింట్లు లేదా 0.017% పెరిగి 24,143.20 వద్ద సెషన్‌ను ముగించింది.నిఫ్టీ లిస్టింగ్‌లో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బీపీసీల్ టాప్ గెయినర్స్‌గా మెరిశాయి. దివిస్ ల్యాబ్స్, హీరో మోటర్ కార్ప్, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, ఓన్ఎన్జీసీ షేర్లు టాప్ లూజర్స్‌గా భారీ నష్టాలను చవిచూశాయి.గమనిక: రేపు భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 24,165కు చేరింది. సెన్సెక్స్ 108 పాయింట్లు పుంజుకుని 79,071 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.6 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 80.81 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.85 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.68 శాతం, నాస్డాక్ 2.4 శాతం లాభపడ్డాయి.అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ, ఐటీసీ షేర్లు నిన్నటి మార్కెట్లో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో స్టాక్ సూచీలు నష్టపోయాయి. ఎఫ్ఐఐల విక్రయాలు కూడా సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.50% నష్టపోయి సూచీల పతనాన్ని శాసించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావంతో అదానీ గ్రూపులోని మొత్తం 11 లిస్టెడ్ కంపెనీల షేర్లలో 8 నష్టపోయాయి. సెన్సెక్స్‌లో నిన్న ఒక్కరోజు రూ.4.52 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.గమనిక: రేపు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ 29 పాయింట్లు తగ్గి 24,324కు చేరింది. సెన్సెక్స్ 85 పాయింట్లు నష్టపోయి 79,566 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79.61 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.92 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.05 శాతం, నాస్డాక్ 0.2 శాతం లాభపడ్డాయి.పారిశ్రామిక రంగం జూన్‌లో నెమ్మదించింది. ఐదు నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.2 శాతంగా నమోదయ్యింది. ఐఐపీ సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ రంగం పనితీరు నిరుత్సాహ పరిచినప్పటికీ విద్యుత్, మైనింగ్ రంగాలు చక్కటి ఫలితాలను నమోదుచేశాయి. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సూచీ వరుసగా 4.2%, 5.6%, 5.5%, 5.0%, 6.2 శాతం వృద్ధి రేట్లను నమోదుచేసుకుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో సూచీ 5.2 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 4.7 శాతం. గత ఏడాది జూన్‌లో ఐఐపీ వృద్ధి రేటు 4 శాతంగా నమోదైంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ 112 పాయింట్లు తగ్గి 24,257కు చేరింది. సెన్సెక్స్ 339 పాయింట్లు నష్టపోయి 79,363 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103.18 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79.61 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.94 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.13 శాతం, నాస్డాక్ 0.5 శాతం లాభపడ్డాయి.సెబీ చైర్పర్సన్ మాధవీ పురీ బచ్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల మినహా దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేనందున స్టాక్ సూచీలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయా దేశాలు విడుదల చేసే స్థూల ఆర్థిక గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి విలువ, క్రూడ్ కదలికలు తదితర సాధారణ అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుందంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న(గురువారం) ఎక్స్చేంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగురోజులకు పరిమితం కానుంది.ఈ వారం వెలువడే ఎకనామిక్ డేటా వివరాలు..మంగళవారం: జులై ప్రొడ్యుసర్ ప్రైస్ ఇండెక్స్ రిపోర్ట్బుధవారం: కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్గురువారం: జులై రిటైల్ సేల్స్ డేటా(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ 254 పాయింట్లు పెరిగి 24,376కు చేరింది. సెన్సెక్స్ 846 పాయింట్లు పుంజుకుని 79,737 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.98 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 2.3 శాతం, నాస్డాక్ 2.88 శాతం లాభపడ్డాయి.గురువారం రాత్రి అమెరికా జాబ్స్డేటా విడుదలైంది. గత వారంతో పోలిస్తే అంచనాల కంటే తక్కువ ఉద్యోగాలు చేరడంతో ఎకానమీ మరింత దిగజారిపోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దాంతో సెప్టెంబర్‌లో రానున్న యూఎస్ ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీ రేట్ల కోత ఉంటుందని మార్కెట్లు భావిస్తున్నాయి. ఇటీవల భారీగా నష్టపోయిన యూఎస్ టెక్ ఇండెక్స్ నాస్డాక్ గురువారం పుంజుకుంది. ఎన్వీడియా, బ్రాడ్‌కామ్ స్టాక్‌లు 6 శాతం, మెటా 4.2 శాతం, యాపిల్ 1.7 శాతం పుంజుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 65 పాయింట్లు తగ్గి 24,237కు చేరింది. సెన్సెక్స్ 202 పాయింట్లు నష్టపోయి 79,286 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.93 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.8 శాతం, నాస్డాక్ 1.05 శాతం నష్టపోయాయి.గడిచిన సెషన్‌ల్లో మార్కెట్ భారీగా పడింది. జపాన్ కరెన్సీ యెన్ పడిపోతుండడం మార్కెట్‌ను మరింత నష్టాల్లోకి తీసుకెళ్తుంది. బుధవారం యెన్ కాస్త పుంజుకోవడం, జపాన్ సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్ ఇకపై వడ్డీరేట్లును పెంచమని చెప్పడంతో మార్కెట్లు లాభాల్లోకి చేరాయి. కానీ తిరిగి యెన్ దిగజారింది. దాంతో యూఎస్ మార్కెట్లు, గిఫ్ట్ నిఫ్టీ నష్టాల్లోకి వెళ్లాయి.ఇలాంటి నష్టాలతో కూడిన ఒడిదొడుకులున్న మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారు ఎలాంటి భయాలకు లోనుకాకుండా వాటిని కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ ఇలా భారీగా పతనమైనపుడు క్వాలిటీ స్టాక్ల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు సంపాదించవచ్చని చెబుతున్నారు. భారత్ ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న దేశం. మార్కెట్లోని ఒడిదొడుకులను ఒక అవకాశంగా తీసుకుని మంచి స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే మరిన్ని లాభాలు సొంతం చేసుకోవచ్చని అంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ 279 పాయింట్లు పెరిగి 24,275కు చేరింది. సెన్సెక్స్ 850 పాయింట్లు పుంజుకుని 79,448 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76.19 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.9 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.04 శాతం, నాస్డాక్ 1.03 శాతం లాభపడ్డాయి.గడిచిన మూడు సెషన్‌ల్లో మార్కెట్ భారీగా పడింది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారు ఎలాంటి భయాలకు లోనుకాకుండా వాటిని కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ ఇలా భారీగా పతనమైనపుడు క్వాలిటీ స్టాక్ల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు సంపాదించవచ్చని చెబుతున్నారు. భారత్ ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న దేశం. మార్కెట్లోని ఒడిదొడుకులను ఒక అవకాశంగా తీసుకుని మంచి స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే మరిన్ని లాభాలు సొంతం చేసుకోవచ్చని అంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 281 పాయింట్లు పెరిగి 24,329కు చేరింది. సెన్సెక్స్ 937 పాయింట్లు పుంజుకుని 79,734 వద్ద ట్రేడవుతోంది. సోమవారం భారీగా తగ్గిన మార్కెట్లు మంగళవారం లాభాల్లోకి చేరుకున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.87 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.17 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.78 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 3 శాతం, నాస్డాక్ 3.4 శాతం నష్టపోయాయి.అమెరికాలో మాంద్యం భయాలు మార్కెట్లను ముంచేశాయి. జపాన్ కరెన్సీ యెన్ భారీ వృద్ధి బెంబేలెత్తించింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు వణికించాయి. వెరసి దలాల్ స్ట్రీట్ సోమవారం బేర్ గుప్పిట్లో విలవిలలాడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ షేర్ల విలువ భారీగా పెరిగిపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 2,223 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 పాయింట్లు పతనమై 24,055 వద్ద నిలిచింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన రోజు జూన్ 4న (5.76% పతనం) తర్వాత ఇరు సూచీలకిదే భారీ పతనం.అమెరికా జాబ్స్డేటా ప్రకారం జులైలో నియామకాల ప్రక్రియ 1,14,000 ఉద్యోగాలకు పరిమితమైంది. అంచనాల కంటే ఏకంగా 1,80,000 జాబ్స్ తగ్గాయి. మరోపక్క, జూన్‌లో 4.1 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జులైలో 4.3 శాతానికి ఎగబాకింది. 2021 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతేకాదు, ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్‌తో సహా మరికొన్ని కంపెనీలు తాజా కొలువుల కోతను ప్రకటించడం కీలకంగా మారింది. ఈ పరిణామాలన్నీ ఇన్వెస్టర్లలో మాంద్యం ఆందోళనలను మరింత పెంచాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)