Money Mantra
-
1,500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ 465 పాయింట్లు తగ్గి 24,243కు చేరింది. సెన్సెక్స్ 1556 పాయింట్లు నష్టపోయి 79,414 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 103.21 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.27 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.80 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.84 శాతం, నాస్డాక్ 2.43 శాతం నష్టపోయాయి. అధిక ద్రవ్యోల్బణం, పశ్చిమాసియా ఘర్షణలు, వాణిజ్య ఉద్రిక్తతలతో ఆర్థిక మాంద్య భయాల నేపథ్యంలో సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల కన్సాలిడేషన్, బలహీన క్యూ1 కార్పొరేట్ ఫలితాలు, అధిక వాల్యుయేషన్ల కారణంగా దేశీయ స్టాక్ సూచీలూ నష్టాల్లోకి జారుకోవచ్చని చెబుతున్నారు.అంతర్జాతీయ సంకేతాలు, ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు ఈ వారం దలాల్ స్ట్రీట్‌కు దారిచూపుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే స్థూల ఆర్థిక గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలూ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి విలువ, క్రూడ్ కదలికలు తదితర సాధారణ అంశాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుందంటున్నారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రెండురోజులు పాటు ఈ సమావేశం గురువారం (8వ తేదీ) వరకూ ఈ సమావేశం జరుగుతుంది. ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన రేకెత్తిస్తున్న తరుణంలో ద్రవ్య విధాన కమిటి రెపో రేటు(6.5%)ను యథాతథంగా కొనసాగించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే వడ్డీరేట్ల తగ్గింపు ఎప్పటి నుంచి అనే అంశంపై ఆర్బీఐ వివరణ కోసం మార్కెట్ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 183 పాయింట్లు తగ్గి 24,830కు చేరింది. సెన్సెక్స్ 574 పాయింట్లు నష్టపోయి 81,281 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా మార్కెట్లు గరిష్ఠాలను చేరుకున్నాయి. దాంతో మదుపర్లు లాభాలను స్వీకరిస్తున్నట్లు తెలుస్తుంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.4 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.94 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.4 శాతం, నాస్డాక్ 2.3 శాతం నష్టపోయాయి.నిన్నటి మార్కెట్లో నిఫ్టీ 25,000 మార్కు చేరింది. 1000 పాయింట్ల నుంచి 25000 పాయింట్ల వరకు ప్రయాణం ఇలా.. 1996, ఏప్రిల్ 22న 13 కంపెనీల లిస్టింగ్‌తో నిఫ్టీ సూచీ 1000 పాయింట్ల వద్ద ప్రయాణం ప్రారంభించింది. తొలినాళ్లలో దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత (1996–98), తర్వాత ఆసియా ఆర్థిక సంక్షోభం, డాట్‌కామ్ బబుల్, ప్రపంచ ఆర్థిక సంక్షోభం(2007) ప్రతికూల ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ తొలిసారి 5,000 పాయింట్లను చేరేందుకు 11 ఏళ్లు పట్టింది.సత్యం కుంభకోణం, యూరోపియన్ రుణ సంక్షోభం, ట్యాపర్ తంత్రం, జీఎస్టీ అమలు సవాళ్ల ఆటుపోట్లను ఎదుర్కొని 25 జూలై 2017న 10,000 మైలురాయిని చేరింది.ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం, కార్పొరేట్ పన్ను, కొవిడ్ మహమ్మారి సూచీని పట్టి కుదిపాయి. కరోనా తొలి వేవ్ సమయంలో 7,600కు పడిపోయిన నిఫ్టీ కేవలం 220 రోజుల్లోనే రెండింతలకు కోలుకోవడం విశేషం. ఈ క్రమంలో 5 ఫిబ్రవరి 2021న 15,000 స్థాయిని అందుకుంది.కరోనా వేళ పెంచిన వడ్డీరేట్లను తగ్గించేందుకు, పెరిగిన ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్‌తో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు ప్రారంభం ప్రక్రియ ప్రారంభించాయి. ఇదే సమయంలో ఇజ్రాయిల్ – పాలస్తీనా యుద్ధ భయాలు తెరపైకి వచ్చాయి. ఈ సవాళ్లను ధీటుగా ఎదుర్కొని గతేడాది (2023) సెప్టెంబర్ 11న 20,000 స్థాయికి చేరింది.ఇక 20,000 స్థాయి నుండి 25000 పాయింట్లు చేరేందుకు 220 ట్రేడింగ్ సెషన్ల సమయం తీసుకుంది. సూచీకి ఇదే అత్యంత వేగవంతమైన 5,000 పాయింట్ల లాభం.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
25,000 మార్కు దాటిన నిఫ్టీ..!
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 25,053కు చేరింది. సెన్సెక్స్ 266 పాయింట్లు పుంజుకుని 82,006 వద్ద ట్రేడవుతోంది. ఫెడ్ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే సంకేతాలు స్పష్టమవడంతో స్టాక్ మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠాలను చేరాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 80.72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.06 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.58 శాతం, నాస్డాక్ 2.64 శాతం లాభపడ్డాయి.యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ సెప్టెంబర్‌లో జరగబోయే ఫెడ్ మీటింగ్‌లో వడ్డీరేట్లను తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చారు. అయితే దానికి ద్రవ్యోల్బణాన్ని మరింత పరిశీలించాలని తెలిపారు. దాంతో యూఎస్ మార్కెట్లు రానున్న సెషన్లో ఎలాగైనా వడ్డీరేట్లను తగ్గిస్తుందనే ఉద్దేశంతో భారీగా పెరిగాయి. దేశీయంగా జులై నెలకు సంబంధించి ఆగస్టు 1న వెలువడే ఆటో కంపెనీల అమ్మకాల డేటా, తయారీ రంగ పీఎంఐ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 24,898కు చేరింది. సెన్సెక్స్ 142 పాయింట్లు పుంజుకుని 81,591 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.15 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.5 శాతం, నాస్డాక్ 1.28 శాతం నష్టపోయాయి.బడ్జెట్ తదనంతరం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో ఏర్పాటు చేసిన ‘వికసిత్ భారత్ దిశగా పయనం’ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘ప్రపంచ ప్రగతికి భారత్ మూల స్తంభంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ప్రపంచ నాయకుల్లో సైతం భారత్ పట్ల పూర్తి ఆశావాదం నెలకొంది. భారతీయ పారిశ్రామిక రంగానికి ఇదో సువర్ణావకాశం, దీన్ని మనం వదులుకోకూడదు’ అని మోదీ చెప్పారు. గ్లోబల్‌గా అధిక ద్రవ్యోల్బణం పెరుగుతున్నా భారత్ వృద్ధి దిక్సూచిగా నిలుస్తోందని పేర్కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 24,862కు చేరింది. సెన్సెక్స్ 94 పాయింట్లు పుంజుకుని 81,447 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.56 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79.84 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.17 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.08 శాతం, నాస్డాక్ 0.07 శాతం లాభపడ్డాయి.అమెరికా ఫెడరల్ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడి ముందు ఈక్విటీ మార్కెట్లో అప్రమత్తత చోటు చేసుకుంది. నిన్నటి మార్కెట్ సెషన్లో ఇంట్రాడేలో 576 పాయింట్లు బలపడి 81,908 వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు ర్యాలీ చేసి 25 వేల పాయింట్ల మైలురాయికి అత్యంత చేరువలో 24,999.75 వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. ఈ వారంలోనే అమెరికా, బ్రిటన్, జపాన్ కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లపై నిర్ణయాలను వెల్లడించనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో కదలాడుతున్నాయి.నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలుఅస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు సంబంధించి సవరించిన ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సెబీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల్లో ఫ్రంట్ రన్నింగ్ ఆరోపణలు వస్తుండడం తెలిసిందే. ఈ తరహా కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు వీలుగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల క్రయ, విక్రయాలను సైతం ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల పరిధిలోకి సెబీ తీసుకొచ్చింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జీవితకాల గరిష్ఠాలను చేరిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 24,911కు చేరింది. సెన్సెక్స్ 329 పాయింట్లు పుంజుకుని 81,658 వద్ద ట్రేడవుతోంది. దీంతో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుకున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.33 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 81.44 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.18 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.11 శాతం, నాస్డాక్ 1.03 శాతం లాభపడ్డాయి.కీలక వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూరోజోన్ జీడీపీ డేటా(మంగళవారం), చైనా తయారీ రంగ గణాంకాలు బ్యాంకు ఆఫ్ ఇంగ్లాడ్ ద్రవ్య విధాన నిర్ణయాలు(గురువారం), అమెరికా ఉద్యోగాల డేటా ట్రేడింగ్‌కు ప్రభావితం చేయొచ్చు. దేశీయంగా జులై నెలకు సంబంధించి గురువారం(ఆగస్టు 1న) దేశీయ ఆటో కంపెనీల అమ్మకాల డేటా, తయారీ రంగ పీఎంఐ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 24,463కు చేరింది. సెన్సెక్స్ 142 పాయింట్లు పుంజుకుని 80,181 వద్ద ట్రేడవుతోంది. వరుసగా ఐదు రోజుల నష్టాలకు ఈరోజు మార్కెట్ ప్రారంభంతో బ్రేక్ పడినట్లయింది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.35 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.5 శాతం, నాస్డాక్ 0.9 శాతం నష్టపోయాయి.అకుమ్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ జులై 30న ప్రారంభమై ఆగస్టు 1న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.646- 679ను నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.1,857 కోట్లు సమీకరించనుంది. జులై 29న యాంకర్ మదుపర్లు బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. రిటైల్ మదుపర్లు కనీసం 22 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో గురువారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపాయి. షేర్ల లావాదేవీల రుసుముతో పాటు, స్వల్ప-దీర్ఘకాలిక లాభాలపై పన్ను పెంపు నేపథ్యంలో విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగాయి. చమురు, వాహన షేర్లు రాణించడంతో నష్టాలు తగ్గాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ 171 పాయింట్లు తగ్గి 24,244కు చేరింది. సెన్సెక్స్ 525 పాయింట్లు నష్టపోయి 79,613 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.12 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 81.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 2.31 శాతం, నాస్డాక్ 3.64 శాతం నష్టపోయాయి.వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. దాంతో బుధవారం నష్టాల్లోకి చేరుకుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్యూరిటీలపై ఎస్టీటీ, స్వల్పకాలిక మూలధన రాబడి(ఎస్టీసీజీ), ధీర్ఘ కాలిక మూలధన రాబడి(ఎల్టీసీజీ)లపై పన్నుల పెంపు ప్రతిపాదనలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. దాంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ 16 పాయింట్లు తగ్గి 24,464కు చేరింది. సెన్సెక్స్ 34 పాయింట్లు నష్టపోయి 80,392 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 81.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.26 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం, నాస్డాక్ 0.06 శాతం నష్టపోయాయి.వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. దాంతో మంగళవారం నష్టాల్లోకి చేరుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగ సమయంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్యూరిటీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ), స్వల్పకాలిక మూలధన రాబడి(ఎస్టీసీజీ), ధీర్ఘ కాలిక మూలధన రాబడి(ఎల్టీసీజీ)లపై పన్నుల పెంపు ప్రతిపాదనలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి.అయితే పన్ను మినహాయింపులు, కస్టమ్స్ సుంకం తగ్గింపు, ద్రవ్యోలోటు కట్టడికి చర్యల ప్రకటనలతో సూచీలు మళ్లీ పుంజుకొని స్వల్ప నష్టాలతో ముగిశాయి. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయల్, ఫైనాన్సియల్ సర్వీసెస్, మెటల్, కమోడిటీస్, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, సర్వీసెస్, ఫార్మా, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బడ్జెట్ ఎఫెక్ట్.. నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ 40 పాయింట్లు తగ్గి 24,493కు చేరింది. సెన్సెక్స్ 142 పాయింట్లు నష్టపోయి 80,462 వద్ద ట్రేడవుతోంది. రేపు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.11 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.63 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.71 శాతం, నాస్డాక్ 0.81 శాతం నష్టపోయాయి.ఎన్డీఏ 3.0 ప్రభుత్వం ఈ జులై 23న (మంగళవారం) ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక లోటు, మూలధన వ్యయాలు, సామాజిక వ్యయాల కేటాయింపుల మధ్య సమతుల్యత చేకూర్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో ఈసారి ‘పారిశ్రామిక అనుకూల బడ్జెట్’ను నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ కల్పన, మేక్ ఇన్ ఇండియా, గ్రీన్ ఎనర్జీ, పట్టణ, గ్రామీణాభివృద్ధి అంశాలపై దృష్టి సారించే వీలుంది. అలాగే ‘దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను’పై ప్రకటన కోసం దేశీయ విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు పార్లమెంట్లో ప్రకటించే ఆర్థికసర్వే ప్రకారం రేపు విడుదల చేయనున్న బడ్జెట్ ఎలా ఉండబోతుందో ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లోకి చేరుకున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 51 పాయింట్లు తగ్గి 24,740కు చేరింది. సెన్సెక్స్ 82 పాయింట్లు నష్టపోయి 81,261 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.14 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.6 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.8 శాతం, నాస్డాక్ 0.7 శాతం నష్టపోయాయి.ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్న జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను మెప్పిస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు ఈ రంగ షేర్లకు మరింత డిమాండ్ పెంచాయి. దాంతో ఐటీ షేర్లు పెరుగుతున్నాయి. వచ్చేవారంలో బడ్జెట్ సమావేశాలు ఉంటుండడంతో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 58 పాయింట్లు తగ్గి 24,554కు చేరింది. సెన్సెక్స్ 189 పాయింట్లు నష్టపోయి 80,535 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103.73 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.17 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.4 శాతం, నాస్డాక్ 2.7 శాతం లాభపడ్డాయి.ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చిన్న-మధ్యస్థాయి షేర్లు మదుపర్లకు ఆకర్షణీయ ప్రతిఫలాన్ని అందించాయి. దేశ స్థూల ఆర్థిక మూలాలు ఆశావహంగా ఉండటంతో పాటు, దేశీయంగా నగదు లభ్యత పెరగడం కలిసొచ్చింది. ఈ ఏడాది జులై 16 వరకు బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 10,984.72 పాయింట్ల (29.81%) పెరిగింది. స్మాల్‌క్యాప్ సూచీ 11,628.13 పాయింట్లు (27.24%) రాణించింది. ఇదే సమయంలో బీఎస్ఈ 30 షేర్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 8,476.29 పాయింట్లే (11.73%) పెరగడం గమనార్హం. ఈక్విటీ మార్కెట్లు సుదీర్ఘ కాలం బుల్ రన్‌ను కొనసాగిస్తుండటంతో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లోని స్టాక్‌లు మరింతగా రాణించే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న బుల్ ర్యాలీ
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 24,613కు చేరింది. సెన్సెక్స్ 66 పాయింట్లు లాభపడి 80,730 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.23 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.21 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.26 శాతం, నాస్డాక్ 0.4 శాతం లాభపడ్డాయి.స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం కొత్త గరిష్టాలకు చేరడంతో ఇన్వెస్టర్ల సంపద సైతం జీవితకాల గరిష్టానికి చేరుకుంది. గడచిన రెండు మార్కెట్ సెషన్‌ల్లో రూ.3.85 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. సోమవారం ఒక్కరోజే రూ.2.70 లక్షల కోట్లు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ ఆల్‌టైం హై రూ.455.08 లక్షల కోట్లకు (5.45 ట్రిలియన్ డాలర్లు) చేరింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు రాణించడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే బడ్జెట్‌పై ఆశావహ దృక్పథం, ఐటీ రంగ కంపెనీలు అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలు ప్రకటించడం తదితర అంశాలు కలిసొచ్చాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 24,556కు చేరింది. సెన్సెక్స్ 148 పాయింట్లు లాభపడి 80,661 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.09 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.18 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.55 శాతం, నాస్డాక్ 0.62 శాతం లాభపడ్డాయి.దేశీయ కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు, బడ్జెట్‌కు ముందు కొనుగోళ్లు అంశాల నేపథ్యంలో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు.దేశీయ జూన్ హోల్‌సేల్ ద్రవ్యల్బణ డేటా, చైనా క్యూ1 జీడీపీ, జూన్ రిటైల్ అమ్మకాలు, యూరోజోన్ మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు(జూన్ 15న) విడుదల కానున్నాయి. మంగళవారం మే నెల యూరోజోన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, జూన్ అమెరికా రిటైల్ అమ్మకాల డేటా, బుధవారం బ్రిటన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, అమెరికా జూన్ పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి కానుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 24,419కు చేరింది. సెన్సెక్స్ 295 పాయింట్లు లాభపడి 80,193 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.44 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.21 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.88 శాతం, నాస్డాక్ 1.95 శాతం నష్టపోయాయి.దిగ్గజ కంపెనీలు జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించనుండటంతో, మదుపర్లు అప్రమత్తమయ్యారు. దీంతో గురువారం పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలు, స్వల్పంగా నష్టపోయాయి. మదుపర్లు తమ మార్జిన్ల కోసం బ్రోకర్ల వద్ద తనఖా ఉంచేందుకు అనుమతించిన షేర్ల జాబితా నుంచి 861 కంపెనీలను ఆగస్టు 1 నుంచి తొలగిస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) వెల్లడించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలను కఠినతరం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తనఖా జాబితా నుంచి ఎన్ఎస్ఈ తొలగించనున్న వాటిలో 861 కంపెనీల షేర్లతో పాటు 149 మ్యూచువల్ ఫండ్ పథకాలు కూడా ఉన్నాయి. జాబితాలో ఉన్న నమోదిత కంపెనీల్లో అదానీ పవర్, ఆదిత్య బిర్లా మనీ, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్, ఇండియా పెస్టిసైడ్స్, జేఎస్‌డబ్ల్యూ హోల్డింగ్స్, రిలయన్స్ ఇన్ఫ్రా, వోకార్డ్, యెస్ బ్యాంక్ వంటివి ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 24,348కు చేరింది. సెన్సెక్స్ 53 పాయింట్లు లాభపడి 79,974 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.96 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.86 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.02 శాతం, నాస్డాక్ 1.2 శాతం లాభపడ్డాయి.మార్కెట్ గరిష్టాల వద్ద మదుపర్లు భారీగా అమ్మకాలు చేశారు. దాంతో బుధవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇటీవల బాగా పెరిగిన లోహ, వాహన, ఐటీ షేర్లకు లాభాల స్వీకరణ ఎదురైంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలపై అనిశ్చితి పెరగడంతో అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా మారాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు తగ్గి 83.51 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.24% లాభంతో 84.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్ నష్టపోగా, సియోల్, టోక్యో లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 24,395కు చేరింది. సెన్సెక్స్ 161 పాయింట్లు దిగజారి 80,193 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.88 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.3 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.07 శాతం, నాస్డాక్ 0.15 శాతం లాభపడ్డాయి.ఆటో, ఎఫ్ఎంసీజీతో పాటు కన్జూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, వినిమయ, ఫార్మా, యుటిలిటీ, కన్జూమర్ డిస్క్రీషనరీ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. మంగళవారం ఒకానొక సమయంలో సెన్సెక్స్ 437 పాయింట్లు బలపడి 80,397 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగసి 24,444 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. రికార్డు ర్యాలీలోనూ టెలికం క్యాపిటల్ గూడ్స్, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా చట్ట సభల్లో ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగానికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి.సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.21,262 కోట్ల పెట్టుబడులు వచ్చా యి. ఇది నెలవారీ సరికొత్త గరిష్ట స్థాయి. మే నెల సిప్ పెట్టుబడులు రూ.20,904 కోట్లు. జూన్‌లో కొత్తగా 55.13 లక్షల సిప్ రిజిస్ట్రేషన్లు పెరిగాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య మే చివరికి ఉన్న 8.76 కోట్ల నుంచి జూన్ చివరికి 8.99 కోట్లకు చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 24,360కు చేరింది. సెన్సెక్స్ 156 పాయింట్లు లాభపడి 80,127 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.98 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.1 శాతం, నాస్డాక్ 0.3 శాతం లాభపడ్డాయి.గడిచిన కొన్నేళ్లలో కంపెనీల వృద్ధి కంటే ఈక్విటీ రాబడులే అధికంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. కాబట్టి దీనికి విరుద్ధమైన పరిస్థితికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు కేటాయించిన పెట్టుబడులు రిస్క్‌ను అధిగమించేందుకు తోడ్పడతాయన్నారు. అంతర్జాతీయంగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా సెనెట్, ప్రజా ప్రతినిధుల సభల్లో కీలక ప్రసంగం(మంగళ, బుధవారం), యూఎస్, చైనా జూన్ ద్రవ్యోల్బణ డేటా, బ్రిటన్ మే జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@24,330
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 3 పాయింట్లు తగ్గి 24,331 వద్దకు చేరింది. సెన్సెక్స్ 36 పాయింట్లు దిగజారి 79,960 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, హెచ్‌యూఎల్, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 24,328కు చేరింది. సెన్సెక్స్ 8 పాయింట్లు నష్టపోయి 79,995 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.41 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 86.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.54 శాతం, నాస్డాక్ 0.9 శాతం లాభపడ్డాయి.ఈక్విటీ సూచీలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయులకు చేరి, అధిక వ్యాల్యూషన్లపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత్ వృద్ధి దశ ఆరంభంలో ఉన్నందునే మార్కెట్ విలువలు అధికంగా ఉన్నట్టు, మరో ఐదేళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. ఐపీవోలపై స్పందిస్తూ.. అదనంగా మార్కెట్లోకి వచ్చే పెట్టుబడుల ప్రవాహాన్ని సర్దుబాటు చేసుకునేందుకు కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలు వేదికగా మారే అవకాశం ఉన్నట్లు తెలిసింది.గడిచిన కొన్నేళ్లలో కంపెనీల వృద్ధి కంటే ఈక్విటీ రాబడులే అధికంగా ఉన్నాయని, కనుక దీనికి విరుద్ధమైన పరిస్థితికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు కేటాయించిన పెట్టుబడులు రిస్క్‌ను అధిగమించేందుకు తోడ్పడతాయన్నారు. అంతర్జాతీయంగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా సెనెట్, ప్రజా ప్రతినిధుల సభల్లో కీలక ప్రసంగం(మంగళ, బుధవారం), యూఎస్, చైనా జూన్ ద్రవ్యోల్బణ డేటా, బ్రిటన్ మే జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@24,314
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 24,314 వద్దకు చేరింది. సెన్సెక్స్ 72 పాయింట్లు నష్టపోయి 79,977 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు మొగ్గు చూపినట్లు నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీలో అధిక షేర్ కలిగిన హెచ్డీఎఫ్సీ శుక్రవారం తగ్గడంతో మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లినట్లు అభిప్రాయపడుతున్నారు.సెన్సెక్స్ 30 సూచీలో ఎస్బీఐ, ఎన్టీపీసీ, హెచ్‌యూఎల్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే, పవర్‌గ్రిడ్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ 116 పాయింట్లు కోల్పోయి 24,186కు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు తగ్గి 79,553 వద్ద ట్రేడవుతోంది. దాంతో వరుస లాభాలకు బ్రేక్ పడినట్లయింది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.11 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 87.11 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.51 శాతం, నాస్డాక్ 0.88 శాతం లాభపడ్డాయి.ఈక్విటీ మార్కెట్ల గణనీయమైన పెరుగుదల నేపథ్యంలో భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ రెగ్యులేటర్– సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు (శాట్) కీలక సూచనలు చేశారు. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్త అవసరమన్నారు. ఎటువంటి సవాలునైనా సత్వరం పరిష్కరించడానికి, వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి మరిన్ని ట్రిబ్యునల్ బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. శాట్ కొత్త ప్రాంగణాన్ని ఇక్కడ ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లలో అధిక మొత్తంలో లావాదేవీలు, అలాగే కొత్త నిబంధనల కారణంగా శాట్‌పై అధిక పనిభారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో శాట్ కొత్త బెంచ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు..నిఫ్టీ@24,300
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 24,304 వద్దకు చేరింది. సెన్సెక్స్ 66 పాయింట్లు ఎగబాకి 80,049 వద్ద ముగిసింది. ఈ రోజు ఒకానొక సమయంలో సెన్సెక్స్ ఏకంగా 80,392 మార్కు చేరింది.డెరివేటివ్ మార్కెట్లో సుమారు 3.5 లక్షల లాంగ్ కాంట్రాక్ట్‌లు నమోదయ్యాయి. ఎఫ్ఐఐ, ఇతర పెద్ద ఇన్వెస్టర్లు మార్కెట్లు మరింత పెరిగాక గరిష్ఠాల వద్ద అమ్మకాలకు సిద్ధమవుతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎం అండ్ ఎం, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, హెచ్‌యూఎల్, నెస్లే, పవర్‌గ్రిడ్, మారుతీసుజుకీ, ఎస్బీఐ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొత్త గరిష్ఠాలను చేరుతున్న స్టాక్‌మార్కెట్లు.. నిఫ్టీ@24,350
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 24,354కు చేరింది. సెన్సెక్స్ 216 పాయింట్లు పెరిగి 80,222 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.11 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 87 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.51 శాతం, నాస్డాక్ 0.88 శాతం లాభపడ్డాయి.విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాటను వీడి మళ్లీ కొనుగోళ్ల రూట్లోకి రావడం కూడా మార్కెట్‌కు మరింత ఇం‘ధనాన్ని’ అందించింది. రాబోయే కాలంలో మౌలిక రంగ ప్రాజెక్టులపై మోదీ సర్కారు భారీగా ఖర్చు చేయనుండటం, బడ్జెట్లో వృద్ధికి ఊతమిచ్చేలా పలు చర్యలు ఉంటాయన్న అంచనాలతో మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోంది. తాజాగా 80,000 పాయింట్ల శిఖరాన్ని కూడా దాటేయడం దీనికి నిదర్శనం.ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్ 90,000 పాయింట్లను కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధానంగా లార్జ్ క్యాప్ షేర్ల ర్యాలీ దన్ను గా నిలుస్తుందని కూడా విశ్లేషిస్తున్నారు. కాగా, ఇన్వెస్టర్ల సంపద గత నెల రోజుల్లోనే రూ.50 లక్షల కోట్లు దూసుకెళ్లింది. జూన్ 4న రూ.395 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జూలై 3న రూ.445.5 లక్షల కోట్లకు ఎగబాకింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..నిఫ్టీ@24,292
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 24,292 వద్దకు చేరింది. సెన్సెక్స్ 545 పాయింట్లు ఎగబాకి 79,986 వద్ద ముగిసింది. ఈ రోజు ఒకానొక సమయంలో సెన్సెక్స్ ఏకంగా 80,074 మార్కు చేరింది.డెరివేటివ్ మార్కెట్లో సుమారు 3.5 లక్షల లాంగ్ కాంట్రాక్ట్‌లు నమోదయ్యాయి. ఎఫ్ఐఐ, ఇతర పెద్ద ఇన్వెస్టర్లు మార్కెట్లు మరింత పెరిగాక గరిష్ఠాల వద్ద అమ్మకాలకు సిద్ధమవుతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, కోటక్‌మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.టీసీఎస్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)