Food and Neutrition
-
‘దేవర’ బ్యూటీ ఫేవరెట్ : రాగి–చిలగడ దుంప పరాఠా
రోజంతా పని చేయాలంటే శక్తి ఉండాలి. అందుకోసం కడుపు నిండా తినాలి. కంటినిండా నిద్ర΄ోవాలి. ఈ రొటీన్లో ఏం తింటున్నామో తెలియకపోతే స్లిమ్‌గా ఉండడం కష్టం. ఆహారం బలాన్ని పెంచాలి కానీ బరువును పెంచకూడదు. నాజూగ్గా ఉండే జాన్వి కపూర్... అంత స్లిమ్ గా, ఎనర్జిటిక్‌గా ఉండడానికి ఏం తింటుంది? డిన్నర్లో రాగి – చిలగడ దుంప (స్వీట్ పొటాటో) పరాఠా తింటానని చెప్పింది. ఆమె షెఫ్ ఎలా వండుతున్నారో చూద్దాం.రాగి–చిలగడ దుంప పరాఠాకావలసినవి: చిలగడ దుంప – ఒకటి (పెద్దది); రాగి పిండి – 250 గ్రాములు; నువ్వులు– టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; అల్లం తురుము – అర టీ స్పూన్; పచ్చిమిర్చి– 2 (సన్నగా తరగాలి); ఉల్లిపాయ– ఒకటి (సన్నగా తరగాలి); జీలకర్ర పొడి– అర టీ స్పూన్; మిరప పొడి– అర టీ స్పూన్; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; మిరియాల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – టేబుల్ స్పూన్;తయారీ∙ఒక పాత్రలో పావు లీటరు నీటిని పోసి వేడి చేయాలి. అందులో నెయ్యి (సగం మాత్రమే), నువ్వులు, కొద్దిగా ఉప్పు, రాగి పిండి వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని చేత్తో అదుముతూ పూరీల పిండిలా కలిపి పాత్ర మీద మూత పెట్టి పక్కన పెట్టాలి.ఈ లోపు ప్రెషర్ కుక్కర్లో నీటిని పోసి గెణుసుగడ్డను ఉడికించాలి. వేడి తగ్గిన తరవాత తొక్కు వలిచి మరొక పాత్రలో వేసి చిదమాలి. ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర పొడి, మిరప పొడి, ఉప్పు, మిరియాల పొడి కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు చేయాలి.రాగి పిండి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకోవాలి. ఒక్కొక్క గోళీని చపాతీల పీట మీద వేసి కొద్దిగా వత్తి అందులో గెనుసు గడ్డ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. ఆ తరవాత జాగ్రత్తగా (లోపలి మిశ్రమం బయటకు రాకుండా) పరాఠా చేసి వేడి పెనం మీద వేసి నెయ్యి రాస్తూ కాల్చాలి. -
‘మమ్రా’ బాదం గురించి తెలుసా? అంత స్పెషల్ ఏంటో?
బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. బాదంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, బాదంపప్పులో ఉండే పోషకాలు, విటమిన్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగ పడతాయి. ముఖ్యంగా శీతాకాలంలో చర్మ సౌందర్యానికి, రోగ నిరోధకశక్తికి చాలా అవసరం. అయితే బాదం పప్పు రకాల గురించి తెలుసా? అవేంటో తెలుసుకుందామా.!మార్కెట్లో మమ్రా ,కాలిఫోర్నియా బాదంతో సహా వివిధ రకాల బాదంపప్పులు అందుబాటులో ఉన్నాయి. బట్ బాదం ,కార్మెల్ బాదం, నాన్పరెయిల్ బాదం,గుర్బండి బాదం,స్వీట్ బాదం,పీర్లెస్ బాదం, గ్రీన్ బాదం మార్కోనా బాదం ఇలా 14 రకాలు ఉన్నాయి. వవీటిల్లో మమ్రా ,కాలిఫోర్నియా ఆల్మండ్స్ అనే ప్రధానమైనవి. ఈ రెండూ రుచికరమైనవీ, పోషకాలతో నిండి ఉన్నవే. అయితే, ఈ రెండింటి మధ్య కొన్ని కీలకమైన తేడాలు ఉన్నాయి. మమ్రా బాదం: "రాయల్ బాదం" అని కూడా పిలుస్తారు, మమ్రా బాదం మధ్యప్రాచ్యానికి చెందినది మరియు కొన్ని శతాబ్దాల తరబడి సాగు చేయబడుతోంది. కాలిఫోర్నియా బాదం: ఇది అమెరికాకు చెందినది. కాలిఫోర్నియా బాదంపప్పును 19వ శతాబ్దంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో మొదటిసారిగా సాగు చేశారు. అనుకూలమైన వాతావరణం ,ఆధునిక వ్యవసాయ పద్ధతులు కాలిఫోర్నియాను ప్రపంచంలోనే అతిపెద్ద బాదం ఉత్పత్తిదారులలో ఒకటిగా మార్చాయి.రుచి, ఆకృతిలోనూ మమ్రా ,కాలిఫోర్నియా రకాలు మధ్య తేడాలున్నాయిమమ్రా బాదం మంచి సువాసనతో పెద్దగా ఉంటాయి. వీటిల్లో నూనె శాతం కూడా ఎక్కువే. మృదువుగా, విలక్షణమైన రుచితో ఎక్కువ క్రీమీగా ఉంటాయి కాలిఫోర్నియా బాదంపప్పులు చిన్నవిగా ఉంటాయి. నూనె శాతం తక్కువ . అందుకే రుచిలో కొంచెం తక్కువగా, క్రంచీగా ఉంటాయి. ప్రాసెసింగ్ పద్ధతులుమమ్రాం బాదంను చేతితో ప్రాసెస్ చేస్తారు. అందుకే ఇవిఎక్కువ నాణ్యంగా ఉంటాయి. సహజ రుచి ,ఆకృతిని పాడుకాకుండా ఉంటాయికాలిఫోర్నియా బాదం: సాధారణంగా ఆధునిక యంత్రాలను ఉపయోగించి ప్రాసెస్ చేస్తారు. కనుక కొద్దిగా రుచినీ ఆకృతిని కోల్పోతుంది. అయినప్పటికీ, ఇది ప్రపంచ డిమాండ్‌ను తీర్చడానికి పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోంది.పోషక విలువలుమమ్రా , కాలిఫోర్నియా బాదం రెండూ విటమిన్లు, ఖనిజాలు , ఆరోగ్యకరమైన కొవ్వులకుఅద్భుతమైన మూలాలు, కానీ కొన్ని తేడాలు ఉన్నాయి:మమ్రా బాదం పెద్దగా, నూనె కంటెంట్ ఎక్కువ గనుక పోషక-సాంద్రత కలిగి ఉంటాయి. మమ్రా బాదంతో పోలిస్తే కాలిఫోర్నియా బాదంలో పోషక సాంద్రత కొంచెం తక్కువ. ధరలుమమ్రా బాధం ధర కిలో సుమారు రూ. 4000కాలిఫోర్నియా బాదం ధర కిలో సుమారు రూ. 1100 -
నిమ్మకాయ, పచ్చిపసుపుతో సిద్ధు భార్య కేన్సర్ ఖతం: నిపుణుల హెచ్చరికలివే!
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల కీలక విషయాన్ని ప్రకటించిన సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. తన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 కేన్సర్‌ని విజయవంతంగా ఓడించిందని మీడియా సమావేశంలో ప్రకటించారు. కేవలం వైద్యులమీదే ఆధారపడకుండా కొన్ని ప్రత్యేక మైన చికిత్సా పద్దతులను అవలంబించామని క్రమశిక్షణ, కఠినమైన జీవనశైలి,ఆయుర్వేద పద్ధతులు, ఆహార నియమాలతో తీవ్రమైన స్టేజ్-4 కేన్సర్‌నుంచి బయటపడినట్టు వెల్లడించారు. ముఖ్యంగా నిమ్మరసం, పచ్చి పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి వంటి వాటి ద్వారా కేన్సర్ మహమ్మారిని జయించినట్టు ప్రకటించడం చర్చకు దారి తీసింది. మరి కేవలం స్ట్రిక్ట్ డైట్ మాత్రమే క్యాన్సర్ రికవరీకి సహాయపడుతుందా? నిపుణులు ఏమంటున్నారు?కొన్నాళ్ల క్రితం కేన్సర్ బారిన పడిన నవజ్యోత్ కౌర్ చికిత్స తీసుకుంది. తగ్గిపోయిందని అనుకున్నారు. కానీ కుమారుడి పెళ్లి తర్వాత స్టేజ్-3 రూపంలో తీవ్రంగా మళ్లీ వచ్చింది. చికిత్స తీసుకున్నా ఫలితం లేదు సరికదా మరింత ముదిరింది. కేవలం 5 శాతం మాత్రమే చాన్స్ ఉందని, కోలుకోవడం కష్టం అని వైద్యులు తేల్చేశారు. కానీ కఠినమైన ఆహార నియమాలు, జీవన శైలి మార్పులతో ఆమె క్యాన్సర్‌ను ఓడించిందని, అయితే ఇది దగ్గర డబ్బు ఉన్నందున కాదు, క్రమశిక్షణ, ఆహార నియమాలను పాటించి 40 రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యిందంటూ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు సిద్దూ. ఆమె ఇపుడు వైద్యపరంగా కేన్సర్‌ను ఓడించిందని సిద్దూ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉపవాసం ప్రాముఖ్యత, చక్కెర , కార్బోహైడ్రేట్లు లేని ఆహారం కేన్సర్‌ను దూరం చేస్తుందన్నారు. ఆమె తన రోజును నిమ్మరసంతో ప్రారంభించేదని, పచ్చి పసుపు తినేదని, ఆపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి లాంటి తీసుకునేదన్నారు. ఇంకా సిట్రస్ పండ్లు,గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్రూట్ , వాల్నట్స్ వంటి రసాలు ఆమె రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేవన్నారు.My wife is clinically cancer free today ….. pic.twitter.com/x06lExML82— Navjot Singh Sidhu (@sherryontopp) November 21, 2024అందరికీ వర్తించదు: నిపుణుల హెచ్చరిక కేన్సర్ చికిత్సలో పోషకాహార పాత్ర కీలకమైనదే, కానీ అది మాత్రమే రికవరీకి ఆహారం మాత్రమే సరిపోదని హెచ్చరిస్తున్నారు. వ్యాధినుంచి కోలుకోవడానికి ఆహారం గణనీయంగా తోడ్పడుతుంది. కానీ కీమోథెరపీ, రేడియేషన్ లేదా శస్త్రచికిత్స వంటి సాంప్రదాయ చికిత్సలకు ఎంతమాత్రం సరిపోదు. కేన్సర్ బహు ముఖమైంది. తీవ్రతను బట్టి, కేన్సర్ కణాలను నాశనం చేయడానికి పలు చికిత్సల కలయిక అవసరం అంటున్నారు వైద్య నిపుణులుఅలాగే ఉపవాసం కేన్సర్ రోగులకు ఉపవాసం అస్సలు పనికిరాదని, కేన్సర్ రోగులను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, లేదా ఉపవాసంలో ఉంచడం నేరమంటున్నారు మరికొందరు నిపుణులు. ఇది కోలుకోవడానికి అవసరమైన పోషకాహారాన్ని నిరోధిస్తుందన్నారు.తక్కువ-గ్లైసెమిక్ డైట్, న్యూట్రాస్యూటికల్స్ గ్లూకోజ్-ఆధారిత కేన్సర్లలో చికిత్సల సామర్థ్యాన్ని పెంచగలవని డాక్టర్ మల్హోత్రా ట్వీట్ చేశారు. అయితే అందరికీ ఇది వర్తించదన్నారు. కేన్సర్ రకం, దశ ఆధారంగా, జీవక్రియ అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఆహార ప్రణాళికలను రూపొందించుకోవాలి. ముఖ్యంగా రోగులు ఆంకాలజిస్టులు, డైటీషియన్ల సలహాలను తీసుకోవాలని డాక్టర్ మల్హోత్రా జోడించారు.కేన్సర్‌నుంచి బయటపడాలంటే.. తొలి దశలోనే గుర్తించడం,కేన్సర్ రకం, లక్షణాలతో పాటు అత్యాధునిక చికిత్స, రోగి విల్ పవర్, ఆహార నియమాలు, రోగి శారీరక, మానసిక స్థితి, కుటుంబ సభ్యుల సహకారం, మద్దతు ఇవన్నీ కీలకమైనవి. -
కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి!
శరీరంలో కాల్షియంది చాలా కీలకమైన పాత్ర. కాల్షియం లోపం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. కాల్షియం లోపాన్ని సరిచేసేందుకు చాలా మంది రకరకాల మందులు వాడుతుంటారు. అలా కాకుండా ఆహార పానీయాల ద్వారానే కాల్షియం స్థాయులను పెంచుకోవచ్చు. ఆహారం కన్నా కొన్ని రకాలపానీయాలను తాగడం ద్వారా కూడా తగినన్ని పాళ్లలో క్యాల్షియం ఉండేలా చూసుకోవచ్చు. ఆపానీయాలేమిటో తెలుసుకుందాం. శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచడానికి ఉత్తమపానీయాలు.వృక్షాధారితం: సాధారణంగా శరీరంలో క్యాల్షియం పెరిగేందుకుపాలు తాగడం మంచిదంటారందరూ. అయితే జంతుసంబంధమైన గేదెపాలలో కన్నా వృక్ష సంబంధమైన బాదం, సోయా వోట్ మిల్క్‌లో కూడా క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వేగన్ డైట్ తీసుకునేవాళ్లు కూడా నిరభ్యంతరంగా ఈ పాలు తాగవచ్చు.లీఫీ స్మూతీస్: పాలకూర, మెంతికూర, చుక్కకూర వంటి ఆకుకూరలకు అల్లం, సైంధవ లవణం, కొన్ని రకాల పండ్ల ముక్కలు కలిపి తయారు చేసిన స్మూతీస్ తాగడం వల్ల శరీరానికి కాలిష్యం సమృద్ధిగా అందుతుంది. బోన్ సూప్: ఎముక ఆరోగ్యం బాగుండాలంటే కాల్షియం అవసరం. అదేవిధంగా ఎముకలకు కాల్షియం సమృద్ధిగా అందాలంటే బోన్‌సూప్ తాగడం చాలా మేలు చేస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. నువ్వుల పాలు: గ్లాసుపాలలో కన్నా స్పూను నువ్వు గింజలలోనే ఎక్కువ కాల్షియం ఉంటుందట. అయితే నువ్వులను నమిలి తినడం కన్నా నువ్వులను నానబెట్టి రుబ్బి, వడకట్టి తేర్చిన పాలను తాగితే రోజంతటికీ కావలసిన కాల్షియం లభిస్తుంది. టోఫు స్మూతీస్: సహజంగానే టోఫులో కాల్షియం ఎక్కువగానే ఉంటుంది. అయితే దానిలో కాల్షియం సల్ఫేట్, కొన్ని పండ్ల ముక్కలతో తయారు చేసిన దానిలో కాల్షియం మరింత సమృద్ధిగా ఉంటుంది. కొబ్బరినీళ్లు: నీరసంగా ఉన్నప్పుడు, జ్వరపడి కోలుకుంటున్నప్పుడు కొబ్బరినీళ్లు తాగమని చెబుతుంటారు వైద్యులు. కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం పుష్కలంగా ఉండటమే అందుకు కారణం. వాటితోపాటు కొబ్బరినీళ్లలో కాల్షియం మోతాదు కూడా తక్కువేం కాదు. ఇదీ చదవండి: శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..! ఆవుపాలు: గేదెపాలతో పోల్చితే ఆవుపాలలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందట. అందువల్ల కాల్షియం లోపించిన వారిని పాలు తాగమని చెప్పినప్పుడు గేదెపాలకన్నా ఆవుపాలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. పై పానీయాలలో వీలున్నవాటిని తాగుతుండటం వల్ల కాల్షియం లోపం తొందరగా భర్తీ అవుతుంది.పెరుగు, జున్ను, మజ్జిగ, చియాసీడ్స్, గసగసాలలో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇతర ఆరోగ్య పరిస్థితులను బట్టి అందుబాటులో ఉన్న పానీయాలు తాగాలి. కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి! -
శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..!
చలికాలం వచ్చేసింది. కీళ్లు బిగుసుకుపోతుంటాయి. నువ్వులతో దేహాన్ని వెచ్చబరచాలి. ఎముకలకు తగినంత శక్తినివ్వాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో పాటు ఒక ఓట్స్ లడ్డు. ఈవెనింగ్ స్నాక్‌గా డేట్స్ లడ్డు. రాత్రి భోజనంలోకి వేడిగా నువ్వుల రైస్. చలికాలం పేజీలను నవ్వుతూ తిప్పేద్దాం. డేట్స్ లడ్డు. కావలసినవి: కర్జూరాలు – 300 గ్రాములు (సీడ్లెస్ అయితే 280 గ్రాములు చాలు); నువ్వులు – కప్పు; నువ్వులు – పావు కప్పు (పైన చల్లడానికి); జీడిపప్పు పలుకులు – పావు కప్పు; యాలకులు – 4.తయారీ: ∙మంద పాటి బాణలిలో నువ్వులను (అన్నింటినీ) వేయించాలి (నూనె వేయకూడదు). చల్లారిన తర్వాత పావు కప్పు విడిగా తీసి పెట్టుకుని మిగిలిన నువ్వులను, యాలకులకు మిక్సీలో పొడి చేయాలి ∙కర్జూరాలను గింజలు తొలగించి వెడల్పు పాత్రలో వేసి చిదమాలి. అందులో నువ్వుల పొడి వేసి సమంగా కలిసే వరకు వేళ్లతో చిదుముతూ కల పాలి. బాగా కలిసిన తరవాత జీడిపప్పు పలుకులను వేసి పెద్ద నిమ్మకాయంత సైజులో లడ్డులు చేయాలి. వేయించి పక్కన తీసి పెట్టిన నువ్వులను ఒక ప్లేట్లో పలుచగా వేయాలి. లడ్డును ఆ నువ్వుల మీద పెట్టి రోల్ చేయాలి. లడ్డుకు అంటుకున్న నువ్వులు రాలిపోకుండా ఉండడానికి రెండు అర చేతుల్లో పెట్టి గట్టిగా అదమాలి. ఇవి వారం పాటు తాజాగా ఉంటాయి. ఓట్స్ సెసెమీ లడ్డు కావలసినవి: ఓట్స్ – పావు కేజీ; నువ్వులు – పావు కేజీ; యాలకులు – 4; బెల్లం తురుము – ఒకటిన్నర కప్పులు; జీడిపప్పు పలుకులు – 20తయారీ: ∙మంద పాటి పాత్రలో ఓట్స్ వేసి మీడియం మంట మీద వేయించాలి (నూనె లేకుండా). చిటపటలాడుతుంటే సమంగా వేగినట్లు గుర్తు. చిటపటలాడేటప్పుడు ఒకసారి గరిటెతో కలియతిప్పి దించేయాలి. వేగిన ఓట్స్‌ను ఒక ప్లేట్లోకి మార్చి అదే పాత్రలో నువ్వులను వేయించాలి. నువ్వులు కూడా చల్లారిన తర్వాత ఓట్స్, నువ్వులు, యాలకులను కలిపి మిక్సీలో పొడి చేయాలి. అందులో బెల్లంపొడి వేసి మరోసారి తిప్పాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో పోసి చేత్తో చిదిమినట్లు కలిపి, జీడిపప్పు పలుకులు కలిపి పెద్ద నిమ్మకాయంత లడ్డులు చేయాలి. ఇవి వారం రోజులు తాజాగా ఉంటాయి.నువ్వుల రైస్కావలసినవి: నువ్వులు – వంద గ్రాములు; బియ్యం – పావు కేజీ; ఎండుమిర్చి – 6; మినప్పప్పు – టీ స్పూన్ ; నువ్వుల నూనె– టేబుల్ స్పూన్; ఉప్పు పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి. పోపు కోసం: నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు.తయారీ: ∙బియ్యం కడిగి అన్నాన్ని కొంచెం పలుకుగా వండుకోవాలి. వెడల్పు పాత్రలోకి మార్చి చల్లారనివ్వాలి. అందులో ఉప్పు, టీ స్పూన్ నువ్వుల నూనె వేసి గరిటెతో జాగ్రత్తగా కల పాలి మిగిలిన నూనె బాణలిలో చేసి వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి వేయించాలి. అవి వేగిన తర్వాత నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు చిట్లుతున్న శబ్దం వచ్చిన తర్వాత ఒక అరనిమిషం పాటు బాగా కలియబెట్టి స్టవ్ ఆపేయాలి నువ్వులు, ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సీలో ముందుగా ఎండుమిర్చి వేసి పొడి చేయాలి. అవి గరుకుగా మెదిగిన తర్వాత బాణలిలో ఉన్న అన్నింటినీ వేసి మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని అన్నం మీద పలుచగా చల్లాలి అదే బాణలిలో పోపు కోసం తీసుకున్న నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేయించాలి. ఈ పోపును అన్నంలో వేయాలి. నువ్వుల పొడి, పోపు సమంగా కలిసే వరకు గరిటెతో కలపాలి. రుచి చూసుకుని అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవచ్చు. -
జొన్నలతో అధిక బరువుకు చెక్ : ఇలా ఒకసారి ట్రై చేయండి!
జొన్నలు అనగానే గుర్తొచ్చేది జొన్న సంగటి, జొన్న రొట్టెలు, జొన్న అన్నం. కానీ జొన్నలతో జావకూడా తయారు చేసు కోవచ్చు. జొన్నలను మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. మరి ఈజీగా జొన్న, ఉప్మా, కిచిడీ, జావను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.ఫైబర్-రిచ్ మిల్లెట్ జొన్నల్ని భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా - ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా,మధ్య అమెరికాలో సాగు చేస్తారు. దాదాపు వేల ఏళ్లుగా పేద, గ్రామీణ ప్రజల సాధారణ భోజనంగా ఉండేది. అయితే జొన్నలు పోషకాహారం మాత్రమే కాదు, అధికబరువుతో బాధపడేవారికి మేలు చేస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ బరువు తగ్గడంలో,గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో పనిచేస్తాయి.హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తాయి.శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను ,ఇన్సులిన్ సెన్సిటివిటీని నియంత్రించి డయాబెటిస్ నియంత్రణలో సహాయపపడతాయి వీటితో పాటు, ఫైబర్, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్ జోవర్ అధికంగా ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ చెప్పవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జొన్నల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది.జొన్నలతో జావజొన్న పిండిని అరకప్పు తీసుకోవాలి, మజ్జిగ ఒక కప్పు, ఉప్పు తగినంత తీసుకోవాలి. జొన్న పిండిలో నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలపాలి. వెడల్పాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగిన తరువాత ముందుగానే కలిపి ఉంచుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని కలపాలి. తక్కువ మంట మీద 5 నిమిషాల పాటు ఉండలు రాకుండా, కలుపుకుంటూ ఉడికించాలి. సరిపడా ఉప్పు, పలుచని మజ్జిగ కలిపి తాగాలి. నచ్చినవాళ్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు అల్లం, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. (మొలకెత్తిన రాగుల పిండితో లాభాలెన్నో: ఇంట్లోనే చేసుకోండిలా! )జొన్న ఉప్మాఒక కప్పు జొన్నలు లేదా రవ్వను సుమారు 8-12 గంటలు లేదా రాత్రిపూట నానబెట్టాలి.కుక్కర్లో మంచినీళ్లు, చిటికెడు పసుపు వేసి మూడు, నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.ఇపుడు ఉప్మా పోపు కోసం పాన్ వేడి చేసి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, ఆవాలు , జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇష్టమున్నవారు పచ్చి బఠానీ, క్యారట్, బంగాళాదుంపు, బీన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా వేగాక ఉడికిని జొన్న రవ్వను కలుపుకోవాలి. టేస్ట్ కోసం రెండు టీస్పూన్ల మాగీ మసాలా ధనియాల పొడి కలుపుకోవచ్చు. ఐదు నుండి ఎనిమిది నిమిషాలు నెమ్మదిగా మంట ఉడకనిస్తే చాలు.జోవర్ ఖిచ్డీఅరకప్పు జొన్నల్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒక బాండ్లీలో క్యాప్సికమ్, టమాటా,పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు గుమ్మడికాయ (ఐచ్ఛికం) ముక్కలు, ఎండుమిర్చి జీలకర్ర, ఇంగువ, ఇతర పోపు గింజలువేసి వేయించుకోవాలి. బాగా వేగాక నాన బెట్టిన జొన్నలు, సరిపడినన్ని నీళ్లు, అరకప్పు పాలు యాడ్ చేసి కుక్కర్లో మూడు విజిల్స్ దాకా ఉడికించుకోవాలి. తినేమందు తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దీన్ని అల్లం లేదా కొబ్బరి చట్నీతోగానీ, పుట్నాల చట్నీతోగానీ తింటే భలే రుచిగా ఉంటుంది. (డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో) -
మొలకెత్తిన రాగుల పిండితో లాభాలెన్నో: ఇంట్లోనే చేసుకోండిలా!
రాగులతో మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు రాగులు చాలామంచిది. కాల్షియం, ఐరన్ లాంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి. రాగులతో పసందైన వంటకాలను తయారు చేసుకొని ఆస్వాదించవచ్చు. అయితే రాగులను నానబెట్టి,మొలకలొచ్చాక, వేయించి పౌడర్ చేసుకొన వాడితేమరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లలు నుంచి పెద్దల వరకు రాగులను అనేక రూపాల్లో తీసుకోవచ్చు. రాగి జావ, రాగి పిండితో దోసెలు, ఇడ్లీలు చేసుకోవచ్చు. అలాగే రాగులతో మురుకులను కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా రాగులను మొలకలు వచ్చేలా చేసి వాటిని ఎండబెట్టి, లైట్‌గా వేయించి పౌడర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం. రుచికీ రుచీ పెరుగుతుంది. పోషకాలూ పెరుగుతాయి. రాగుల మొలకలతో పిండిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం.రాగుల మొలకలతో పిండి తయారీరాగులను రాళ్లు, ఇసుక లేకుండా శుభ్రంగా జల్లించుకోవాలి. ఆ తరువాత వీటిని శుభ్రంగా కడగాలి. ఎక్కువ సార్లు దాదాపు నాలుగు నుంచి పదిసార్లు , తెల్ల నీళ్లు వచ్చేదాకా కడుక్కోవాలి. కడిగిన రాగులను జాలీలో వేసుకొని నీళ్లు మొత్తం వాడేలా చూసుకోవాలి. తరువాత వీటిని పల్చని కాటన్ వస్త్రంలో(కాటన్ చున్నీ, చీర అయితే బావుంటుంది)వేసి మూట కట్టి, లైట్‌గా నీళ్లు చిలకరించి ఒక జాలీ గిన్నెలో పెట్టి, జాగ్రత్తగా వంట ఇంటి కప్‌బోర్డులో(గాలి, వెలుతురు తగలకుండా) పెట్టుకోవాలి. రెండు రోజులకు రాగులు మొలకలు భలే వస్తాయి. మూటలోంచి మొలకలు తెల్లగా బయటికి వచ్చేంత పెరుగుతాయి. వీటిని జాగ్రత్తగా తీసుకొని తడి ఆరేలాగా ఎండబెట్టుకోవాలి. ఆరిన తరువాత వీటిని నూనె లేకుండా ఉత్తి మూకుడులో వేగించుకోవాలి. మాడకుండా గరిటెతో తిప్పుతూ సన్నని సెగమీద కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. అంటే కమ్మని రాగుల మొలకల పిండి రెడీ.ఈ పిండిని జావ, దోసెలు, చపాతీలు తయారీలో వాడుకోవచ్చు. ఇంకా రాగిమొలకలతో చేసిన పిండిలో కొద్దిగా పుట్నాల పొడి, బెల్లం, నెయ్యి కలిపి సున్ని ఉండలుగా చేసి పిల్లలకు రోజుకు ఒకటి పెడితే మంచి శక్తి వస్తుంది.రాగి ఇడ్లీరాగుల పిండిలో గోధు రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎండు మిర్చి,, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి. కొత్తమీర కూడా కలుపుకోవచ్చు.రాగులతో ఉపయోగాలురాగులు బలవర్దకమయిన ఆహారం. ఇతర ధాన్యాల కంటే రాగుల్లో 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఎక్కువ. నానబెట్టి, మొలకెత్తడంవల్ల పోషకాలు మరింత పెరుగుతాయి కొవ్వు కంటెంట్ తగ్గుతుంది. ఈ పిండితో చేసిన ఉగ్గును శిశువులకు కూడా తినిపించవచ్చు.బీపీ మధుమేహం, కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం లాంటి సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. చిన్నపిల్లల్లో ఎముకల వృద్ధికి, అనీమియా నివారణలో ఉపయోగపడుతుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి -
దానిమ్మతో దీర్ఘాయుష్షు, ఇలా తిన్నారంటే..!
చాలా మంది మనసులో మెదిలే ఆలోచన ‘దీర్ఘకాలం జీవించాలి. ఆ జీవనం కూడా వీలైనంతవరకు ఆరోగ్యంగా, వృద్ధాప్యం దరిచేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ ఆలోచన మీది కూడా అయితే మన శరీర కణాల ఆరోగ్యానికి మేలు చేసే మంచి అలవాట్లతో ఆయుష్షును పెంచుకోవచ్చు.ఎలా అంటే... కాలానుగుణంగా లభించే పండ్లను తినడం వల్ల వాటిలోని పోషకాలు వాతావరణ మార్పులను తట్టుకునేలా శరీరానికి సహజంగా అవసరమైన వాటిని సరఫరా చేస్తాయి. ఈ సీజన్లో దానిమ్మపండ్లు (సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు) విరివిగా లభిస్తాయి. దానిమ్మ పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలిస్తే ప్రతిరోజూ ఆహారంలో వీటిని తప్పక చేరుస్తారు. చర్మానికి మేలు..దానిమ్మపండ్లలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికం. ఇవి మెదడు నుండి చర్మ ఆరోగ్యం వరకు ప్రతిదానికీ మద్దతు ఇస్తాయని పరిశోధనలలో తేలింది. డాక్టర్ విసెంటె మేరా తన ‘యంగ్ ఎట్ ఏ ఏజ్’ అనే పుస్తకంలో ‘దానిమ్మపండు దాని యాంటీఆక్సిడెంట్ శక్తి కారణంగా చర్మానికి మేలు చేసే సూపర్‌ఫుడ్’ అని పేర్కొన్నారు. దానిమ్మపండులో విటమిన్– సి పుష్కలంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ‘శరీరానికి విటమిన్– సి అందినప్పుడు, కొల్లాజెన్ ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉత్తేజితమవుతుంది. అంతర్గత సన్స్క్రీన్దానిమ్మ జ్యూస్ తాగితే యూవీ కిరణాల వల్ల కలిగే ఆక్సీకరణ నుండి చర్మాన్ని రక్షించవచ్చు. ఇది దాదాపు ‘అంతర్గత సన్‌స్క్రీన్‘ లా పనిచేస్తుంది. మెదడుకు దానిమ్మదానిమ్మలోని విటమిన్ బి5 నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. దానిమ్మ రసం నుండి వచ్చే ఫైటోన్యూట్రియెంట్లు మెదడుపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలవు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి‘ అని యుసిఎల్ఎ హెల్త్ నోట్ పరిశోధకులు పేర్కొన్నారు.చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‘చెడు‘ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. టిజి, ఎల్డిఎల్ అండ్ సి, హెచ్‌డిఎల్, సి స్థాయిలను మెరుగుపరచడంలో దానిమ్మ వినియోగం ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. నిరంతర ఒత్తిడి వల్ల వృద్ధాప్యం త్వరగా ప్రవేశిస్తుంది. ఒత్తిడి తగ్గించడంలోనూ, నాడీ వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలోనూ కాలానుగుణంగా లభించే దానిమ్మ సరైనది. ఎలా తినాలంటే... దానిమ్మ గింజలు కొన్ని రకాల వంటకాలకు, సలాడ్స్‌కు మంచి రుచిని తీసుకువస్తాయి. ఉదయం టిఫిన్‌తో పాటుగా దానిమ్మ గింజలను తినవచ్చు. అవకాడో, పిస్తాతో కలిపి చేసిన సలాడ్స్‌లోనూ చేర్చవచ్చుఅవిసె గింజలు, పెరుగుతోనూ కలిపి తినవచ్చు. ఉడికించిన కూరగాయలపైన పెరుగు, దానిమ్మ గింజలు వేసుకొని తినవచ్చు. దానిమ్మ పండును కడగాల్సిన అవసరం లేదు. గింజలను వేరు చేసి, తినవచ్చు. -
మయోన్నీస్తో ముప్పే..హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఇవిగో!
కలుషితమైన మయోన్నీస్ తెలంగాణాలో విషాదాన్ని నింపింది. ఒకరు మరణం, 15మంది అస్వస్థతకు దారి తీసిన ఉదంతంలో మయోన్నీస్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై తక్షణమే ఒక సంవత్సరం (2025 అక్టోబర్ వరకు) నిషేధం విధించింది. మయోన్నీస్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే హాని జరిగే అవకాశాలే ఎక్కువ అంటున్నారు ఆహార నిపుణులు. ఈ నేపథ్యంలో మయోన్నీస్ లేదా ‘మాయో’కి ప్రత్యామ్నాయాలు ఏమిటో చూద్దాం రండి!క్రీమీ పాస్తా , ఫ్రెంచ్ ఫ్రైస్, సలాడ్లు, మోమోస్, సాండ్విచ్లు, బ్రెడ్ ఇలా జంక్‌ఫుడ్‌లలో ఈ క్రిమ్ను వేసుకొని రెడీమేడ్‌గా తినేస్తారు. అయితే రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్య పరంగా చాలా నష్టాలను తీసుకొస్తుంది. మరీ ముఖ్యంగా శుభ్రత, ఆహార ప్రమాణాలను సరిగ్గా పాటించకపోతే ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు తెస్తుంది.మయోన్నీస్ ఎలా తయారు చేస్తారు?మయోన్నీస్ లేదా మాయో క్రీమ్ లా ఉండే సాస్. గుడ్డులోని పచ్చసొనను నూనెతో ఎమల్సిఫై చేయడం ద్వారా తయారు చేస్తారు. దీంట్లో వెనిగర్, నిమ్మరసంకూడా కలుపుతారు.మాయోతో నష్టాలుమయోన్నీస్రోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇందులో క్యాలరీలు, కొవ్వు ఎక్కువ. దీన్ని అధికంగా తింటే ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ ఖాయం. మయోన్నీస్లో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయి కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులొచ్చే ప్రమాదం కూడా ఉంది. తలనొప్పి, శరీరం బలహీనంగా అనిపించడం, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టేస్టీ అండ్ హెల్దీ ఆల్టర్నేటివ్స్ఆరోగ్యకరమైన, రుచికరమైన కొన్ని ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రోబయోటిక్స్‌లో పుష్కలంగా ఉండే చిక్కటి పెరుగుతో దీన్న తయారు చేసుకోవచ్చు. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవచ్చు. ఇది కడుపు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. ప్రోటీన్ , కాల్షియం, గొప్ప మూలం పెరుగు.క్రీమీ టేస్ట్ వచ్చేలా పెరుగుతో పాటు దోసకాయ, పుదీనా, నిమ్మ, వెల్లుల్లి, జీలకర్ర కలుపుకొని వాడుకోవచ్చు. పెరుగు, పుదీనాలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్నాయి. దోసకాయ, పుదీనాతో అజీర్తికి గుడ్ బై చెప్పవచ్చు. కమ్మటి చిక్కటి పెరుగులోవెల్లుల్లి, నిమ్మ కలుపుకోవచ్చు. వెల్లుల్లి గట్-ఫ్రెండ్లీ ప్రోబయోటిక్స్, రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే పెరుగులో వేయించిన జీలకర్ర పొడిని కలుపుకొని కూడా వాడవచ్చు. -
హెల్దీ సంచోక్స్ : లాభాలు అన్నీ ఇన్నీ కావు!
సంచోక్స్.. ఎన్నో ఔషధ గుణాలున్న దుంప పంట. దీనికి మరో పేరు జెరూసలెం ఆర్టిచోక్ (హెలియాంతస్ ట్యూబరోసస్) అని దీనికి మరో పేరుంది. ఆస్టెరాసియా కుటుంబం. ఇది ఒకసారి నాటితే చాలా ఏళ్లపాటు పెరుగుతుంది. కానీ, పసుపు మాదిరిగా వార్షిక పంట మాదిరిగా కూడా పెంచుతుంటారు. ఉత్తర అమెరికా దీని పుట్టిల్లు. జెరూసలెం ఆర్టిచోక్ అనే పేరు ఉన్నప్పటికీ ఇది జెరూసలెంలో పుట్టిన పంట కాదు. ఆర్టిచోక్ అని ఉన్నప్పటికీ ఇది నిజమైన ఆర్టిచోక్ కాదు. వాడుకలో అలా పేర్లు వచ్చాయంతే. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది బతికేస్తుంది. పోషక విలువలు, చీడపీడలను బాగా తట్టుకునే స్వభావం ఉండటం వంటి గుణగణాల వల్ల మెడిటరేనియన్, ఆ పరిసర ప్రాంతాల్లో దీన్ని సాగు చేయటం ప్రారంభమైంది. ఇప్పుడు అమెరికా, కెనడా, బల్గేరియా, రష్యా సహా అనేక ఐరోపాదేశాల్లో ఇది సాగవుతోంది. మన దేశంలోనూ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా సాగవుతున్నదని చెబుతున్నారు. సంచోక్స్ దుంపలు రకరకాల రంగులు..సంచోక్స్ మొక్క చూడటానికి పొద్దు తిరుగుడు మొక్క మాదిరిగా ఉంటుంది. 5–8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని దుంప బంగాళదుంప మాదిరిగా తినటానికి అనువుగా కండగలిగి ఉంటుంది. సంచోక్స్ దుంపలు తెలుపు నుంచి పసుపు వరకు, ఎరుపు నుంచి నీలం వరకు అనేక రంగుల్లో ఉంటాయి. దుంప బరువు 80–120 గ్రాముల బరువు, 75 సెం.మీ. పొడవు ఉంటుంది. పూలు చిన్నగా పసుపు రంగులో ఉంటాయి. ఆకులపై నూగు ఉంటుంది. సంచోక్స్ మొక్క వేగంగా పెరుగుతుంది. అధిక దిగుబడినిచ్చే శక్తి దీనికి ఉంది. మంచును కూడా తట్టుకుంటుంది. ఎరువులు కొంచెం వేసినా చాలు, వేయకపోయినా పండుతుంది. కరువును తట్టుకుంటుంది. చౌడు నేలల్లోనూ పెరుగుతుంది. 4.4 నుంచి 8.6 పిహెచ్ను తట్టుకుంటుంది. ఉష్ణోగ్రత తక్కువున్నా ఎక్కువున్నా బతికి దిగుబడినిస్తుంది. ఇసుక దువ్వ నేలలు, సారంవతం కాని భూముల్లోనూ పెరుగుతుంది. 18–26 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత దీనికి నప్పుతుంది. ఫిబ్రవరి – మార్చి లేదా సెప్టెంబర్ – అక్టోబర్లలో విత్తుకోవచ్చు. మొక్క వడపడిపోయిన తర్వాత విత్తిన 5 నెలలకు దుంపలు తవ్వుకోవచ్చు. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు హెక్టారుకు 15 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. దుంపలపై పొర పల్చగా ఉంటుంది. కాబట్టి, జాగ్రత్తగా తవ్వితీయాలి. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు, మొక్క అంతటినీ, ముఖ్యంగా ఆకులను ఔషధాల తయారీలో వినియోగించటం అనాదిగా ఉందనటానికి ఆధారాలున్నాయి. వాపు, నొప్పి, ఎముకలు కట్టుకోవటానికి, చర్మ గాయాలకు మందుగా ఇది పనిచేస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహాన్ని, ఊబకాయాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. మలబద్ధకాన్ని పోగొట్టటం, జీవక్రియను పెంపొందించటం, కేన్సర్ నిరోధకంగా పనిచేయటం వంటి అనేక అద్భుత ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలోనూ ఉపకరిస్తుంది. అండర్సన్, గ్రీవ్స్ అనే ఇద్దరు శాస్త్రవేత్తల చెప్పిందేమంటే.. జెరూసలెం ఆర్టిచోక్ డి–లాక్టిక్ యాసిడ్ రూపంలో లాక్టిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుందని నిర్థారణైంది. అంటే, పారిశ్రామిక ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగించుకోవడానికి ఎంతో అవకాశం ఉందన్నమాట. రోటనారోధక వ్యవస్థ లోపాలు, దీర్ఘకాలిక నిస్తత్తువ, గుండె జబ్బులు, జీర్ణకోశ వ్యాధులు, రొమ్ము కేన్సర్, మలబద్ధకం, పేను తదితర వ్యాధులు, రుగ్మతల నివారిణిగా పనిచేస్తుందని చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని ప్రేరేపించటం, దేహం లో నుంచి కలుషితాలను బయటకు పంపటంలో దోహదకారిగా ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దుంపల ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలను చెరకు, మొక్కజొన్న మాదిరిగా జీవ ఇంధనాల తయారీలోనూ వాడుకోవచ్చట. హెక్టారు పొలంలో పండే దుంపలతో 1500–11,000 లీటర్ల ఇథనాల్ తయారు చేయొచ్చు. భార లోహాలను సంగ్రహిస్తుంది..జెరూసలెం ఆర్టిచోక్ మొక్క భార లోహాలను సంగ్రహించే స్వభావం కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. జనావాసాల నుంచి వెలువడే మురుగు నీటిలో నుంచి, నేలలో నుంచి భార లోహాలను సంగ్రహించడానికి ఈ మొక్కలను ఉపయోగించ వచ్చని చెబుతున్నారు. అల్బిక్ రకం జెరూసలెం ఆర్టిచోక్ మొక్కల్లో ఈ గుణం ఎక్కువగా ఉందట. దీని మొక్కల చొప్ప పశువులకు మొక్కజొన్న చొప్ప సైలేజీకి బదులు వాడొచ్చు. భూసారం తక్కువగా ఉన్న నేలల్లో ఆచ్ఛాదనగా పచ్చిరొట్ట పెంచటానికి, జీవ ఇంధనాల తయారీకి పచ్చిరొట్ట విస్తారంగా పెంచాలనుకుంటే కూడా జెరూసలెం ఆర్టిచోక్ దుంప పంట ఎంతో ఉపయోగ పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. షుగర్ రోగులకు ఉపయోగకరంటైప్ 2 షుగర్, ఊబకాయంతో బాధపడే వారిలో ఇన్సులిన్‌ను విడుదలకు దోహదపడే ఇనులిన్‌ను ఈ దుంప కలిగి ఉంది. ఫ్రక్టోజ్, ఓలిగోఫ్రక్టోస్ తదితర సుగర్స్‌ను నియంత్రించే గుణం జెరూసలెం ఆర్టిచోక్కు ఉంది. సాధారణంగా ఇనులిన్‌ను చికొరీ,జెరూసలెం ఆర్టిచోక్ నుంచి పారిశ్రామిక పద్ధతుల్లో వెలికితీస్తుంటారు. ఈ దుంపను సన్నగా తరిగి, వేడి నీటిలో మరిగించి ఇనులిన్‌ను వెలికితీసిన తర్వాత శుద్ధి చేస్తారు. ఈ ద్రవం నుంచి ఇనులిన్ పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అనేక ఆహారోత్పత్తులో వాడతారు. ఇటీవల కాలంలో ఈ పొడి, కాప్సూల్స్ రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ దుంపల్లో ఉండే ఫ్రక్టోజును ఔషధాలు, ఫంక్షనల్ ఫుడ్స్‌లో స్వీట్నర్గా వాడుతున్నారు. ఫ్రక్టోజ్ గ్లైసెమిక్ ఇండెక్స్ (23) గ్లూకోజ్ (100) లేదా సుక్రోజ్ (65) కన్నా తక్కువ కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు ఆరోగ్యదాయకమైన ఆహారంగా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి, మున్ముందు బాగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంది. -
Sai Priyanka pagadala: అమ్మలాంటి అన్నదాత కోసం...
తల్లి తన ఆకలి గురించి పట్టించుకోదు. పిల్లల కడుపు నిండిందా లేదా అనేదే ఆమెకు ముఖ్యం. రైతులు కూడా అమ్మలాంటి వారే. అందుకే వారిపై దృష్టి పెట్టింది సాయిప్రియాంక. తాను పండించే పంటల ద్వారా ఎంతోమందికి పోషకాహార శక్తిని అందిస్తున్న రైతు ఆ శక్తికి ఎంత దగ్గరలో ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు... అనే ఆసక్తితో పరిశోధన బాట పట్టింది. తన పరిశోధన అంశాలను కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో వివరించడానికి సిద్ధం అవుతోంది.సాయిప్రియాంక చదువుకున్నది పట్టణాల్లో అయినా ఆమెకు పల్లెలు అంటేనే ఇష్టం. పల్లెల్లో పచ్చటి పొలాలను చూడడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే వ్యవసాయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తికి కారణం అయింది. ఆ ఆసక్తే తనను ‘అగ్రికల్చరల్ సైంటిస్ట్’ను చేసింది.ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్పీఆర్ఐ) అనేది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. పోషకాహార లోపానికి సంబంధించి పరిశోధన ఆధారిత పరిష్కారాలను అందించే సంస్థ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో కలిసి ఈ సంస్థ ‘డెలివరింగ్ ఫర్ న్యూట్రిషన్ ఇన్ సౌత్ ఏషియా: కనెక్టింగ్ ది డాట్స్ ఎక్రాస్ సిస్టమ్స్’ అనే అంశంపై కొలంబోలో డిసెంబర్ 3,4,5 తేదీలలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తోంది. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విధానకర్తలు, పరిశోధకులను ఏకతాటిపై తీసుకు వస్తోంది.మన దేశం నుంచి ఆరుగురు ప్రతినిధులు ఈ ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో పాల్గొనబోతున్నారు. వారిలో సాయి ప్రియాంక ఒకరు. తన పరిశోధనకు సంబంధించిన అంశాలను ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రియాంక వివరించనుంది. ప్రత్యేక గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్, అర్జున్ నాయక్ తాండా, బిడకన్నె గ్రామాలకు వ్యవసాయ పరంగా ప్రత్యేకత ఉంది. వీటిని ‘ప్రత్యేక గ్రామాలు’ అనుకోవచ్చు. కొర్రలు, సామలు, ఊదలులాంటి సిరిధాన్యాలతో పాటు సుమారు 20 రకాల ఆకుకూరలు సాగు చేస్తుంటారు అక్కడి రైతులు. రసాయనాలు వినియోగించకుండా సేంద్రియ పంటలను పండిస్తున్నారు. దక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)లాంటి సంస్థల ప్రోత్సాహంతో ఈ గ్రామాల్లోని రైతులు పౌష్టికాహారాన్ని ఇచ్చే ప్రత్యేక పంటలు సాగు చేస్తున్నారు.పత్తి, సోయా, చెరుకు లాంటి వాణిజ్య పంటలు సాగు చేసే గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతోందనే అంశంపై ఎంతోమంది రైతులతో మాట్లాడింది సాయిప్రియ.‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజెస్’ పేరుతో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తోంది. రైస్, పప్పులులాంటి ఒకేరకమైన ఆహారంతో పాటు ఆకు కూరలు, సిరిధాన్యాలు తీసుకోవడం ద్వారా ఆ మూడు గ్రామాల ప్రజలు మెరుగైన పౌష్టికాహారం పొందగలుగుతున్నారని ఆమె పరిశోధనల్లో తేలింది. ఈ గ్రామాలతో పాటు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రామాల్లో కూడా పరిశోధనలు చేస్తోంది.ఐఏఆర్ఐలో పీహెచ్డీఖమ్మం పట్టణానికి చెందిన పగడాల సాయి ప్రియాంక పదో తరగతి వరకు ఖమ్మంలో, ఇంటర్ విజయవాడలో చదువుకుంది. తల్లిదండ్రులు రాజరాజేశ్వరి, నర్సింహరావులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ‘డాక్టర్ కావాల్సిందే’ ‘ఇంజనీర్ కావాల్సిందే’లాంటి సగటు తల్లిదండ్రుల ఆలోచనకు దూరంగా కూతురుకి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు.వ్యవసాయ పరిశోధనపై ఎంతో ఆసక్తి ఉన్న సాయి ప్రియాంక అశ్వారావుపేటలో బీఎస్సీ అగ్రికల్చర్, మేఘాలయలోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్డీ చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది.‘ఇవి మాత్రమే మనం చేరుకోవాల్సిన గమ్యాలు’ అని యువతరం ఒకే వైపు దృష్టి సారించినప్పుడు ఎన్నో రంగాలు మూగబోతాయి. ఆ రంగాలలో పరిశోధనలు ఉండవు. ప్రగతి ఉండదు. విభిన్న ఆలోచనలు ఉన్న సాయిప్రియాంక లాంటి అమ్మాయిలు తాము కొత్త దారిలో ప్రయాణించడమే కాదు ‘మనం ప్రయాణించడానికి, అన్వేషణ కొనసాగించడానికి ఒకే దారి లేదు. ఎన్నో దారులు ఉన్నాయి’ అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఈ కోణంలో సాయిప్రియాంక ‘కృషి’ యువతరంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.సంతోషంగా ఉంది‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజ్’ అనే ్రపాజెక్ట్పై మూడు ప్రత్యేక గ్రామాల్లో నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లాంటి వాటి ఆధారంగా ఈ గ్రామాల్లో ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్‌ను తయారు చేస్తున్నాము. ఇతర గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లో కాస్త మెరుగైన పౌష్టికాహారం అందుతోంది. దక్షిణ ఆసియా దేశాలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.– సాయి ప్రియాంక, వ్యవసాయ శాస్త్రవేత్త పాత బాల ప్రసాద్, సాక్షి, సంగారెడ్డి -
Diwali 2024 పండగొస్తోంది.. ఈజీగా చేసుకునే స్వీట్లు, కుకీస్!
పండుగ వస్తోందంటే గృహిణులకు ఒకటే పని. ఇంటి శుభ్రంనుంచి పిండి వంటల దాకా ఎడతెగని పనులతో బిజీగా ఉంటారు. పెద్దగా హడావిడిగా లేకుండా, సులభంగా, ఆరోగ్యంగా తయారు చేసుకునే కొన్ని వంటల్ని ఇపుడు చూద్దామా.రాగి కుకీస్ కావలసినవి: రాగిపిండి – కప్పు; గోధుమపిండి – కప్పు; చక్కెర పొడి – కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూన్; యాలకుల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – 15 టేబుల్ స్పూన్లు; పాలు – 4 టేబుల్ స్పూన్లు (అవసరమైతేనే వాడాలి).తయారీనెయ్యి కరిగించి పక్కన పెట్టాలి. వెడల్పు పాత్రలో రాగిపిండి, గోధుమ పిండి, చక్కెర పొడి, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి అన్నీ సమంగా కలిసేటట్లు గరిటెతో బాగా కలపాలి. ఇప్పుడు నెయ్యి వేసి మళ్లీ కలపాలి. చపాతీల పిండిలా ముద్దగా వస్తుంది. తగినంత తేమలేదనిపిస్తే పాలు కలపాలి. ఈ పిండి మీద మూత పెట్టి అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒవెన్‌ను 170 డిగ్రీలు వేడి చేయాలి. పిండిని ఫ్రిజ్‌లో నుంచి తీసి పెద్ద నిమ్మకాయంత గోళీలు చేయాలి. ఒక్కో గోళీని అరచేతిలో వేసి వత్తాలి. ఫోర్క్‌తో నొక్కి గాట్లు పెట్టి బేకింగ్ ట్రేలో సర్దాలి ∙ట్రేని ఒవెన్‌లో పెట్టి 12 నిమిషాల సేపు ఉంచాలి. కుకీ మందంగా ఉందనిపిస్తే మరో నిమిషం అదనంగా ఉంచాలి ∙ఒవెన్ లేక పోతే ప్రెషర్ కుకర్‌లో కూడా బేక్ చేసుకోవచ్చు. కుకర్‌లో ఉప్పు చల్లి గాస్కెట్, వెయిట్ తీసేసి మూత పెట్టి వేడి చేయాలి. ఆ తర్వాత కుకీలను అమర్చిన ట్రేని జాగ్రత్తగా కుకర్‌లో పెట్టి సన్న మంట మీద 15 నిమిషాల సేపు ఉంచాలి. అయితే కుకర్‌లో ఒకేసారి అన్నింటినీ బేక్ చేయడం కుదరక పోవచ్చు. కుకర్ సైజ్, ట్రే సైజ్‌ను బట్టి నాలుగైదు సార్లుగా చేయాలి ఈ బిస్కట్లను గాలి చొరబడని బాటిల్లో నిల్వ చేస్తే మూడు వారాల పాటు తాజాగా ఉంటాయి. మిల్క్ బర్ఫీకావల్సిన పదార్ధాలుపాలపొడి – రెండున్నర కప్పులుపంచదార – ముప్పావు కప్పుపాలు – కప్పునెయ్యి – పావు కప్పుపిస్తా పలుకులు – మూడు టేబుల్ స్పూన్లుతయారీ విధానంగిన్నెలో పాలపొడి, పంచదార, పాలు పోసి కలుపుకోవాలి.స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పాలపొడి మిశ్రమం, నెయ్యివేసి సన్నని మంటమీద వేయించాలి.10 నిమిషాల తరువాత మిశ్రమం పాన్ కు అతుక్కోకుండా ఉండకట్టినట్టుగా అవుతుంది. అప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి బేకింగ్ పేపర్ పరిచిన ట్రేలో వేయాలి.ట్రే మొత్తం సమానంగా పరుచుకునేలా మిశ్రమాన్ని వత్తుకోవాలి. పిస్తా పలుకులు వేసి మరోసారి వత్తుకోని, గంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి.రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే మిల్క్ బర్ఫీ రెడీ. -
మునగాకును రోజూ ఇలా తింటే అద్భుతాలు : ఒక్కసారి తింటే!
మునగాకులో ఏ, బీ, సీ విటమిన్లుంటాయి. క్యాల్షియం, పొటాషియం, ఐరన్... మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. తరచూ తింటే చాలా మంచిది. రోజూ కూరల్లో వేసుకుంటే ఇంకా మంచిది. నొప్పిని నయం చేయడంలో,కండరాలను బలోపేతం చేయడంలో మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది చర్మానికి జుట్టు సంరక్షణలో బాగా పనిచేస్తుంది. మునగాకు – పెసరపప్పుకావలసినవి: మునగాకు – 4 కప్పులు; పెసరపప్పు– కప్పు; ఎండు మిర్చి – 1;ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; వెల్లుల్లి రేకలు– 5;ఆవాలు – టీ స్పూన్; ఇంగువ –పావు టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్;మిరపపొడి– అర టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి;పచ్చి కొబ్బరి తురుము– పావు కప్పు; నూనె – 2 టేబుల్ స్పూన్లు;తయారీ: మునగాకులో ఈనెలు లేకుండా ఏరి వేసి ఆకును మంచి నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. పెసరపప్పును కూడా కడిగి సిద్ధంగా ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రేకలు, ఇంగువ వేసి వేగిన తర్వాత పెసర పప్పు వేయాలి. ఇప్పుడు మునగాకు, పసుపు, మిరపపొడి వేసి కలిపి నీరు పోసి మూత పెట్టాలి. ఉడకడం మొదలైన తర్వాత మూత తీసి మరోసారి కలిపి మంట తగ్గించి ఉడికించాలి. నీరు తగ్గి పోయిన తర్వాత కొబ్బరి పొడి, ఉప్పు కలిపి మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. ఇది అన్నం, రోటీల్లోకి బాగుంటుంది. మొరింగా టీమునగాకులో ఈనెలు, చిల్లు పడిన ఆకులు, పండిపోయిన ఆకులను ఏరివేసి శుభ్రంగా కడిగి చిల్లుల ΄ పాత్రలో వేసి నీరు పోయే వరకు ఉంచాలి. తర్వాత ఆకును ఒక పేపర్ మీద కానీ నూలు వస్త్రం మీద కాని వేసి తేమ పూర్తిగా ఆరి పోయే వరకు ఉంచాలి. మునగాకును ఎండ బెట్టకూడదు, నీడలోనే ఆరబెట్టాలి. వాతావరణాన్ని బట్టి ఒకటి లేదా రెండు రోజుల్లో ఆరి పోతాయి.ఆకులను చేత్తో కదిలించినప్పుడు తేమలేకుండా గలగలలాడాలి. ఆకులను మిక్సీ జార్లో మెత్తగా పొడి చేయాలి. పొడిని జల్లించి తేమ లేని సీసాలో నిల్వ చేసుకోవాలి. టీ తయారీ: పావు లీటరు నీటిని మరిగించి అందులో టీ స్పూన్ మొరింగా ΄పౌడర్ వేసి మూత పెట్టాలి. ఓ నిమిషం తర్వాత గ్లాసులో పోసుకుని తాగాలి. రోజూ ఉదయం ఈ మొరింగా టీ తాగితే అధిక బరువు తగ్గుతుంది.గమనిక: ఇలా తయారు చేసుకున్న ΄ పొడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. కూరల్లో, పప్పులోకి తాజా మునగాకు దొరకని రోజుల్లో ఈ పొడిని వేసుకోవచ్చు. -
మోకాలి నొప్పి భరించలేకపోతున్నారా? నల్లేరు పచ్చడి చక్కటి ఔషధం
ఔషధ మొక్క నల్లేరు గురించి ఎపుడైనా విన్నారా? అసలు పచ్చడి ఎపుడైనా తిన్నారా? పూర్వకాలంలో పెద్దలు దీన్ని ఆహారంగా వాడేవారు. పోషకాలమయమైన నల్లేరు చేసే మేలు చాలా గొప్పదని ఆయుర్వేదం చెబుతోంది. నల్లేరు ప్రకృతి ప్రసాదించిన వరం. దీన్నే వజ్రవల్లి అని కూడా పిలుస్తారు. అంటే వజ్రంలాంటి శక్తినిస్తుందన్నమాట. నల్లేరు కాడలతో చేసిన పచ్చడి మోకాళ్లు, నడుము నొప్పులను, బీపీ షుగర్ సహా పలు రకాల వ్యాధులను బాగా తగ్గిస్తుందని చెబుతారు.నల్లేరు (సిస్సస్ క్వాడ్రాంగులారిస్) తీగలోని ప్రతి భాగాన్ని వివిధ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఆంగ్లంలో వెల్డ్ గ్రేప్ అని పిలుస్తారు. ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, పైల్స్,మధుమేహం వంటి అనేక వ్యాధులను నయం చేయడానికి దీన్ని వాడతారు.నల్లేరు పచ్చడికావలసినవి10 నల్లేరు కాడలు, తరిగినవి ( లేత కాడలు అయితే బావుంటాయి.) ½ కప్పు వేరుశెనగలు కొద్దిగా చింతపండు రెండు ఎర్ర మిరపకాయలు నాలుగు లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పసుపు ధనియాలు, పచ్చిమిర్చి పోపు దినుసులు జీలకర్ర ,తాజా కొత్తిమీరతయారీముందుగా లేత నల్లేరు కాడలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి, చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక బాణలిలో వేరుశెనగలను వేయించి పక్కన పెట్టండి. అదే బాణలిలో కొత్తిమీర, జీలకర్ర, ఎర్ర మిరపకాయలను సువాసన వచ్చేవరకు వేయించాలి. చల్లారనిచ్చి వీటిని మెత్తగా మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత నూనె వేడి చేసి, తరిగిన నల్లేరు కాడలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఈ ముక్కల్లో పల్లీల మిశ్రమం, చింతపండు, వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తరువాత ఆవాలు, శనగ పప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి ఈ పచ్చడిని పోపు పెట్టాలి. దీన్ని ఒక నిమిషం పాటు ఆ నూనెలో మగ్గనిచ్చి తాజాగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే రుచికరమైన నల్లేరు పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో, రవ్వంత నెయ్యి వేసుకుని తింటే జిహ్వకు భలే ఉంటుంది. ఇది ఫ్రిజ్‌లో ఒక వారం పాటు నిల్వ ఉంటుంది. (మురారి మోపెడ్ సంబరం, రూ. 60వేలతో డీజే పార్టీ...కట్ చేస్తే!)లాభాలునల్లేరు కాడలతో చేసిన పొడిని రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చునల్లేరులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపులను తగ్గిస్తాయి. నల్లేరు ఆస్పిరిన్ వలె ప్రభావవంతంగా పనిచేస్తుంది.రక్తహీనత నివారణలో సహాయపడుతుంది.నల్లేరు బహిష్టు సమస్యలకు చక్కటి పరిష్కారంనల్లేరులో పీచు పదార్థం యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.నోట్ : మోకాలి నొప్పికి కారణాలను నిపుణులైన వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. వారి సలహా మేరకు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. శరీరంలో విటమిన్ డీ, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండేలా జాగ్రత్తపడాలి. -
కళ, సంస్కృతి, కవిత్వాన్ని ప్రేరేపించే చేప కథ
అనేక బెంగాలీ కుటుంబాలకు వారి ప్రియమైన ఇలిష్ (హిల్సా) లేకుండా దుర్గా పూజ అసంపూర్ణంగా ఉంటుంది. అది లేనిదే పూజ అసంపూర్తిగా ఉంటుందని భావించి కొందరు అమ్మవారికి ఈ చేప వంటకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. హిల్సా వంటకం కేవలం పాక ఆనందాన్ని మాత్రమే కాకుండా వారి సంస్కృతిపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ ’జీవనాళం’ గుండా ఈదుతూ, పండుగలు, వేడుకలలో కనిపిస్తుంది.హిల్సా వెండి మెరుపు, అద్భుతమైన రుచి రారమ్మని ఆహ్వానిస్తాయి. బెంగాలీ–అమెరికన్ ఆహార చరిత్రకారుడు చిత్రిత బెనర్జీ ఈ చేప సాంస్కృతికతను సంపూర్ణంగా అక్షరీకరించారు. దీనిని ‘జలాల ప్రియత‘, ‘చేపలలో రాకుమారుడు‘గా అభివర్ణించారు.హిల్సా కథ పండుగలు, డైనింగ్ టేబుల్‌కు మించి విస్తరించి ఉంది. శతాబ్దాలుగా, ఇది సాంప్రదాయ కాళీఘాట్ పెయింటింగ్స్‌లో లేదా సమకాలీన వర్ణనలలో గంభీరమైన, మత్స్యకన్య లాంటి దేవతగా – కవులు, రచయితలు, కళాకారుల కల్పనలను ఆకర్షించింది.ఒక సాహిత్య వ్యవహారంహిల్సాతో బెంగాలీ ప్రేమ, దాని సాహిత్య సంప్రదాయంలో క్లిష్టంగా అల్లింది. 18 ఉపపురాణాలలో ఒకటైన బృహద్ధర్మ పురాణంలో సనాతనవాదులు దాని వినియోగాన్ని చర్చించినప్పటికీ, చేపలు బ్రాహ్మణులకు రుచికరమైనది అని ప్రశంసించారు. ‘బ్రాహ్మణులు రోహు (బెంగాలీలో రుయి), చిత్తడి ముద్ద (పుంటి), స్నేక్‌హెడ్ ముర్రెల్ (షూల్), ఇతర తెల్లటి, పొలుసుల చేపలను తినవచ్చని ఈ పాఠం చెబుతోంది‘ అని గులాం ముర్షీద్ తన పుస్తకం, బెంగాలీ కల్చర్ ఓవర్ ఎ థౌజండ్‌లో రాశారు. -
సెంచరీ కొట్టిన టమాటా, మీరు మాత్రం అతిగా తినకండి!
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. భారీ వర్షాలకు పంట దెబ్బతినడం, సప్లయ్ తగ్గిపోవడంతో ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశం వైపుచూస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టమాటా కిలో ధర 100 రూపాయలు పలుకుతోంది. దీనికి తోడు నవరాత్రి ఉత్సవాలు, అన్నదానాల హడావిడి మధ్య డిమాండ్ మరింత పెరిగింది. నిజానికి ప్రతి కూరలో టమాటా వాడటం అలవాటుగా మారిపోయింది. కూరకు రుచిరావడంతోపాటు, మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తాయి కూడా. అయితే అందని ద్రాక్ష పుల్లన అనుకొని వేరే ప్రత్యామ్నాయాల్ని వెదుక్కోవాలి. అన్నట్టు టమాటాలు అతిగా తినకూడదు. తింటే ఎలాంటి నష్టాలుంటాయి? తెలుసుకుందాం. విటమిన్ సి, విటమిన్ కె, ఫోలెట్, పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంco సూపర్ ఫుడ్ టమాటా. టమాటాల్లో ఉండే లైకోపీన్ కొలన్, ప్రొస్టేట్, లంగ్ కేన్సర్లను అడ్డుకుంటుంది. డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలున్నవారికి కూడా టమాటాలు మేలు చేస్తాయి. టమాటా ధర పెరిగితే ఏం చేయాలి?ఏ కూరగాయ అయినా ధర పెరిగితే మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సిందే. టమాటా విషయంలో అయితే చింతపండు, పుల్లగా ఉండే ఆకుకూరలను ఎంచుకోవాలి. అలాగే టమాటాలు చవకగా లభించినపుడు సన్నగా తరిగి, బాగా ఎండబెట్టి ఒరుగుల్లా చేసుకొని నిల్వ చేసుకుంటే కష్టకాలాల్లో ఆదుకుంటాయి.అతి ఎపుడూ నష్టమే, ఎవరెవరు తినకూడదు?టమాటా ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వంకాయలు, దుంపకూర ల్లాగానే టమాటాలతో కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. సోలనిన్ అనే సమ్మేళనం కారణంగా ఆర్థరైటిస్, కీళ్లు, మోకాళ్ల నొప్పులను ఇంకా పెంచుతుంది. ఇప్పటికే ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉంటే టామాటా వినియోగాన్ని తగ్గించడం ఉత్తమం.టమాటా గింజల్లో ఉండే ఆక్సలేట్ కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది. టమాటాలు కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న టమాటాలకు దూరంగా ఉండాలని చెబుతారు. ఇంకా జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట వంటి సమస్యలొస్తాయి. వీటిల్లోని మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ మన శరీరంలోకి ఎక్కువగా చేరితే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన రక్తంలో ఎక్కువగా చేరితే లైకోపెనోడెర్మియా వస్తుంది. రోజుకు 75 మిల్లీగ్రాముల మోతాదు మించితే ఈ సమస్య వస్తుంది. -
రాగులతో దూదుల్లాంటి ఇడ్లీ, రుచికరమైన ఉప్మా : ఇలా చేస్తే ఎవ్వరైనా ఫిదా!
తృణధాన్యాల్లో ప్రముఖమైనవి రాగులు (finger millets). రాగులతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాల ఉన్నాయి. రాగులలో ప్రోటీన్ , ఫైబర్స్ వంటి స్థూల పోషకాలతో పాటు, కాల్షియం, మెగ్నీషియం, మెథియోనిన్, లైసిన్ ,అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. కాబట్టి చిన్న పిల్లలతోపాటు, వృద్ధులకూ ఆహారంగా ఇవ్వవచ్చు. రాగులతో రకరకాలుగా వంటకాలను తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం.ఇడ్లీని సాధారణంగా బియ్యం ,మినప్పప్పుతో తయారు చేస్తారు.కానీ హెల్తీగా రాగులతో కూడా ఇడ్లీ తయారు చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రాగుల పిండి ఒక కప్పు సూజీ/రవ్వ) ఒక కప్పు పుల్లని పెరుగుతాజా కొత్తిమీర (సన్నగా తరిగినవి)ఉప్పు (రుచి కి తగినంత ) అర టీస్పూన్ బేకింగ్ సోడాపోపుగింజలుకావాలంటే ఇందులో శుభ్రంగా కడిగి తురిమిన క్యారెట్ ,ఉల్లిపాయకూడా కలుపుకోవచ్చు.తయారీ : పిండి తయారీ వెడల్పాటి గిన్నెలో పిండి, రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎర్ర/ఎండు మిరపకాయలు, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పపిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి.ఇడ్లీ తయారీ: దీన్ని ఇడ్లీ కుక్కర్లేదా, ఇడ్డీపాత్రలో ఆవిరి మీదకొద్దిసేపు హైలో , తరువాత మీడియం మంటమీద ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకోని, తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రాగి ఇడ్లీ రెడీ. అల్లం, పల్లీ, పుట్నాల చట్నీతోగానీ,కారప్పొడి నెయ్యితోగానీ తింటే మరింత రుచిగా ఉంటుంది. (నవరాత్రుల ఉపవాసాలు : ఈజీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడీ)రాగి ఉప్మా కావలసినవి: రాగి రవ్వ– కప్పు; నీరు – రెండున్నర కప్పులు; ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివే΄ాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; వేరుశనగపప్పు – 3 టేబుల్ స్పూన్లు; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – అర టేబుల్ స్పూన్; మినప్పప్పు టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఒక నిమ్మకాయతయారీ: రాగి రవ్వను కడిగి నీటిని వడపోయాలి. రవ్వ మునిగేటట్లు నీటిని పోసి అరగంట సేపు నాన పెట్టాలి. తర్వాత నీటిలో నుంచి రవ్వను తీసి పిడికిలితో గట్టిగా నొక్కి నీరంతా ΄పోయేటట్లు చేసి (ఇడ్లీ రవ్వలాగానే) పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగిన తర్వాత అందులో ఉల్లియ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రవ్వ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ఈ లోపు పక్కన మరో స్టవ్ మీద నీటిని వేడి చేయాలి. రవ్వ వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఉప్పు వేసి నీటిని పోసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి మళ్లీ మూత పెట్టాలి ∙. రాగి రవ్వకు బొంబాయి రవ్వకంటే ఎక్కువ నీరు పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని, రవ్వ ఉడకలేదు అనుకుంటే కాసిన్ని నీళ్లు జల్లి మూత పెట్టుకోవాలి. అంతే వేడి వేడి రాగి ఉప్మా రెడీ. ఈ ఉప్మాను పల్లీ, అల్లం, మరేదైనా మనకిష్టమైన చట్నీతోగానీ తినవచ్చు.ఇవీ చదవండి : రాగిజావ రోజూ తాగుతున్నారా? ఇవి తెలుసుకోండి!రాగిముద్ద-నాటుకోడి పులుసు సూపర్ కాంబో -
నవరాత్రుల ఉపవాసాలు : ఈజీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడీ
దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యం అనగానే పులిహోర, పాయసంలేదా క్షీరాన్నం గుర్తొస్తాయి. తొమ్మిది రోజుల పాటు, తొమ్మిది అవతారాల్లో జగన్మాతకు మొక్కుతారు. తొమ్మిది రకాల నైవేద్యాలతో దుర్గాదేవిని పూజిస్తారు. ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తూ రెండోపూట పండ్లు, ఫలహారాలతో ఉపవాసాలు కూడా చేస్తారు. మరి ఉపవాస సమయంలో రాత్రిపూట తేలిగ్గా జీర్ణమయ్యే సగ్గుబియ్యంతో చేసుకునే కిచిడీ గురించి తెలుసుకుందాం.సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.సులభంగా తయారు చేసుకోవచ్చు కూడా. సగ్గుబియ్యంలో ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి.సగ్గుబియ్యం లేదా సాబుదానా కిచిడీకి కావాల్సిన పదార్థాలుసగ్గుబియ్యం, ఒక కప్పు, ఒక బంగాళదుంప - పెద్దది అయితే ఒకటి, చిన్నవి రెండుపచ్చిమిరపకాయలు నాలుగైదు,నెయ్యి , కొద్దిగా అల్లం ముక్క,ఉప్పు, తయారీసగ్గుబియ్యాన్ని నీటిలో కడిగి, నీళ్లు తీసేసి మూడు గంటలు నానబెట్టాలి.పల్లీలను వేయించి, పొట్టుతీసి, చల్లారాక కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి.అలాగే బంగాళాదుంపును ఉడికించి పొట్టు తీసి చిన్న ముక్కులుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టి కొద్దిగి నెయ్యి వేసుకోవాలి. ఇది వేడెక్కాక జీలకర్ర, అల్లం, పచిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇపుడు ఉడికించిన ఆలూ ముక్కల్ని వేసుకోవాలి. బాగా వేగిన తరువాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేయాలి. కొద్ది సేపు వేగాక, రెండు కప్పుల నీళ్లు పోసి సన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇపుడు పల్లీల పౌడరు వేసి బాగా కలపాలి. ఒక్కసారి రుచి చూసుకొని కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. సగ్గుబియ్యం చాట్సగ్గుబియ్యం చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సగ్గుబియ్యం, ఉడికించి, తరిగిన బంగాళాదుంప ముక్కలు, టమోటా,కప్పు చట్నీ, ఫాస్టింగ్ రాక్ సాల్ట్, నల్ల మిరియాలు, వేరుశెనగలు, చీజ్ అవసరం.తయారీ ముందుగా సగ్గుబియ్యాన్నినీటిలో గంటసేపు నానబెట్టాలి. తరువాత వేరుశెనగలను వేయించాలి. ఇప్పుడు బంగాళదుంపలను ఉడకబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి పెరుగు, చట్నీ కలపండి. ఉప్పు, మసాలాలు వేసి బాగా కలపాలి. అంతే సగ్గుబియ్యం చాట్ రెడీ -
సొరకాయతో లాభాలెన్నో, బరువు కూడా తగ్గొచ్చు
మనం తినే ఆహారంలో తీగజాతి, దుంప ఇలా అన్ని రకాల కూరలు, ఆకుకూరలను చేర్చుకోవాలి. ముఖ్యంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో కూరగాయల తోటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. బీర, సొరకాయలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. ఈరోజు సొరకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సొరకాయతో శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.సొరకాయలో విటమిన్ బీ, విటమిన్ సీ, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో నీరు ,కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో అయితే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి సొరకాయ ఎంతగానో సహాయపడుతు సొరకాయతో పప్పు చట్నీ, సాంబార్, కర్రీ, ఇలా ఎన్నో వంటలను చేసి తినొచ్చు. ఇంకా సూప్‌లు లేదా స్మూతీ వంటి ఎన్నో రూపాల్లో తీసుకోవచ్చు. సొరకాయ జ్యూస్ న్యాచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది.సొరకాయతో ప్రయోజనాలురక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సొరకాయలో మెండుగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు చాలా మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది.సొరకాయతో గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. సొరకాయలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. మెగ్నీషియంతో కండరాలు బలపడతాయి. కాల్షియం కూడా మెండుగా ఉంటుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సొరకాయ సహాయపడుతుంది. సొరకాయలో కూడా విటమిన్ సీి మెండుగా ఉంటుంది. ఎన్నో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, ఇతర రోగాలను అడ్డుకుంటుంది. -
రాగిముద్ద-నాటుకోడి పులుసు సూపర్ కాంబో
మిల్లెట్లతో చేసుకునే ఆరోగ్యకరమైన ఆహారం అనగానే ముందుగా గుర్తొచ్చే వాటిల్లో ఒకటి రాగులు. రాగులు లేదా ఫింగర్ మిల్లెట్స్‌తో రక రకాల వంటకాలను చేసుకోవచ్చు. ఇపుడు మాత్రం రాగిముద్దను ఎలా చేసుకోవాలో చూద్దాం.చిరుధాన్యాల్లో అతి ముఖ్యమైన రాగులలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్ ఎక్కువగా లభిస్తాయి. కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం. గ్లూటెన్ లోపంతో బాధపడేవారు దీన్ని తీసుకోవచ్చు. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా సులభంగా జీర్ణమవుతుంది కూడా.కావలసిన పదార్థాలు : రాగుల పిండి - 2 కప్పులు, నెయ్యి - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి తగినంతతయారీముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లను బాగా మరిగించాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. ఇంతలో రాగి పిండి కొద్ది నీళ్లు పోసి కలపుకావాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో రాగి పిండిని మెల్లగా వేయాలి. మిశ్రమం చిక్కగా బుడగలొస్తాయి. ఇపుడు మంటను పూర్తిగా తగ్గించి, మరికొంచెం పిండిని కలపాలి. గట్టి చెక్క కర్ర లేదా గరిటె అయితే కలపడానికి ఈజీగా ఉంటుంది. తక్కువ మంటతో నెమ్మదిగా కలుపుతూ ఉంటే పిండి ముద్దగా అవుతుంది. కావాలనిపిస్తే ఇంకొంచెం పిండి కలుపుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారాక చేతిలో నెయ్యి రాసుకుని నిదానంగా మెత్తగా ముద్దలా చేసుకోవాలి. అంతే రాగి ముద్ద రెడీ. పర్ఫెక్ట్గా చేసిన రాగి ముద్ద వేళ్లతో తాకినప్పుడు అంటుకోకుండా ఉంటుంది. ఇదే తరహాలో మరికొందరు రాగుల పిండిలో నూకలు లేదా బియ్యంతో కలిపి కూడా రాగిముద్ద లేదా సంకటి చేసుకుంటారు.ఎలా చేసినా వేడి వేడి నాటుకోడి పులుసు, మటన్ సూప్‌తో రాగిముద్దను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇంకా పప్పు లేదా సాంబారు, గోంగూర పచ్చడి కాంబినేషన్ కూడా అదిరి పోతుంది. ఇదీ చదవండి: భార్యామణికోసం ఏకంగా ఐలాండ్నే కొనేసిన వ్యాపారవేత్త?! -
సోయా ఆకుతో బరువు తగ్గొచ్చు.. ఇంకా ఆశ్చర్యకర ప్రయోజనాలు
ఆకుకూరల్లో చాలారకాలు ఉన్నాయి. కొన్ని ప్రజాదరణ పొందినవి అయితే.. మరికొన్ని చాలామందికి తెలియదు. అలాంటిదే సోయకూర. సోయా ఆకు తినడం ద్వారా మంచి పోషకాలు శరీరానికి అందుతాయి. చిన్నగా, సన్నగా పొడవుగా చూడటానికి కొత్తిమీరలా కనిపించే ఆ ఆకు కూరను సోయ, సావా, సోవా లేదా దిల్ లీవ్స్ అని పిలుస్తారు. సోయకూరతో లభించే పోషకాల గురించి తెలుసుకుందాం.సోయా మొక్క కూడా సోంఫ్ మొక్కలాగా కనిపిస్తుంది. సోయా ఆకు, గింజలను సువాసన కోసం ఉపయోగిస్తారు కూడా. ఆయుర్వేదంలో ఒక బలవర్ధకమైన ఆకుగా వాడుకలో ఉంది. విటమిన్ సీ, ఏ, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. సోయా ఆకు అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. చక్కెర వ్యాధిని అదుపు చేస్తుంది. ముఖ్యంగా నెలసరి, ప్రసవ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. విటమిన్ సీ, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులోని మాంగనీస్ నాడీ వ్యవస్థను బలోపేతం చేసి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్, ఆర్థరైటిస్ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.సోయా ఆకుల్లోని యాంటీ ఇన్ల్ఫమేషన్, యాంటీ ఫ్లాట్యులెన్స్ గుణాలు జీర్ణక్రియకు మంచిది. అజీర్తిని దూరం చేసి, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను నిరోధిస్తుంది. అంతేకాదు మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అల్సర్, ఇతర పొట్ట సమస్యలను నివారించడంలో దీనికి కీలక పాత్ర. గాయాలను నయం చేయడంలో సాయపడుతుంది. బరువు నియంత్రణలోసోయా ఆకులో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ కాబట్టి, ఊబకాయాన్ని నియంత్రించవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌తో పాటు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కూడా తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. తద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. రోజూ ఉదయం గ్రీన్ టీలాగా లేదా సోయా ఆకులను నీటిలో మరిగించి వడకట్టి తాగితే శరీరంలోని కొవ్వు వేగంగా కరిగిపోతుంది.సోయా ఆకుకూరతో పప్పు చేసుకోవచ్చు. పకోడీ, బజ్జీ, పరాటా తయారీలో వాడుకోవచ్చు. పలావ్లో సోయా ఆకులను వాడితే మంచి సువాసన వస్తుంది. ఇంకా సోయా ఆకును కూరల్లో, పచ్చళ్లలో వేసుకోవచ్చు , పిజ్జా, బర్గర్, సలాడ్స్‌లో కూడా వాడతారు. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? బనానా స్టెమ్ జ్యూస్ ట్రై చేశారా?
మనిషి ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలకు మూలం ప్రకృతి. కానీ చాలావరకు ప్రకృతి సహజంగా లభించే మూలికల గురించి మొక్కల గురించి నేటి తరానికి అవగాహన కరువుతోంది. ఈ నేపథ్యంలో అలాంటి వాటి గురించి తెలుసు కోవడం, అవగాహన పెంచుకోవడం, ఆచరించడం చాలా ముఖ్యం.అలాంటి వాటిల్లో ఒకటి అరటి పండు. అరటిపండులో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులోని పోషక గుణాలు పిల్లలకీ, పెద్దలకీ చాలా మేలు చేస్తాయి. ఒకవిధంగా అరటి చెట్టులో ప్రతీ భాగమూ విలువైనదే. అరటి ఆకులను భోజనం చేసేందుకు వాడతారు. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసంలో కార్తీక దీపాలను పెట్టేందుకు అరటి దొప్ప ఆధ్యాత్మికంగా చాలా విలువైంది. ఇక అరటి పువ్వుతో పలు రకాల వంటకాలు తయారు చేస్తారు. కానీ అరటి కాండంలోని ఔషధ గుణాల గురించి చాలామంది తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం.అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6, మెగ్నీషియం, విటమిన్ సి, కాపర్, ఐరన్, మాంగనీస్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, ఇతర ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.అధిక స్థాయి చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ చెప్పవచ్చు.ఇందులో కేలరీలు తక్కువ. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వాడటం వల్ల దీర్ఘకాలంలో మలబద్ధకం , కపుడు అల్సర్లను నివారించడంలో ఉపయోపడుతుంది.ఈ జ్యూస్‌లో విటమిన్ బి6 పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. ఇందులో పొటాషియం కూడా లభిస్తుంది.కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నవారికి ఇది సంజీవని లాంటిదని చెప్పవచ్చు. ఇందులోని పొటాషియం , మెగ్నీషియం రాళ్లను నివారిస్తుంది.కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు కూడా మంచిది. గుండె జబ్బులను కూడా అడ్డుకుంటుంది. శరీరంలోని మలినాలు బయటికి పంపింస్తుంది. అధిక బరువు సమస్యకు కూడా చెక్‌పెడుతుంది.బరువు తగ్గడానికి ప్రతిరోజూ 25 గ్రా నుండి 40 గ్రా అరటి కాండం జ్యూస్‌ను తీసుకోవచ్చు.అరటి కాండం రసం శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో పనిచేస్తుంది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణ వ్యవస్థ నుంచి అసిడిటీ వరకూ చాలా సమస్యలు దూరమవుతాయి..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు కూడా పనిచేస్తుంది. శరీరంలోని ట్యాక్సిన్‌ని బయటికి పంపి మూత్ర నాళాన్ని శుభ్రపరచడానికి సాయపడుతుంది.అరటి కాండం ఆకుపచ్చ పొరను తీసివేసి, లోపల కనిపించే తెల్లటి కాండాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి, 15 నిమిషాలు ఉడకబెట్టి, రోజుకు రెండుసార్లు సేవించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చోట్ల తొట్టెల్లో అరటి కాండాన్ని ఊరబెట్టి, ఆ నీటిని వడపోసి ఔషధంగా వాడతారు. శుభ్రం చేసి కట్ చేస్తే మజ్జిగలో నానబెట్టి ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవచ్చు.దక్షిణ థాయ్‌లాండ్‌లో, తీపి , పుల్లని కూరగాయల సూప్ లేదా కూరలో సన్నగా తరిగిన అరటి కాడను కలుపుతారు. సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా దుష్ప్రభావాలను కలిగి లేనప్పటికీ, అలెర్జీ, కడుపు నొప్పి, వాంతులు, అలర్జీ రావొచ్చు. ఒక్కోసారి లే కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగించే అవకాశంఉంది. అయితే, వ్యక్తి వైద్య చరిత్ర , అరటి కాండం పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా రూపంలో తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు మితంగా ఉండాలి. నోట్: అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే .వైద్య నిపుణుడు, పోషకాహార నిపుణుడు లేదా డైటీషియన్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. -
యువతలో పోషకలోపం..
దేశంలో 81 శాతం మంది యువత పోషకాహార లోపంతో బాధపడుతున్నారని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రదిన్, నేషనల్ న్యూట్రిషన్ వీక్ సంయుక్తంగా విడుదలచేసిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఈ సర్వేలో 20 మిలియన్ల మంది 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు గల యువత నుంచి అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. 96 శాతం మంది భారతీయులు తమకు అవసరమైన సూక్ష్మపోషకాలు, మలీ్టవిటమిన్లు అందుబాటులో లేవని భావిస్తున్నారని పేర్కొన్నారు. మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రధానంగా ఉదయం లేచింది మొదలు,నిత్యం ఉద్యోగంలో, ఇతర పనుల్లో అన్ని స్థాయిల్లోనూ వేగంగా అలసటకు గురవుతున్నారట. పెరుగుతున్న పోషకాహార లోపంపై అవగాహన కలి్పంచడం, స్వీయ సంరక్షణను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని సూచిస్తోంది. సర్వే సంస్థ వన్ నేషన్ 100% న్యూట్రిషన్ మిషన్‌లో భాగంగా ఉద్యోగ, శ్రామిక జనాభాలో అలసట పెరుగుతోందని తేలింది. ఈ సమస్యకు గల కారణాలు, పరిష్కార మార్గాలు, తక్షణ పోషక విలువలు మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు అందులో వివరించారు. విధి నిర్వహణలో 83 శాతం మంది అలసట కారణంగా తరచూ విరామాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. 74 శాతం మంది పగటిపూట నిద్రతో ఇబ్బంది పడుతున్నారు. 69 శాతం మంది పనులు ప్రారంభించడం లేదా పూర్తి చేయడం కష్టంగా ఉందని తెలిపారు. 66 శాతం మంది రోజువారీ కార్యకలాపాలను పూర్తి చేయలేకపోతున్నామని, 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు వారిలో 78% మంది, 36 ఏళ్ల నుంచి 45 ఏళ్లలో 72% మంది పగటిపూట మగతగా ఉంటున్నారని అభిప్రాయపడ్డారు.ముందే గుర్తించారు.. యువతలో అలసట పెరగడం చాలా మంది ఆరోగ్య నిపుణులు గుర్తించారు. పోషకాహార అంతరాలను తగ్గించడానికి మలీ్టవిటమిన్లను ప్రోత్సహించడం ద్వారా 70% వరకూ అవసరమైన సూక్ష్మపోషకాలను అందించవచ్చు. రోజువారీ సప్లిమెంట్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. – డాక్టర్ కేతన్ కె మెహతా, సీనియర్ కన్సల్టెంట్ ఇంటికి వచ్చేసరికే నీరసం.. నగర జీవనంలో శారీరక వ్యాయామం తగ్గుతోంది. నిత్యం పని ఒత్తిడి ఉంటోంది. ఇటువంటి సందర్భంలో అలసటకు గురవుతున్నాం. దీనికి తగ్గట్లే ఆఫీస్‌లో విరామం ఇస్తున్నారు. ఇంటికి వచ్చే సరికి నీరసం అనిపిస్తుంది. సెలవు రోజుల్లో ప్రశాతంగా రెస్ట్ తీసుకోవడానికే ఇష్టపడుతున్నాం. – ఆలేటి గోపి, సాఫ్ట్వేర్ ఉద్యోగి, కొండాపూర్ -
రాగిజావ రోజూ తాగుతున్నారా? ఇవి తెలుసుకోండి!
ఇటీవలి కాలంలో ఆహారం, ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరుగుతోంది. ఈ క్రమంలో ఆర్గానిక్ ఫుడ్, మిలెట్స్పై మరింత ఆసక్తి చూపిస్తున్నారు జనం. అలాంటి వాటిల్లో ఒకటి రాగులు లేదా ఫింగర్ మిల్లెట్స్. దీనిలోని ప్రయోజనాల కారణంగా మరింత ప్రజాదరణ పొందాయి. చవకగా దొరుకుతాయి కూడా. రాగుల జావ లేదా మాల్ట్ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం!జీర్ణశక్తిని పెంచుకోవాలనుకున్నా, మధుమేహాన్ని తట్టుకోవాలనుకున్నా, లేదా మీ ఆహారాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోవాలనుకున్నా, అవసరమైన అన్ని పోషకాలతో నిండిన సూపర్‌ఫుడ్ రాగుల పిండితో చేసుకొనే జావ.రాగుల లడ్డు, రాగుల పిండితో మురుకులు ఇలా రాగులతో తయారు చేసే పదార్థాల్లో రాగిజావ, రాగి ముద్ద బాగా పాపులర్. రాగి జావ తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలనుంచి విముక్తి లభిస్తుంది. సీ, ఈ విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు, కొవ్వులు, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి. బి కాంప్లెక్స్, థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి.రాగి జావతో ఆరోగ్య ప్రయోజనాలుజీర్ణక్రియకు మంచిది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. రాగిజావలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతినిస్తుంది. ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి.మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. రాగి జావలో పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్,మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రిస్తాయి. గుండె కండరాల పనితీరు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రాగి జావ సహజ ఇనుముకు గొప్ప మూలం. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.ఎముకలు బలోపేతం: రాగుల్లో కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది.అధిక బరువుకు చెక్ చెబుతుంది. కాలేయ వ్యాధులను తగ్గిస్తుంది. రాగి జావ తయారీరాగులను శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని పొడి చేసుకోవాలి. మరుగుతున్న ఒక గ్లాసు నీళ్లలో, ఒక టీ స్పూన్ రాగుల పిండి వేసి, కలుపుతూ ఉడికించుకోవాలి. దీనికి మజ్జగ, ఉప్పు కలుపుకొని తాగవచ్చు. లేదా పచ్చిమిర్చి ఉల్లిపాయల ముక్కలతో కలిపి తాగవచ్చు. బెల్లం, నెయ్యి వేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు. రాగులను మొలకలు వచ్చేలా చేసి, వాటిని ఎండబెట్టి, పొడి చేసుకొని కూడా జావ చేసుకోవచ్చు. ఈ పొడిని తడిలేని గాజు సీసాలో భద్రం చేసుకోవచ్చు.